17, మే 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1055 (తొయ్యలి తాలింపున నిడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్.

23 కామెంట్‌లు:

  1. పొయ్యిని వెలిగించి రమణి
    బియ్యమ్మును కడిగి బెట్టి బెండలు వేపన్ !
    సయ్యన దర్శిని ముంగిట
    తొయ్యలి తాలింపున నిడె దులసీ దళముల్ !

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    ఈనాటి ప్రథమ తాంబూలం మీదే...
    (దూర)దర్శన్ చూస్తూ పరాకుగా చేసిన పనిగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి నేదునూరి గారూ పూరణ చమత్కారంగా బాగుంది.
    పొయ్యిని వెలిగించి రమణి
    బియ్యమ్మును కడిగి బెట్టి బెండలు వేపన్ !

    రిప్లయితొలగించండి
  4. బియ్యము గడుగుచునత్తరి
    పైయ్యెదపై చెఱగు జారి పరువము గనగా
    శయ్యను బవళించిన యా
    నెయ్యపు రేనికి బలు నెయ్యమి బుట్టెన్,
    కయ్యములను మరచిపోయి
    శయ్యకు తన నెచ్చెలినిక స్వాగతించగా
    నెయ్యపు గినుకను జూపుచు
    తొయ్యలి తాలింపున నిడె దులసీదళముల్ !
    (నెయ్యపు రేడు = మన్మథుడు, భర్త
    నెయ్యమి = కామము
    నెయ్యపు గినుక = ప్రణయపు కోపము )

    రిప్లయితొలగించండి
  5. వియ్యాల వారి రాకను
    చయ్యన మఱి వినిన గీ త చకచక వంటన్
    చెయ్యగ దొందర బడుచును
    తొయ్యలి తాలిం పున నిడె దుల సీ దళముల్ .

    రిప్లయితొలగించండి
  6. పొయ్యిని వెలిగిం చప్పుడు
    చెయ్యగ కూరొకటి తాను చెంగును బిగియిం
    చయ్యో ! కరివే పనుకొని
    తొయ్యలి తాలింపున నిడె దులసీ దళముల్

    రిప్లయితొలగించండి
  7. లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.
    *
    మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
    మీ రెండు పద్యాల పూరణ పూరణ బాగుంది. మొదటి పద్యంలో నేపథ్యాన్నీ, రెండవ పద్యంలో పూరణ చెప్పడం... అభినందనలు.
    మొదటి పద్యం చివరి పాదంలో గణదోషం..
    ‘నెయ్యపు రేనికి బలువగు నెయ్యమి బుట్టెన్’ అనండి.
    రెండవ పద్యం మొదటి పాదంలో మూడవ గణంగా జగణం వాడరాదు కదా! ‘కయ్యముల మరచి పువ్వుల/శయ్యకు...’ అందామా? రెండవ పాదంలోనూ గణదోషం. ‘స్వాగత మనగన్’ అంటే సరి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వెలిగించి + అపుడు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘పొయ్యిని వెలిగించి యపుడు’ అనండి. అలాగే ‘కరివేప + అనుకొని’ అన్నప్పుడూ యడాగమమే రావాలి. కనుక ఆ పాదాన్ని ‘అయ్యొ కరివేప యనుకొని’ అని మారుద్దాం.

    రిప్లయితొలగించండి
  8. రయ్యిన తననే దిట్టుచు
    కయ్యము లాడుచు తన పతి కంగారిడ రా
    మయ్యను పూజించఁ గదలి
    తొయ్యలి తాలింపున నిఢె తులసీ దళముల్!

    రిప్లయితొలగించండి
  9. బ్లాగర్ nagaraju raveender అన్నారు...
    గురువు గారూ ! మీ సూచన ప్రకారం పద్యాన్ని యిలా సవరించుతున్నాను

    పొయ్యిని వెలిగించి యపుడు
    చెయ్యగ కూరొకటి తాను చెంగును బిగియిం
    చయ్యొ ! కరివేప యనుకొని
    తొయ్యలి తాలింపున నిడె దులసీ దళముల్

    రిప్లయితొలగించండి
  10. త్రయ్యంతవేద్యు దలచుచు
    నెయ్యెడ తద్భక్తిలోననే నలరుచు దా
    నయ్యో తద్గతమతియై
    తొయ్యలి తాలింపుననిడె తులసీదళముల్

    రిప్లయితొలగించండి
  11. అయ్యన్న పూజ జేయుచు
    కొయ్యకు తగిలించు బుట్ట గోమలి జూడన్
    చయ్యన నిట్లనె ' వినుమవి
    తొయ్యలి! తా' లింపుననిడె తులసీదళముల్.

    (తాలు = పొల్లు కాయలు)

    రిప్లయితొలగించండి
  12. సయ్యాటల రాయునికై
    రొయ్యల శాకంబు జేయు రూపసి తన బా
    వయ్యను జూచుచు బ్రమచే
    తొయ్యలి తాలింపున నిడె దులసీ దళముల్ !

    రిప్లయితొలగించండి
  13. అయ్యానాడట హరినే
    తొయ్యలి తులదూచ నిడెను తులసీ దళమున్
    అయ్యది దలచుచు హరి ! హరి !
    తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్.

    రిప్లయితొలగించండి
  14. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘మిగతా వారి దొకదారి, మిస్సన్న దింకొకదారి’ అన్నట్టు ఎప్పుడూ వైవిధ్యంగా ఆలోచించి చక్కని పూరణల నిస్తారు మీరు. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    శాకాహారుల మధ్య రొయ్యల పులుసు ప్రస్తావన తెచ్చి, నోరూరించే పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    కృష్ణతులాభారము నేపథ్యంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. "కయ్యము నాతో సలుపును -
    నెయ్యము రుక్మిణికి గూర్చు - నిలువెల్ల విషం
    బయ్యో! శ్రీ కృష్ణుని" కని
    తొయ్యలి తాలింపున నిడె తులసీ దళముల్!

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ తాలింపు నీ కృష్ణతులాభారము
    నీ తులసితో కలిపేయటం బాగుంది.

    డా.ఆచార్య ఫణీంద్ర గారూ
    కయ్యము నీ, నెయ్యము నీ, తాలింపు నీ తులసీ దళములతో చక్కగా కలిపేసారు. బాగుంది పూరణ.

    రిప్లయితొలగించండి
  18. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు టు ది పవర్ ఆఫ్ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. అయ్యది దగ్గుకు జలుబుకు
    నెయ్యము మధుమేహమునకు నేస్తమ్మనుచున్
    తియ్యగ గూగులు తెలుపగ
    తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్

    రిప్లయితొలగించండి


  20. కాష్మోరా :)

    వయ్యారమ్ముగ చదువుగ
    దెయ్యపు కథలను జిలేబి దిమ్మయు తిరుగన్
    సుయ్యను శబ్ధము జల్లన,
    తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. అయ్యరు వంటకు సెలవిడ
    కుయ్యన కుండగ మునగల కూటున నూనెన్
    వియ్యపు రాలికి జలుబని
    తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్

    రిప్లయితొలగించండి