7, మే 2013, మంగళవారం

పద్య రచన - 334 (హితమితోక్తులు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“హితమితోక్తులు”

20 కామెంట్‌లు:


  1. చెప్పు వారు అయ్య వారైన
    హితమితోక్తులు ఎల్ల వేళ లా
    'hit'మిళిత ఉక్తులు అని
    తెలుసుకొనవె బ్లాగ్ జిలేబి !!


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. మితముగ మాటలనాడుచు
    హితమును బంచునెడ లెస్స యెల్లరకును నీ
    క్షితి గలుగు శాంతిసుఖములు
    ధృతి నీ విధి నాచరించుడీ మనమలరన్

    రిప్లయితొలగించండి
  3. హితమును గూర్పెడు మాటలు
    మితముగనే యుండవలయు మీరుచు జెప్పన్
    మతమును మానరు మూర్ఖులు
    స్తుత మతులకు జాలు హితమితోక్తులు వినగా.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు
    మీ పద్యములో యతినే నిర్లక్ష్యము చేస్తున్నారు. 4వ పాదములో మార్పు అవసరము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. హితమును గోరెడి మిత్రులు
    సతతము పల్కుదురు గాదె సత్యోక్తులనున్
    మితమై ప్రీతి నొసంగుచు
    వెత దీర్చును నుర్వి జనుల విలువగు నుడువుల్ .

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీరని నటుల యతి సరిపోయినది. నేనే తొందర పడినాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. హితకారక వాక్యంబులు
    మితముగ బోధించనగును మేలుభయులకున్
    మితిమీరిన నిట్టులయని
    స్తుతమతులకు చెప్పవలెనె సుజనాళికిలన్.

    హితమును గోరుచు బలికెడు
    చతురోక్తుల నెల్లవారు సన్మతులగుచున్
    క్షితిలో నందగవలయును
    వెతలన్నియు తీరు దాన వినుడందరికన్.

    హితుడై క్షేమము గోరుచు
    మితముగ సూక్తులను బలుకు మిత్రుని వాక్యా
    లతులిత సౌఖ్యప్రదములు
    శతశాతము ముదము గూర్చు సత్పథమొసగున్.

    మితముగ హితమును బలికెడి
    జతకాడే పృథ్విలోన సన్మిత్రుండౌ
    అతడే సాక్షాద్దైవం
    బతనిని నమ్మంగ వలయు ననవరతంబున్.

    హితవాక్యము వినరేనియు
    వెతలెన్నియొ కలుగుచుండు విస్తృతరీతిన్
    మతిచెడు, క్రుంగును గౌరవ
    మతిదుర్భరమౌను బ్రతుకు హర్షమణంగున్.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ హరివేంకట సత్యన్నారాయణ మూర్తి గారి హితవాక్యా లమిత హర్షము జేకూర్చినాయి ! ఆర్యా ! కిల్తంపాలెం ఎక్కడ ఉందో తెలియదు, కాని నేను పుట్టినది శృంగవరపుకోట లోనే .

    రిప్లయితొలగించండి
  9. మితముగ బలుకగ నెపుడును
    ఇతమును మఱి గలుగ జేయు నెవరికి నైనన్
    సతతము రక్షణ పొందును
    హితముగ మాట్లాడు చుండి హితమును జేయన్ .

    రిప్లయితొలగించండి
  10. మన మాట మితమై, పర(స్వ) హితమై ఉండాలని పెద్దలు చెపుతారు. కానీ లోకంలో అలా మాటలాడే వారి సంఖ్య బహుస్వల్పం. ఈ అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    సుబ్బారావు గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    అమ్మా జిలేబీ,
    మీ కవితా రూపమైన వ్యాఖ్యకు ధన్యవాదాలు. అప్పడప్పుడు మీ వ్యాఖ్యలలోని చమత్కారాన్ని అర్థం చేసికొనలేకపోతున్నాను.
    మీ భావానికి నా పద్యరూపం....
    అయ్యవారు చెప్పునట్టివారైనచో
    హితమితోక్తు లమరు నెల్లవేళ
    లందు హిట్టు మిళితమైన యుక్తులవియె
    లలిత సుగుణ బాల బ్లాగ్ జిలేబి
    *
    గోలి వారూ,
    కొందరు అఖండయతిని అంగీకరింపరు. మీరు ప్రయోగించినది అదే!
    *
    సుబ్బారావు గారూ,
    రెండవ పాదంలో ‘ఇతము’ అన్నారు.అది హితమునకు టైపాటా?

