శ్రీ హరి వారు శివ భక్తి, శ్రీ మిస్సన్న గారు కేశవ భక్తి ఉటంకించేరు. శ్రీ శంకరయ్య గారు (వాగర్థ స్వరూపులు కదా!) వాగర్థ స్వరూపులైన జగత్పితరులను మాత్రమే కాకుండా వాక్ అంటేసరస్వతి అనియు మరియు అర్థ అంటే లక్ష్మి అనే భావములతో చక్కగా పూరించేరు అలరింప జేసేరు. అందరికీ శుభాశీస్సులు. అభినందనలు. స్వస్తి.
మిత్రులారా! శుభాశీస్సులు. పురాణ గాథలలో అనేక కవుల రచనలలో శివుని ఇద్దరు భార్యలు కలవానిగా పేర్కొను చున్నారు. కైవల్యోపనిషత్తు పార్వతీ పరమేశ్వరులను సగుణ పరబ్రహ్మముగా తెలుపుచున్నది. జ్ఞాన వైరాగ్య నిధానుడైన ఆ పరమేశ్వరునికి గంగా దేవిని భార్యగా తలంచుట నాకు అనుచితముగనే తోచును. గంగావతరణ సమయములో భూమి పైకి ఒక్క మారుగా దుమికితే వచ్చే ప్రమాదము నుండి భూమిని కాపాడుటకై ఆ పరమ శివుడు అభ్రకేశుడు కాబట్టి అలా పడుచుండెడి గంగను తన జడలలో దాల్చెను గాని వేరొక భావముతో కాదని నా ధృఢమైన విశ్వాసము. స్వస్తి.
మిస్సన్న గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * పండిత నేమాని వారూ, లక్ష్మీసరస్వతులనే ఇద్దరు సతులున్నవాడి గురించిన మీ పూరణ చాలా బాగుంది. మఖ్యంగా కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన మీ ప్రావీణ్యం మాబోంట్లకు మార్గదర్శకం. అభినందనలు. ఈనాటి నా పూరణను మీరు ప్రశంసించిన తీరు నాకు నూతనోత్తేజాన్ని కలిగించింది. ధన్యవాదాలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ఆఫీస్ పనుల్లో వ్యస్తులై ఇంటిని ఉపేక్షించే భర్తలని భార్యలు “మీకు ఆఫీస్ రెండవ భార్య అయింది” అని ఎత్తిపొడవడం సర్వసాధారణం. ఆ విషయాన్ని మీ పూరణలో చక్కగా వివరించారు. అభినందనలు. * పింగళి శశిధర్ గారూ, సంభాళించే నేర్పుంటే ఇద్దరు భార్యలున్నా పరవాలేదంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు. * కమనీయం గారూ, కృపాదృక్కులున్న లక్ష్మీసరస్వతులన్న సతుల తోడున్నవాడి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, పెద్దలను ఆదరించే నిబద్ధత కల భార్య దొరకడం ఎంత అదృష్టం! ఆ అదృష్టానికి నోచుకోక పెద్దలను వృద్ధాశ్రమాల పాలు చేసేవాళ్ళు ఎంత దురదృష్టవంతులు? మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, ఇద్దరు సతులున్నవాడి సుఖదుఃఖాలకు హేతువులను చక్కగా వివరిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, శాంతి, క్షమ అన్న రెండు గుణాలు కలిగి ఉండడం సత్పురుషుల లక్షణం. అటువంటివాడు హితాన్నే పొందుతాడు. బాగుంది మీ పూరణ. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మంచి పూరణ చెప్పారు. అభినందనలు. బాల గణేశుని ఇద్దరు తల్లుల గురించిన నేమాని వ్యాఖ్యను గమనించండి. * సహదేవుడు గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ రెండు పూరణలలోనూ భావం సందిగ్ధంగా ఉంది. రుక్మిణి సత్యభామల మధ్య కృష్ణుడెంత హితాన్ని పొందాడో కృష్ణతులాభారంలో చూశాం కదా! రెండవ పూరణలో ఇద్దరి అలకను ఉపేక్షించి హితం పొందాడనుకోవాలా? ‘సత్యను’ అనకుండా ‘సత్యని’ అన్నారు. రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘చద్దన్నము మిగిలె ననుచు శయనింపంగా’ఆందామా?
గురువుగారు, ధన్యవాదాలు. పరమేశ్వరుని పార్వతీదేవి మాత్రమే భార్య అన్న విషయంలో నేను పూర్తిగా పండిత నేమాని వారి పక్షమే. నేను గంగను తల్లి గా నీళ్ళలో నిమజ్జనం ప్రక్రియ ప్రస్తావించి మరీ చెప్పినాను. పండుగ చేసుకొని ఊరేగింపుగా వినాయకుడు ఏ ఇంటికి వెళుతున్నాడో ఆ యిల్లు తల్లి దని భావించడంలో తప్పులేదని అనుకుంటాను కాబట్టే వ్రాసినాను. మన సంస్కృతిలో స్త్రీలందరినీ కూడా మాతృమూర్తులని భావిస్తాము కనుక నేను అట్లా అనుకుంటున్నాను. తప్పైతే చెప్పగలరు. ఇక మీదట మార్చుకోగలదానను.
పెద్దలకు పెద్ద తిరుమల
రిప్లయితొలగించండినిద్దరు సతులున్నవాఁడె! హితము గడించున్
సుద్దుల మానుక భక్తిని
ముద్దిడ నాసామి పదము మోక్షము దొరకున్.
అద్దిర! పినాకపాణియు
రిప్లయితొలగించండినిద్దరు సతులున్నవాడె, హితము గడించున్
పద్దెంబుల, కవనంబుల
నద్దేవుని గొల్చువాడు హర్షముతోడన్.
సరసిజేక్షణు సతియైన సాగరసుత
రిప్లయితొలగించండిసరసిజాసను సతియైన శారదాంబ
తద్దయు ప్రసన్నలగుచు నీ యిద్దరు సతు
లున్న వాడె హితము గడించున్నయమున
రిప్లయితొలగించండిపెద్దలు సెప్పిరి 'చక్కని
సుద్దులు బహుజనహితార్థశుద్ధి గలిగినన్
ముద్ద'ని వాగర్థములను
నిద్దరు సతులున్నవాఁడె హితము గడించున్.
నేమాని పండితులు, శంకర గురువులు అద్భుతమైన పూరణల నిచ్చారు.
రిప్లయితొలగించండిశ్రీ హరి వారు శివ భక్తి, శ్రీ మిస్సన్న గారు కేశవ భక్తి ఉటంకించేరు. శ్రీ శంకరయ్య గారు (వాగర్థ స్వరూపులు కదా!) వాగర్థ స్వరూపులైన జగత్పితరులను మాత్రమే కాకుండా వాక్ అంటేసరస్వతి అనియు మరియు అర్థ అంటే లక్ష్మి అనే భావములతో చక్కగా పూరించేరు అలరింప జేసేరు. అందరికీ శుభాశీస్సులు. అభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండిమిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిపురాణ గాథలలో అనేక కవుల రచనలలో శివుని ఇద్దరు భార్యలు కలవానిగా పేర్కొను చున్నారు. కైవల్యోపనిషత్తు పార్వతీ పరమేశ్వరులను సగుణ పరబ్రహ్మముగా తెలుపుచున్నది. జ్ఞాన వైరాగ్య నిధానుడైన ఆ పరమేశ్వరునికి గంగా దేవిని భార్యగా తలంచుట నాకు అనుచితముగనే తోచును. గంగావతరణ సమయములో భూమి పైకి ఒక్క మారుగా దుమికితే వచ్చే ప్రమాదము నుండి భూమిని కాపాడుటకై ఆ పరమ శివుడు అభ్రకేశుడు కాబట్టి అలా పడుచుండెడి గంగను తన జడలలో దాల్చెను గాని వేరొక భావముతో కాదని నా ధృఢమైన విశ్వాసము. స్వస్తి.
ఒద్దిక భార్యయు నొక్కతి
రిప్లయితొలగించండిపెద్దదొ చిన్నదొ వసతగు ప్రియతమ కొలువున్
ముద్దుగ చెప్పగ సతులే
ఇద్దరు సతులున్నవాఁడె హితము గడించున్.
ఇద్దరు సవతుల మధ్యన
రిప్లయితొలగించండిపొద్దులు మాపులు వచ్చెడు పొరపొచ్చములన్
ఒద్దికతో తీర్చినపుడు
ఇద్దరుసతులున్నవాడే హితముగడించున్.
శ్రీ గోలి....శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములో "ప్రియతమ కొలువున్" అనే సమాసము సాధువు కాదు. పరిశీలించండి. స్వస్తి.
ఆర్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిదోషమును సవరించుచున్నాను.
ఒద్దిక భార్యయు నొక్కతి
పెద్దదొ చిన్నదొ ప్రియమగు విలువల కొలువున్
ముద్దుగ చెప్పగ సతులి
య్యిద్దరు సతులున్నవాఁడె హితము గడించున్.
ఒద్దిక భార్యయు నొక్కతి
రిప్లయితొలగించండిపెద్దదొ చిన్నదొ ప్రియమగు విలువల కొలువున్
ముద్దుగ చెప్పుదు వినుమి
య్యిద్దరు సతులున్నవాఁడె హితము గడించున్.
రిప్లయితొలగించండిఅద్దినకరులోచను సతి
విద్దెలరాణియును గూడి విడువక మహిమన్,
దద్దివ్యకృపా దృక్కుల
నిద్దరు సతులున్నవాడె హితము గడించున్.
రిప్లయితొలగించండివద్దుర బాబని నేడ్చును
ఇద్దరు సతు లున్న వాడె, హితము గడించున్
తద్దయు మేలొన రించిన
తద్దినమే మంచి రోజు తలపగ మనకున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిద్దుర గోల్పోవు నెపుడు
రిప్లయితొలగించండినిద్దరు సతులున్నవాడె? హితము గడించున్
పెద్దలసమాదరించు ని
బద్దతను గలిగియున్న భార్యలభించన్ !!!
వద్దుర, యిద్దరు భార్యలు
రిప్లయితొలగించండియిద్దరు సతులున్నవాడే హితముగడించున్,
ప్రొద్దున మేల్కొన తగవుల
సుద్దులతో పిచ్చి లేసి సుఖహీనుడగున్
మొదట సమస్యను సరిగా గ్రహించలేదు .
రిప్లయితొలగించండిరెండో పద్యము చూడండి
ఒద్దికతోడను మెలిగే
యిద్దరు సతులున్నవాడె హితము గడించున్,
ప్రొద్దుననే తమ తగవుల
సుద్దులనే చెప్పు చున్న సుఖ హీనుడగున్
వద్దుర కోపంబెంతయు
రిప్లయితొలగించండినద్దిర కారణము ధరఁ ననర్థంబులకున్
ముద్దుగ శాంతిక్షమ యను
నిద్దరు సతులున్న వాఁడె హితము గడించున్.
ముద్దుల బాలగణేశుని
రిప్లయితొలగించండికిద్దరు తల్లులు; జలముల నిడమే చవితిన్?
వద్దనక తల్లులుగ నా
యిద్దరు సతులున్నవాఁడె హితము గడించున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివద్దని రాయిగ మారెను
రిప్లయితొలగించండియిద్దరు సతులున్నవాడె, హితము గడించున్
విద్దె వినయంబుఁ గల్గిన
నొద్దిక రాలైన నువిద నొక్కతి యున్నన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముద్దుగ పిలిచెను సత్యని
రిప్లయితొలగించండిబుద్ధిగ తావెడల నెంచి మురియుచు కృష్ణుం
డొద్దికగ నడిగె రుక్మిణి
ఇద్దరు సతులున్న వాఁ డె హితము గడించున్ !
--------------------------------------
అద్దరి నిద్దరి గాంచిన
చద్దన్నము మితి మీరె నంచు శయనిం చిరిగా
వద్దుర యెందుకు బెడదని
నిద్దరు సతులున్న వాఁ డె హితము గడించున్ !
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
లక్ష్మీసరస్వతులనే ఇద్దరు సతులున్నవాడి గురించిన మీ పూరణ చాలా బాగుంది. మఖ్యంగా కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన మీ ప్రావీణ్యం మాబోంట్లకు మార్గదర్శకం. అభినందనలు.
ఈనాటి నా పూరణను మీరు ప్రశంసించిన తీరు నాకు నూతనోత్తేజాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఆఫీస్ పనుల్లో వ్యస్తులై ఇంటిని ఉపేక్షించే భర్తలని భార్యలు “మీకు ఆఫీస్ రెండవ భార్య అయింది” అని ఎత్తిపొడవడం సర్వసాధారణం. ఆ విషయాన్ని మీ పూరణలో చక్కగా వివరించారు. అభినందనలు.
