18, మే 2013, శనివారం

పద్య రచన - 345 (ప్రపత్తి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“ప్రపత్తి”

9 కామెంట్‌లు:

  1. మా శ్రీమదధ్యాత్మరామాయణము నుండి - శబరి చేసిన స్తుతి:

    నా పరమాత్మవు నీవని భక్తి మెయిన్
    నిరతంబున్ గొల్తును నీ పదముల్
    శరణాగత వత్సల సారనిధీ!
    చరితార్థను రామ! ప్రసన్న గుణా!

    నిను గొల్చుచు నుంటిని నిత్యమునే
    మనమారగ రామ! రమారమణా!
    నను బ్రోవగ వచ్చితి నా కడకున్
    వినుమా రఘునాయక! విన్నపమున్

    స్తుతి చేయుటెరుంగను దోషహరా!
    నతిచేయుదు నీ చరణమ్ములకున్
    గతివీవని నమ్మితి కావుమయా!
    శ్రితరక్షక! రాఘవ! చిద్విభవా!

    రిప్లయితొలగించండి
  2. కాపాడు మయ్య !మమ్ముల
    నేపాపము సేసి యెఱుగ మేవేళల లోన్
    మీ పాద సేవ చేతుము
    మా పాలిట దైవ మీవె మంజుల నాధా !

    రిప్లయితొలగించండి




  3. జ్ఞాన మార్గ మరయ జ్ఞానమ్ము నొసగెడి
    దాత నీవె యౌట దాన మడుగ
    భక్తి యలర జింత బరమాత్మ నిను గొల్తు
    నహము నణచి యేను నణగి మణగి

    రిప్లయితొలగించండి






  4. భక్తి మాత్రమె కాదు,ప్రపత్తి కూడ,
    భగవదారాధనమ్మున ప్రథమమందె
    యాచరణ జేయ సమకూడు నమర సుఖము
    మించినట్టి యాత్మజ్ఞాన మంచితముగ.

    రిప్లయితొలగించండి
  5. మంత్ర తంత్రము లెరుగను మాయ లసలె
    నిర్మ లంబైన మనమున నిన్ను గొలుతు
    కలతలను బాపి కరుణించి కావు మమ్మ
    కనక దుర్గమ్మ మాయమ్మ కల్ప వల్లి !

    రిప్లయితొలగించండి
  6. ఏడేడు లోక మాన్యుడ
    ఏడేడుగ నేడు కొండలెక్కుచు వత్తున్
    ఏడుపు కలుగని బ్రతుకును
    వేడెద మాకిమ్ము తండ్రి వేంకట స్వామీ !

    రిప్లయితొలగించండి
  7. కంది వారి బ్లాగు విందు జేయు మదిని
    పద్య రత్న ములతొ బఱగు చుండు
    పరమ పూజ్య కవులు పాండితీ స్రష్టలు
    గురువు లన ప్ర పత్తి కూడి తనరు.

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీదేవి గారి పద్యము.....

    భక్తిని ప్రపత్తి జేసితి భాగవతుల
    శరణు వేడితి పట్టితి చరణములను,
    పాపరాశుల హరియించు పరమ పావ
    నమగు నామముఁ బల్కితి నమ్మకమున.

    రిప్లయితొలగించండి
  9. ప్రపత్తి అనే అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    కమనీయం గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి