4, మే 2013, శనివారం

పద్య రచన - 331 (ఉపవాసము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“ఉపవాసము”

19 కామెంట్‌లు:

 1. స్థిరమగు భక్తిభావమున దేవుని గొల్చుచు నెల్లవేళలన్
  స్మరణమొ, కీర్తనమ్మొ, పదసారస సేవయొ చేయుచుండుటే
  పరగును సార్థమైన యుపవాసముగా; మది భక్తి లేక తా
  నిరశనులౌట నెన్నదగునే యుపవాసముగా సుధీమణీ?

  రిప్లయితొలగించండి

 2. ఉపవాస ముండవద్దని
  యుపదేశ మొసంగె సాయి, యొనరఁగ భక్తుల్
  నెప మెన్నక గురువారపు
  టుపవాసముఁ జేయుట హితమో, యుచితమ్మో?

  రిప్లయితొలగించండి

 3. ఉపవాసము చేసి, సంతుష్టి గా
  వేడి వేడి జిలేబీలు లాగించి
  హాటు హాటు పాలు సేవించి
  హరి ని కొలుమా జిలేబీ కైవల్యం దక్కు !!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. మాస్టరు గారు ఈ రోజు రెండు సమస్యలకూ చక్కటి పూరణలను చేసి అందరికీ ఆనందాన్ని కలిగించారు.

  రిప్లయితొలగించండి
 5. ఉపవాసమన్న హరి దరి
  విపరీతపు భక్తి ' చేరి ' వేడగ వలెగా
  జపమును చేయగ వదలకు
  యపకారము చేయునటుల నాహారమునే.

  రిప్లయితొలగించండి
 6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
  శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. వదలకు యపకారము అని యడాగమ సంధి చేసేరు. వదలకు మపకారము అని సరిచేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి 8. దినము నంత నిరాహార దీక్ష బూను
  టొక్కటియె కాదు, యుపవాసముండుటకును,
  నిత్యహరినామ జపములే,నిష్ఠ తోడి
  వ్రతము బూనంగ జనులకు ఫలమునిచ్చు.

  రిప్లయితొలగించండి
 9. ఉపవాస మనగ నర్ధము
  ఉపవాసము చేయ గా దె , యోపిక కొలదిన్
  ఉపవాసము దైవమునకు
  ఉపకార మె యదియ ప్ర జకు నూ రికి కూ డన్ .

  రిప్లయితొలగించండి
 10. నిష్ఠబూని మనిషి నిర్మలచిత్తుడై
  భక్తిభావమూని పరవశించి
  సతము దేవదేవు స్మరియించువాడౌచు
  నుపవసించవలయు నుర్విలోన.

  కార్యసాధకంబు కామితఫలదంబు
  భగవదర్చనంపు భవ్యపథము
  కాన శ్రద్ధతోడ మానవులింపుగా
  నుపవసించవలయు నుర్విలోన.

  రోగనాశకంబు యోగానుకూలంబు
  సంతసంబు పొందు సాధనంబు
  కృప జనింపజేయు నుపవాస మగుటచే
  నుపవసించవలయు నుర్విలోన.

  కాయ మలతియౌను, కలుషంబు లణగారు,
  నింద్రియాల శక్తు లినుమడించు
  భావశుద్ధి కలిగి జీవంబు వర్ధిల్లు
  నుపవసించవలయు నుర్విలోన.

  వారమందు గాని పక్షంబు నందైన
  నొక్కరోజు నెంచి చక్కగాను
  సవ్యమతిని బూని, సౌభాగ్యమని యెంచి
  యుపవసించవలయు నుర్విలోన.

  రిప్లయితొలగించండి

 11. ఉప వాసము దేవునితో
  నుపకారముఁ జేయుఁ జూడ
  నుత్తమ రీతిన్!
  విపరీతపు పోకడతో
  నుపవాసము పేరఁజేయ
  నుదరంబు చెడున్!

  రిప్లయితొలగించండి

 12. ఉప వాసము దేవునితో
  నుపకారముఁ జేయుఁ జూడ
  నుత్తమ రీతిన్!
  విపరీతపు పోకడతో
  నుపవాసము పేరఁజేయ
  నుదరంబు చెడున్!

  రిప్లయితొలగించండి
 13. ఉపవాసమనగ భక్తుడు
  జపములఁ శ్రీహరి భజింప సఫలముఁ బొందున్
  తపియించుచు నాకలితో
  నుపవాసమ్మున్ననేమి యుపయోగంబౌ?

  రిప్లయితొలగించండి
 14. రంగని ప్రార్థించి తరియింపగ చేసెడిది ఉపవాసము
  వంగని ఉదరపు తరుగు కోరి చేసెడిది ఉపవాసమె
  మింగ మేతుకులేని నిరుపేద వానిదియు ఉపవాసమె
  మంగళమది తా ఉపవసించి అన్నదానము చేసినన్


  (శ్రీ కంది శంకరయ్య గారూ, పై వాక్యాలకు దయచేసి పద్య రూపము చేయ మనవి)

  రిప్లయితొలగించండి
 15. రవీంద్ర గారూ,
  మీ భావానికి (నాకు సాధ్యమైనంతలో) పద్యరూపం....

  భక్తి దేవునికై యుపవాస మమరు
  వంగరాని కుక్షికి నుపవాసమె తగు
  గ్రాసమే లేని వారిది యుపవాస మగును
  తినక యన్నదానము సేయు దినమె శుభము.

  రిప్లయితొలగించండి
 16. కపటము లేకను భక్తిగ
  నుప వాసము జేసి నంత నోములు వ్రతముల్
  జపములు తపముల కన్నను
  నుపశమ నమునొంద వచ్చు నుడివిన దైవం !

  రిప్లయితొలగించండి
 17. ఉపవాసము అన్న అంశంపై చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు.....
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  కమనీయం గారికి,
  సుబ్బారావు గారికి,
  సహదేవుడు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రశంసించవలసిందే. ఏ అంశంపైనైనా ధారాళంగా పద్యాలను వ్రాయగలిగే నైపుణ్యం మీకబ్బింది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ మెచ్చుకోలుకు ధన్యవాదాలు.
  *
  జిలేబీ గారూ,
  మీ భావానికి పద్యరూపం ....
  ఉపవాసమునందుండి, ని
  లిపి మనము తిండిపై జిలేబీపైనన్
  ఫలములు, పాలను గ్రోలుచు
  కలిమి చెలి మగని గొలిచిన కైవల్యమ్మే!

  రిప్లయితొలగించండి
 18. శ్రీ నేమాని గారికి నమస్కారములు.మీ సవరణ య మ గా నున్నది మా ర్చు చున్నాను.
  శంకరార్యా ధన్యవాదములు.

  ఉపవాసమన్న హరి దరి
  విపరీతపు భక్తి ' చేరి ' వేడగ వలెగా
  జపమును చేయగ వదలకు
  మపకారము చేయునటుల నాహారమునే.

  రిప్లయితొలగించండి