*
పింగళి శశిధర్ గారూ,
సంభాళించే నేర్పుంటే ఇద్దరు భార్యలున్నా పరవాలేదంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
కమనీయం గారూ,
కృపాదృక్కులున్న లక్ష్మీసరస్వతులన్న సతుల తోడున్నవాడి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
పెద్దలను ఆదరించే నిబద్ధత కల భార్య దొరకడం ఎంత అదృష్టం! ఆ అదృష్టానికి నోచుకోక పెద్దలను వృద్ధాశ్రమాల పాలు చేసేవాళ్ళు ఎంత దురదృష్టవంతులు?
మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
ఇద్దరు సతులున్నవాడి సుఖదుఃఖాలకు హేతువులను చక్కగా వివరిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
శాంతి, క్షమ అన్న రెండు గుణాలు కలిగి ఉండడం సత్పురుషుల లక్షణం. అటువంటివాడు హితాన్నే పొందుతాడు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
బాల గణేశుని ఇద్దరు తల్లుల గురించిన నేమాని వ్యాఖ్యను గమనించండి.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలలోనూ భావం సందిగ్ధంగా ఉంది.
రుక్మిణి సత్యభామల మధ్య కృష్ణుడెంత హితాన్ని పొందాడో కృష్ణతులాభారంలో చూశాం కదా!
రెండవ పూరణలో ఇద్దరి అలకను ఉపేక్షించి హితం పొందాడనుకోవాలా?
‘సత్యను’ అనకుండా ‘సత్యని’ అన్నారు.
రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘చద్దన్నము మిగిలె ననుచు శయనింపంగా’ఆందామా?
తల్లిదండ్రులు తమ సంతుకు లక్ష్మీ సరస్వతు లిద్దరి దయ కోరుకోవడము సహజము ;
రిప్లయితొలగించండిముద్దుల తనయా ! నీకున్
హద్దులు గలగంగ నేల ! హాటకగర్భున్
ముద్దియ , మాధవి తోడగు !
ఇద్దరు సతులున్నవాఁడె హితము గడించున్ !
గన్నవరపు నరసింహమూర్తి గారూ,
రిప్లయితొలగించండిచక్కగా చెప్పారు. మంచి పూరణ. అభినందనలు.
‘అంబుజ గర్భున్ ముద్దియ’ అన్నదాన్ని ‘హంసరథుని యా ముద్దియ’ అంటే బాగుంటుందేమో!
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. పరమేశ్వరుని పార్వతీదేవి మాత్రమే భార్య అన్న విషయంలో నేను పూర్తిగా పండిత నేమాని వారి పక్షమే.
నేను గంగను తల్లి గా నీళ్ళలో నిమజ్జనం ప్రక్రియ ప్రస్తావించి మరీ చెప్పినాను.
పండుగ చేసుకొని ఊరేగింపుగా వినాయకుడు ఏ ఇంటికి వెళుతున్నాడో ఆ యిల్లు తల్లి దని భావించడంలో తప్పులేదని అనుకుంటాను కాబట్టే వ్రాసినాను.
మన సంస్కృతిలో స్త్రీలందరినీ కూడా మాతృమూర్తులని భావిస్తాము కనుక నేను అట్లా అనుకుంటున్నాను. తప్పైతే చెప్పగలరు. ఇక మీదట మార్చుకోగలదానను.
ఇద్దరు సతులనగా ఇద్దరు పతివ్రతలని అన్వయముతో చెప్పినాను.
రిప్లయితొలగించండిగురువు గారూ , నమస్సులు. మీ సవరణ బాగుంది. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరణ చేసి నందులకు గురువులకు ధన్య వాదములు
రిప్లయితొలగించండిఒద్దిక క్రుద్ధమ్మనునవి
రిప్లయితొలగించండిప్రొద్దును సాయం సమములు; పొందిక పోరున్
ముద్దులు గుద్దుల్లను నా
యిద్దరు సతులున్నవాఁడె హితము గడించున్
* ముద్దులు గుద్దులు నను నా
తొలగించండిప్రొద్దున రాతిరి పోరుచు
రిప్లయితొలగించండికొద్దిగ వ్యవధియును లేక కొరడాల్ తోడన్
ముద్దుగ ప్రక్కన కొంపను
నిద్దరు సతులున్నవాఁడె హితము గడించున్