9, మే 2013, గురువారం

సమస్యాపూరణం – 1047 (ఉంగరంబునఁ జిరునవ్వు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఉంగరంబునఁ జిరునవ్వు లొల్కె బళిర!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. ఛాత్రుడొక్కడు గురువర్యు సత్కరించె
  నుంగరంబున, జిరునవ్వు లొల్కె బళిర!
  గురుని ముఖమున నాతండు కూర్మితోడ
  ననుపమంబైన సుఖముల నందుమనియె.

  రిప్లయితొలగించండి
 3. రాము నుంగరము నొసంగె రాము సతికి
  హనుమ, యంత నామెకు హృదయాబ్జ మలరె
  ప్రేమతో కనుపట్టెను స్వామి వదన
  ముంగరమ్మున జిరునవ్వు లొల్కె బళిరె!

  రిప్లయితొలగించండి
 4. బిందెలోపల చెయి దూర్చి ప్రియము మీర
  వరుని చేతిని గిల్లుచు వధువు వెతికె
  వేడుకలరగ నీటిలో వ్రేలు దూర
  నుంగరమ్మున, జిరునవ్వు లొల్కె బళిరె!

  రిప్లయితొలగించండి
 5. శోకతప్తయౌ సీతకు శుభముఁ గలుగ
  జేయ నంగుళీయకమది జేర్చె హనుమ.
  రామ రూపముఁ దోచగా రమ్యమలర
  నుంగరంబునఁ, జిరునవ్వు లొల్కె బళిర!

  రిప్లయితొలగించండి
 6. కందళించిన ప్రేమతో కనులు గలిపి
  మనసు నువ్విళు లూరగ మాట నిచ్చి
  ప్రియుడు పెండ్లికై ప్రియురాలి వేలుఁ దొడుగు
  నుంగరంబునఁ, జిరునవ్వు లొల్కె బళిర!

  రిప్లయితొలగించండి
 7. రాము ముఖమును గనులార రామ గాంచి
  ఉంగరంబున , జిరు నవ్వు లొలికె , బళి ర
  వారి దాంపత్య మాదర్శ మేరికైన
  వందనమ్ములు సీ తమ్మ ! నతు లు రామ !

  రిప్లయితొలగించండి

 8. వింగడించె నవీనమౌ విజ్ఞతలను
  సూక్ష్మసాంకేతికను గల్గె ,సుతుడు దూర
  మందు నుండిన వానిమో మందముగను
  ' ఉంగరంబున జిరునవ్వు లొల్క బలికె.

  రిప్లయితొలగించండి
 9. రామచంద్రుని బొమ్మను రాణ యొప్ప
  ముద్దుటుంగరమున దాల్చి ముదము తోడ
  చొక్కి వ్రేలికి ధరియించి చూచుకొనగ
  నుంగరంబున జిరునవ్వు లొల్కె బళిర !

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములు జేయుచూ
  ========*=======
  ముదము తోడ జేయించగ పుత్రికకును,
  పాప బట్టన మన్నుయె బసిడి యయ్యె
  నంగరంబున,జిరునవ్వు లొల్కె బళిర!
  బలిర యనె తలిదండ్రులు పరవశమున

  రిప్లయితొలగించండి
 11. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
  నమస్కృతులతో,

  సముద్రపు గాలి వల్ల శ్రీదేవి పైట తొలగింది. సిగ్గుతో ఆమె మోమును చేతులలో దాచుకొన్నది. పతి కొంటెనవ్వు ఆమె చేతివ్రేలి రత్నాల ఉంగరంలో ప్రతిఫలించింది.

  అజిరుడు = శబ్దాది విషయభూతుడైన శ్రీ మహావిష్ణువు.

  కలశపాథోరాశి కల్లోలహృల్లోలమారుతమల్లంబు మల్లడింపఁ
  దఱపివెన్నెలచాయ దారాడు క్షీరాబ్ధి పట్టుచీర చెఱఁగు పాయవడఁగఁ
  గెంపుఁదామర సొంపు లింపుల నింపెడు బుజముల నునుఁగాంతి బుజ్జగింపఁ
  గుంభికుంభమ్ములఁ గుంభించి గుంభించు కుచకుంభముల లీల గోపువాఱ

  సిగ్గుమెయి మోముఁదమ్మిని సింధురాజ
  కన్య శ్రీదేవి వ్రేళులఁ గప్పికొనఁగఁ
  బతియుఁ జిఱునవ్వు లొలికించెఁ; బడఁతి ముద్దు
  టుంగరంబు నజిరు నవ్వు లొల్కె, బళిర!