    రిప్లయితొలగించండి
  11. మితముగఁ బల్కెడు పలుకుల
    హితమునుఁ జేర్చి పలుకంగ హృదయములెల్లన్
    వ్రతమునుఁ బూనిన వేళల
    కృతయుగమై పరిఢవిల్లు కృపతో వినుమా!

    రిప్లయితొలగించండి
  12. ఆర్యా!
    శ్రీయుతులు గన్నవరపు నరసింహమూర్తిగారు!
    ధన్యవాదములు.
    మీ జన్మస్థలం ఎస్.కోట అని తెలిసి సంతసించాను. కిల్తంపాలెం ఎస్.కోటకు సమీపంలోని గౌరీపురానికి దగ్గరలో ఉంది. అయితే ప్రస్తుత నా నివాసం మాత్రం ఎస్.కోట నుండి విజయనగరం రూటులో (వయా తాటిపూడి) బొడ్డవర తరువాత రోడ్డు ప్రక్కనే(జవహర్ నవోదయ విద్యాలయ) ఉంది. (కిల్తంపాలెం పేరుతో ఊరికి దూరంగా ఉన్నది.)
    మరొక్క మాట :
    కరీంనగర్ లో గన్నవరపు సూర్యనారాయణ గారని ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు, వారికి మీకు బాంధవ్యం ఉన్నదా?

    రిప్లయితొలగించండి
  13. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. మితి మీరిన సంభాషణ
    హితమును గల్గించ దెపుడు హేతువు చెడుకై
    మితముగ బలికిన పలుకులు
    సతతము శుభ మంచు వినగ సౌఖ్యము నొందన్ !

    రిప్లయితొలగించండి
  15. హితభుక్ మితభుక్కనరే
    మితమౌ హితమైన తిండి మేలగు నట్లే
    మితమౌ హిత వాక్యమ్ము ల-
    మిత హితమొన రించు గాదె మేదిని మిత్రా!

    రిప్లయితొలగించండి
  16. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ ‘హితమిత్ర’వాక్కు చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి





  17. హితముగా మాత్రమే గాక మితముగాను
    పలుకవలె నధికమ్ముగా బలుకునెడల
    పెడచెవిని బెట్టెదరుగాదె పిన్నలైన
    పెద్దలైన, హితోక్తులు ప్రియములౌనె?

    రిప్లయితొలగించండి
  18. హరివేంకట సత్యన్నారాయణ మూర్తి గారూ ! శృంగవరపుకోట పరిసర ప్రాంతాలను గుర్తు చేసారు.ధన్యవాదములు. కరీం నగరములో నున్న గన్నవరపు సూర్యనారాయణ గారు నాకు తెలియరు. మా అన్నగారు శ్రీ పండిత నేమాని వారికి తెలియవచ్చేమో . వారి శ్రీమతి గన్నవరపు వారి యాడపడుచు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ! శుభాశీస్సులు.
    మీ కాంటాక్టు చిరునామా ఫోను నంబరులు మొదలైనవి నాకు తెలుపగలరు. నా ఈ మెయిలు :
    nrsrao@gmail.com
    కరీంనగర్ లోని గన్నవరపు వారిని గూర్చి మా తమ్ముడు డా. చి. గన్నవరపు నరసింహమూర్తికి తెలియనట్లే మాకును తెలియదు. మా అత్తవారిది బొబ్బిలి ప్రాంతము. స్వస్తి.

    రిప్లయితొలగించండి