మిస్సన్న గారు, ఈ బ్లాగును వర్ణించు మీ సీస పద్యము బాగున్నది. పండిత నేమాని వారి సీసపద్యము బాగున్నది. తగిన మాటలే చెప్పినారు. అయ్యా, చిన్న సందేహము. దేహమను భ్రాంతి వీడుచు దేహిననుచు ఈ పాదము లో మీ ఉద్దేశ్యము " దేహిననెడు దేహపు భ్రాంతి వీడుచు " అనియేనా? లేక ఇంకేమైనా అంతరార్థము ఉన్నదా?
తమ్ముడు చి డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు. నీ పద్యము మంచి భావముతో కూడుకొని యున్నది. 3వ పాదములో సత్య శోధనందుకి బదులు సత్య శోధనమున అందాము. అలాగే గోష్ఠి అని 4వ పాదములో సవరించుదాము. స్వస్తి.
అమ్మా లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు. దేహిననుచు నాత్మ చింతన జేయుచు - అనే ప్రయోగములో ఎట్టి దోషము కానీ సందేహము కానీ నాకు తోచుట లేదు. దేహమును ధరించినవాడు దేహి (ఆత్మ) అని చెప్పుకొనినాము కదా. స్వస్తి.
అయ్యా, ఇప్పుడు మీ భావము అర్థము అయినది. ఇంతవరకూ నేను "దేహి" అను పదమునకు దేహమే నేను అని భావించువాడు అని తలచినాను. శ్రమ అనుకోక నా సందేహ నివృత్తి చేసినందుకు అనేక ధన్యవాదములు.
సాహిత్యపు చర్చలెన్నియొ జరుగుచుండు
రిప్లయితొలగించండినిచట సద్గోష్ఠి యనిఁ జెప్ప నిదియె కనుడు
వాణి దీవన లందిన పండితులిట
పలుకుచుంద్రు సంగతులను బాగుగాను.
రిప్లయితొలగించండిచర్చలన్ని కూడ సద్గోష్ఠి కాబోవు
అన్ని సభలు కూడ నటులె యున్నె
రాగకోపతాప రహితమౌ చర్చకే ,
యట్టి పేరు బెట్ట నర్హమౌను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసద్గురు బోధల వెలుగులు
రిప్లయితొలగించండిహృద్గగనమునందు నింపు చేకాలమునన్
సద్గోష్టి సలుప వారికి
సద్గతులే గలుగు భువిని సత్యము సుమ్మీ !
రిప్లయితొలగించండిసద్ఘో ష్టి తెలివి నిచ్చును
సద్ఘోష్టియె మనల జేయు సత్పు రు షుం గాన్
సద్గోష్టి విలువ యైనది
సద్ఘోష్టిని మాన కెపుడు జరుపుము నెపుడున్
నిజము బలికి దాన నిర్దుష్టముగ గాను
రిప్లయితొలగించండిఋజువు జూప వలదె యింపు గాను ?
సత్యశోధ నందు సరసజ్ఞులు సలుపు
గోష్టి వలన గూడు గుణము లెన్నొ !
సాధు పదముల పైన చక్కని చర్చలు
రిప్లయితొలగించండి............సంధి సమాసాల సంగతులును
వ్యావహారికముపై వాడి వాదనలును
............గ్రాంధిక భాషపై కదన సరళి
వ్యాకరణమ్ముపై పండిత సూత్రాలు
............ఛందస్సు పైనను చాల నుడులు
ఖండ యతులపైన ఖండన మండనల్
............సరస యతులపైన సరసములును
సరస సౌహార్ద్ర హృదయాల సంగమమ్ము
కవి ప్రకాండుల దివ్యమౌ కలయికయును
శంకరాభరణము మించు సజ్జనాళి
గోష్టి మరియొక టున్నదే శిష్టులార!
సత్తన పరమాత్మ, సచ్చిదానందాది
రిప్లయితొలగించండి....వివిధ లక్షణముల వెలుగుచుండు
నా యాత్మనుండియే యఖిలాండకోటి బ్ర
....హ్మాండముల్ వెల్వడి యలరుచుండు
నా యాత్మలోనుండు నంశలే సకల భూ
....తమ్ములలో సదా తనరుచుండు
నాత్మ తత్త్వము గూర్చి యవగాహనమొనర్చు
....సద్గోష్ఠులే సదా సార్థకములు
దేహమను భ్రాంతి వీడుచు దేహిననుచు
నాత్మచింతన జేయుచు నఖిల భౌతి
కములయిన బంధములు లేక జ్ఞానతేజ
మొంది పరమపదమ్మును పొందుటొప్పు
(సత్ + అన = సత్తన)
మిస్సన్న గారు,
రిప్లయితొలగించండిఈ బ్లాగును వర్ణించు మీ సీస పద్యము బాగున్నది.
పండిత నేమాని వారి సీసపద్యము బాగున్నది. తగిన మాటలే చెప్పినారు.
అయ్యా,
చిన్న సందేహము.
దేహమను భ్రాంతి వీడుచు దేహిననుచు
ఈ పాదము లో మీ ఉద్దేశ్యము " దేహిననెడు దేహపు భ్రాంతి వీడుచు " అనియేనా? లేక ఇంకేమైనా అంతరార్థము ఉన్నదా?
అమ్మా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిదేహి యనగా దేహము కలవాడు అనగా ఆత్మ అని అర్థము.
దేహ భ్రాంతి బంధములకు మూలము. మనకు 3 దేహములుండును. స్థూల, సూక్ష్మ, కారణ దేహములు. వీనినే త్రిపురములు (రాక్షసులు) అందురు. 3 దేహములు రాక్షసులతో సమానములే. దేహముల యందలి భ్రాంతి పోయి ఆత్మ అనెడు జ్ఞానము కలుగుటయే ఆవశ్యకము. దానికి త్రిపురాసుర సంహర్తలయిన శివ కేశవుల యెడ భక్తి దోహదమగును.
స్వస్తి.
అయ్యా! మిస్సన్న గారూ!
రిప్లయితొలగించండిమీ సీసము చాల బాగుగ నున్నది. గోష్టి శబ్దము సాధువు కాదు - గోష్ఠి అనుటయే సాధు ప్రయోగ మగును. స్వస్తి.
తమ్ముడు చి డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండినీ పద్యము మంచి భావముతో కూడుకొని యున్నది. 3వ పాదములో సత్య శోధనందుకి బదులు సత్య శోధనమున అందాము. అలాగే గోష్ఠి అని 4వ పాదములో సవరించుదాము. స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువులకు, పెద్దలకు, కవిమిత్రులకు వందనములు.
రిప్లయితొలగించండిసత్పురుషుల తోడ సద్గోష్ఠి జరిపిన
మనము శాంతి నొందు మంచి జరుగు
మర్మములును దెలియు నిర్మోహ మబ్బును
దైవభక్తి మదిని యావహించు
నేమాని పండితార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసాధు పదముల పైన చక్కని చర్చలు
............సంధి సమాసాల సంగతులును
వ్యావహారికముపై వాడి వాదనలును
............గ్రాంధిక భాషపై కదన సరళి
వ్యాకరణమ్ముపై పండిత సూత్రాలు
............ఛందస్సు పైనను చాల నుడులు
ఖండ యతులపైన ఖండన మండనల్
............సరస యతులపైన సరసములును
సరస సౌహార్ద్ర హృదయాల సంగమమ్ము
కవి ప్రకాండుల దివ్యమౌ కలయికయును
శంకరాభరణము మించు సజ్జనాళి
గోష్ఠి మరియొక టున్నదే గురువరేణ్య!
‘సద్గోష్ఠి’ అన్న అంశంపై పద్యాలు వ్రాస్తూ మన బ్లాగు సద్గోష్ఠికి వేదికగా గుర్తించిన మిత్రులకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచక్కని పద్యాలు వ్రాసిన...
లక్ష్మీదేవి గారికి,
కమనీయం గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
మిస్సన్న గారికి,
పండిత నేమాని వారికి,
నాగరాజు రవీందర్ గారికి,
అభినందలు, ధన్యవాదాలు.
అన్నయ్యగారికి గురువర్యులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువు గారు,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
అయ్యా,
"దేహమను భ్రాంతి వీడుచు " అనిన తర్వాత దేహి ననుచు అని అంటే వ్యతిరేకార్థము వస్తున్నదనేదే నా సందేహము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమ్మా లక్ష్మీ దేవి గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
దేహిననుచు నాత్మ చింతన జేయుచు - అనే ప్రయోగములో ఎట్టి దోషము కానీ సందేహము కానీ నాకు తోచుట లేదు. దేహమును ధరించినవాడు దేహి (ఆత్మ) అని చెప్పుకొనినాము కదా. స్వస్తి.
సద్గుణము లేని తావుల
రిప్లయితొలగించండిసద్గోష్టి సలిపి నంత సంతస మొందన్ !
దుర్గమము దుష్ట జనులతొ
సద్గతు లను పొంద లేము సారూప్యము గన్ 1
అయ్యా,
రిప్లయితొలగించండిఇప్పుడు మీ భావము అర్థము అయినది.
ఇంతవరకూ నేను "దేహి" అను పదమునకు దేహమే నేను అని భావించువాడు అని తలచినాను.
శ్రమ అనుకోక నా సందేహ నివృత్తి చేసినందుకు అనేక ధన్యవాదములు.
అక్కయ్యా,
రిప్లయితొలగించండిరెండవపాదములో జగణము పడలేదు.
మూడవపాదములో ప్రాసను మరిచినారు.
మీ భావము బాగున్నది.
అక్కయ్యగారు,
రిప్లయితొలగించండిఈ విధముగా సవరించవచ్చునేమో చూడండి.
సద్గుణము లేని తావుల
సద్గోష్టి సలుప ననంత సంతోషమ్మే?
సద్గతి దుష్టులఁ జేరిన
నుద్గమమగునే,మరిమరి యోచింపంగన్.
లక్ష్మీదేవి గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ సందేహం నాకూ కలిగింది. నేమాని పండితుల వివరణతో అది తీరింది.
అవును కదా ! సోదరి మంచి సవరణ చేసారు. చాలా సంతోషం గా ఉంది.నేను గమనించనేలేదు .మరి సవరించిన పద్యం
రిప్లయితొలగించండిసద్గుణము లేని తావుల
సద్గోష్టి సలుప ననంత సంతోషమ్మే
సద్గతి దుష్టుల జేరిన
నుద్గమ మగునే మరి మరి యోచిం పంగన్ !
పలుకుటయె గాక యితరులు పలుకు నపుడు
రిప్లయితొలగించండివినుచు వీక్షించి గ్రహియింత్రు విమల మతులు
పరుల భావంబు ; లా తీరు ఫలము లొదవు
ధరణి సద్గోష్ఠు లలరగ సరస కరణి
మిస్సన్నగారు, సంతోషమండి.
రిప్లయితొలగించండిమూర్తిగారు,
మీ పలుకు సూక్తి వలె ప్రశంసనీయముగా నున్నది.
లక్ష్మీదేవి గారూ ! కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండి