ధన కనక వస్తు వాహనఘన సంపదలను పిపాస కలిగి వినీతుల్పెను భూతములై నరత్వమును మరచి చరించు గతులు పోవుట యెపుడో?
పండిత నేమాని వారూ,నమస్కారం.మూడవ పాదంలో మూడవ గణం జగణమైంది.
ఘన పిపాసనుఁ గల్గినఁ గలుగ వలయుముక్తి మార్గమందు , కలుగు మోక్షమపుడు.ధన పిపాసనుఁ గల్గినఁ జనన మరణమార్గమున తిరుగుచునుంద్రు మనుజులెపుడు.
అయ్యా! శ్రీ శంకరయ్య గారూ శుభాశీస్సులు.పొరపాటును గుర్తు చేసినందులకు ధన్యవాదములు. "నరత్వమును"కి బదులుగా "ధర్మమ్మును" అని మర్చుదాము. స్వస్తి.
సాహితీ పిపాస e-లోకాన కామెంటు 'టపాస్' రూపేణ ఈ 'ప్యాస్ భరీ' కార్యేణ మది ఆనంద శంకరాభరణ !~జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తినగ కూడు నిడగ తీరు నాకలియునుద్రావ నీరు నొసగ దాహ ముడుగుఆకటి కలిమి యయి యధికారపు పిపాసగూడు వాని గోడు పూడు నెటులొ ?
అధికారమును బొంది యందల మెక్కిన ...............పదవీ పిపాసతో బ్రదుకు నొకడు అక్రమార్జన రుచి ననుభవించుట జేసి ...............ధనపిపాస నొకండు తాపమొందు మత్తు పానీయముల్ చిత్తు జేయంగను ...............మద్య పిపాసతో మడియు నొకడు పరకాంత పొందుకై పరితపించుచు తాను..............కామపిపాసతో కాగునొకడుకీర్తి, పరపీడనము, హింస, గిల్లికజ్జ ములును నరుల పిపాసలై సలుపుచుండు తీర్చ లేనట్టి దాహము లార్చు సతము పట్టి పీడించు గావున బహుపరాకు.
జనన మరణము లందున గనిన వింత ప్రాణులకు సహజము ప్రేమ పాశ మనగ క్రమము దప్పని పిపాశ క్షణిక మనుచు బ్రతుక లేవన ప్రాణులు వెతల యందు !
కవివర్యులకు,చిత్రకారుల కుండును లలితమైనట్టి కళాపిపాస కామినులను సదా కాంక్షించు వారలు కామపిపాసను గలిగియుంద్రు ప్రకృతియందాలచే బరవశించుచును సౌం దర్యపిపాసను దనరు కొంద రమిత జిగీషచే నధికార గర్వాన రక్తపిపాసచే రగులువారు నెండబడి పిపాసను దీర్చ నెంచువారు నిటుల వివిధ పిపాసల వెన్నొ కలవు. అన్నిటినిమించి యచ్యుతు ,నమరవంద్యు, గొలుచు భక్తిపిపాసయే గొప్ప దగును.
నేను,శ్రీ మిస్సన్నగారు ఇంచుమించు ఒకేవిధంగా ఆలోచించి వ్రాసాము.
కమనీయం గారూ మీ పద్యంలో భక్తి పిపాస నొంద వలె నని వాంఛించడం చాలా బాగుంది.
ధన కనక వస్తు వాహన
రిప్లయితొలగించండిఘన సంపదలను పిపాస కలిగి వినీతుల్
పెను భూతములై నరత్వ
మును మరచి చరించు గతులు పోవుట యెపుడో?
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండినమస్కారం.
మూడవ పాదంలో మూడవ గణం జగణమైంది.
ఘన పిపాసనుఁ గల్గినఁ గలుగ వలయు
రిప్లయితొలగించండిముక్తి మార్గమందు , కలుగు మోక్షమపుడు.
ధన పిపాసనుఁ గల్గినఁ జనన మరణ
మార్గమున తిరుగుచునుంద్రు మనుజులెపుడు.
అయ్యా! శ్రీ శంకరయ్య గారూ శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిపొరపాటును గుర్తు చేసినందులకు ధన్యవాదములు. "నరత్వమును"కి బదులుగా "ధర్మమ్మును" అని మర్చుదాము. స్వస్తి.
సాహితీ పిపాస e-లోకాన
రిప్లయితొలగించండికామెంటు 'టపాస్' రూపేణ
ఈ 'ప్యాస్ భరీ' కార్యేణ
మది ఆనంద శంకరాభరణ !~
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితినగ కూడు నిడగ తీరు నాకలియును
రిప్లయితొలగించండిద్రావ నీరు నొసగ దాహ ముడుగు
ఆకటి కలిమి యయి యధికారపు పిపాస
గూడు వాని గోడు పూడు నెటులొ ?
అధికారమును బొంది యందల మెక్కిన
రిప్లయితొలగించండి...............పదవీ పిపాసతో బ్రదుకు నొకడు
అక్రమార్జన రుచి ననుభవించుట జేసి
...............ధనపిపాస నొకండు తాపమొందు
మత్తు పానీయముల్ చిత్తు జేయంగను
...............మద్య పిపాసతో మడియు నొకడు
పరకాంత పొందుకై పరితపించుచు తాను
..............కామపిపాసతో కాగునొకడు
కీర్తి, పరపీడనము, హింస, గిల్లికజ్జ
ములును నరుల పిపాసలై సలుపుచుండు
తీర్చ లేనట్టి దాహము లార్చు సతము
పట్టి పీడించు గావున బహుపరాకు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజనన మరణము లందున గనిన వింత
రిప్లయితొలగించండిప్రాణులకు సహజము ప్రేమ పాశ మనగ
క్రమము దప్పని పిపాశ క్షణిక మనుచు
బ్రతుక లేవన ప్రాణులు వెతల యందు !
రిప్లయితొలగించండికవివర్యులకు,చిత్రకారుల కుండును
లలితమైనట్టి కళాపిపాస
కామినులను సదా కాంక్షించు వారలు
కామపిపాసను గలిగియుంద్రు
ప్రకృతియందాలచే బరవశించుచును సౌం
దర్యపిపాసను దనరు కొంద
రమిత జిగీషచే నధికార గర్వాన
రక్తపిపాసచే రగులువారు
నెండబడి పిపాసను దీర్చ నెంచువారు
నిటుల వివిధ పిపాసల వెన్నొ కలవు.
అన్నిటినిమించి యచ్యుతు ,నమరవంద్యు,
గొలుచు భక్తిపిపాసయే గొప్ప దగును.
రిప్లయితొలగించండినేను,శ్రీ మిస్సన్నగారు ఇంచుమించు ఒకేవిధంగా ఆలోచించి వ్రాసాము.
కమనీయం గారూ మీ పద్యంలో భక్తి పిపాస నొంద వలె నని వాంఛించడం చాలా బాగుంది.
రిప్లయితొలగించండి