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 12. నేమాని పండితార్యుల రామాంగుళీయకము, గోలివారి నూత్న వధూవరుల అంగుళీయక క్రీడ మనోహరంగా ఉన్నాయి.
  డా. ఏల్చూరి వారు శ్రీ భూకాంతుల శృంగార సన్నివేశాన్ని చాలా అందంగా అద్భుతంగా అంగుళీయకంలో పొదిగారు.

  రిప్లయితొలగించండి
 13. బొంగరము నుంగరమ్ముల బోల్చు డనగ
  " ముల్లు బొంగరమున నుండ కల్లు వెలుగు
  నుంగరంబున " జిరునవ్వు లొల్క బలికె
  నొక్క కవి వధానము నందు నుల్లమలర.

  రిప్లయితొలగించండి
 14. హనుమ నెట్టుల నమ్మె తానవనిజాత?
  ముద్రికను జూడ నేమయ్యె ముదితకపుడు?
  వానరేంద్రున కేరీతి పలికె సీత?
  ఉంగరంబున, చిరునవ్వులొల్కె, బళిర!

  రిప్లయితొలగించండి
 15. జంటలను పైన దైవమే నంట గట్టు
  వలచి నత డమ్మకయ్యకు తెలసి నతడె
  తనకు తొడిగిన పరిణయ నిశ్చితార్థ ముద్దు
  టుంగరంబున చిరునవ్వు లొల్కె బళిర.

  రిప్లయితొలగించండి
 16. మిస్సన్న మహాశయా ! మీరు బొంగరాలే కాదు దొంగాట కూడా ఆడుతున్నారా !

  జగమెఱిగిన కవివరులను జగతియె పట్టున్ !

  రిప్లయితొలగించండి
 17. శోక వనమందు సీతకు చోద్య ముగను
  హనుమ గనుపించి నంతనె మనము నందు
  రాము బంపిన ముద్రిక రాగ మలర
  నుంగ రంబునఁ జిరునవ్వు లొల్కె బళిర

  రిప్లయితొలగించండి
 18. జంటలను పైన దైవమే నంట గట్టు
  వలచి నత డమ్మకయ్యకు తెలసి నతడె
  తనకు తొడిగిన పరిణయ నిశ్చితార్థపడరు
  ఉంగరంబున చిరునవ్వు లొల్కె బళిర.

  రిప్లయితొలగించండి
 19. అవునూ ఒక చిన్న సందేహం
  " మారు ..".మనువాడి " ......అని వ్రాయ వచ్చునా ? సాధువేనా ? లేక మారు ."..మనువున .." అని వ్రాయాలా? దయచేసి తెలుప గలరు

  రిప్లయితొలగించండి
 20. తప్పును సరిదిద్దిన నా పూరణ:

  బొంగరము నుంగరమ్ముల బోల్చు డనగ
  " ముల్లు బొంగరమున నుండ కల్లు వెలుగు
  నుంగరంబున " జిరునవ్వు లొల్కె బళిర
  నొక్క కవి వధానము నందు నుగ్గ డింప.

  రిప్లయితొలగించండి
 21. మూర్తి మిత్రమా! అవును. సరదాగా మార్పు కోసం!

  కానీ, రవి గాంచడు బో కవి గాంచు గదా!

  రిప్లయితొలగించండి
 22. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్నంతా ఎండలో తిరిగి అస్వస్థుడినై పూరణలపై వెంటనే స్పందించలేకపోయాను. మన్నించండి.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  గురువును ఉంగరంతో సత్కరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  క్రమాలంకార పద్ధతిలో మీ రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  సీత ఉంగరంలో రాముని దర్శించిందన్న మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  వివాహ వేడుకను వర్ణించిన మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీరూ నేమాని వారి బాటనే పట్టినా పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహమూర్తి గారూ,
  మీరు నిశ్చితార్థపు వేడకతో పూరణ చేసారు. మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  సీతారాముల దాంపత్యాన్ని ఆదర్శంగా వర్ణిస్తూ పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  నవీన సాంకేతిక ప్రగతిని ఆశ్రయించి మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  అటువంటు ఉంగరాలను భద్రాచలం అంగళ్ళలో చూసాను. మంచి పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  భావం సందిగ్ధంగా ఉన్నట్టుంది.
  ‘భళి యనిరి తల్లిదండ్రులు....’ అనండి.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  ఇదేదో సరదాగా చేసిన సమస్యా పూరణంగా కాక ఒక మహాప్రబంధంలోని ఏరిన పద్యరత్నంలా భాసిస్తున్నది. అద్భుతమూ, మనోహరమూ, అనితరసాధ్యమూ అయిన పూరణమిది. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  మిస్సన్న గారూ,
  మీరు అవధానంలో అప్రస్తుత ప్రసంగాన్ని ఆశ్రయించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘దైవమే యంటగట్టు’ అనండి.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి