అఖిల లోకములకు నాప్తమిత్రుడు రవి....సకల విశ్వమునకు సాక్షి యతడుజీవతతుల కమిత చేతనత్వమ్ము గూర్చు....సఖుడతండు సారసముల కెల్లఆశ్రయించువారి కారోగ్య సుఖదాత....కనుల లోని వేల్పు, కాంతిదాతచీకటులను బాపి చేకూర్చి కాంతులు ....వెలుగ జేసెడు మణి విశ్వమునకుఆదినారాయణుండును వేదవేత్త ఆదితేయుండు కాలనియామకుండుపద్మినీ వల్లభుడు నుషా ప్రాణవిభుడునగు జగద్ధితు వినుతించి యంజలింతు
మిత్రుడను పదమున కర్ధ మే రవియు మఱి యును జెలికాడు నిరువురు చేయు దురు ప్రజలకు మేలును ,హితమును జక్క గానుమంచి మిత్రుని బొందుడు నంచితముగ .
కాలమెల్లను తోడునీడగ కష్టమందున సాయమై,చాల మేలునుఁ జేయుచుండగ సఖ్యభావన చాలుగా!నేల నింగినిఁ బోలి యున్నను నెయ్యమెప్పుడు స్వచ్ఛమే,బాలలందున మైత్రి యేర్పడ పట్టువీడక నుండదే!నాటి కృష్ణ కుచేలుకు నైన స్నేహమెల్లరకు విదితమ్మదె హృద్యమైనగాథ! వినగ నానందము గాదె నేడుకూడ! మిత్రుని విలువయె గొప్పదగును.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ!మీ పద్యములు బాగుగ నున్నవి. తేటగీతి మొదటి పాదములో నాటి కృష్ణ కుచేలురదైన స్నేహ" అని అందాము.స్వస్తి.
నేమాని పండితార్యా ! మీ సుర్యస్తుతి నిత్య పారాయణమునకు తగియున్నది.
కలిమి కంటె జగతి చెలిమి మిన్న యటంచు నేడు దొరక రిపుడు నేస్తు లెవరు కతలు జెప్పి మదిని వెత లందు పడ ద్రోసి కపట మైత్రి దొరకు కలి యుగమ్ము
taanu kaalucunna tana vaarikeppuDu velugu paMcuvaaDu viSwamaMdu niyama mepuDu daaTaneekuMDa melagucu melaguvaaDu cooDa mitruDagunu.
అయ్యా ,మీ చక్కటి సవరణకు ధన్యవాదములు.
అఖిల లోకములకు నాప్తమిత్రుడు రవి
రిప్లయితొలగించండి....సకల విశ్వమునకు సాక్షి యతడు
జీవతతుల కమిత చేతనత్వమ్ము గూర్చు
....సఖుడతండు సారసముల కెల్ల
ఆశ్రయించువారి కారోగ్య సుఖదాత
....కనుల లోని వేల్పు, కాంతిదాత
చీకటులను బాపి చేకూర్చి కాంతులు
....వెలుగ జేసెడు మణి విశ్వమునకు
ఆదినారాయణుండును వేదవేత్త
ఆదితేయుండు కాలనియామకుండు
పద్మినీ వల్లభుడు నుషా ప్రాణవిభుడు
నగు జగద్ధితు వినుతించి యంజలింతు
మిత్రుడను పదమున కర్ధ మే రవియు మ
రిప్లయితొలగించండిఱి యును జెలికాడు నిరువురు చేయు దురు ప్ర
జలకు మేలును ,హితమును జక్క గాను
మంచి మిత్రుని బొందుడు నంచితముగ .
కాలమెల్లను తోడునీడగ కష్టమందున సాయమై,
రిప్లయితొలగించండిచాల మేలునుఁ జేయుచుండగ సఖ్యభావన చాలుగా!
నేల నింగినిఁ బోలి యున్నను నెయ్యమెప్పుడు స్వచ్ఛమే,
బాలలందున మైత్రి యేర్పడ పట్టువీడక నుండదే!
నాటి కృష్ణ కుచేలుకు నైన స్నేహ
మెల్లరకు విదితమ్మదె హృద్యమైన
గాథ! వినగ నానందము గాదె నేడు
కూడ! మిత్రుని విలువయె గొప్పదగును.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యములు బాగుగ నున్నవి. తేటగీతి మొదటి పాదములో నాటి కృష్ణ కుచేలురదైన స్నేహ" అని అందాము.
స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేమాని పండితార్యా ! మీ సుర్యస్తుతి నిత్య పారాయణమునకు తగియున్నది.
రిప్లయితొలగించండికలిమి కంటె జగతి చెలిమి మిన్న యటంచు
రిప్లయితొలగించండినేడు దొరక రిపుడు నేస్తు లెవరు
కతలు జెప్పి మదిని వెత లందు పడ ద్రోసి
కపట మైత్రి దొరకు కలి యుగమ్ము
taanu kaalucunna tana vaarikeppuDu
రిప్లయితొలగించండిvelugu paMcuvaaDu viSwamaMdu
niyama mepuDu daaTaneekuMDa melagucu
melaguvaaDu cooDa mitruDagunu.
అయ్యా ,
రిప్లయితొలగించండిమీ చక్కటి సవరణకు ధన్యవాదములు.