11, మే 2013, శనివారం

సమస్యాపూరణం – 1049 (రామ హృదయమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రామ హృదయమ్ము పొంగెను రావణుఁ గన.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. రావణాసుర వేషమ్ము రాజమౌళి
    వేసి మెప్పించి పొందెను ' పెద్ద కప్పు '
    మరలి రాగను తనయూరు మన్ననలతొ
    గ్రామ హృదయమ్ము పొంగెను రావణుఁ గన.

    రిప్లయితొలగించండి
  2. ఆంజనేయుడు పలికె లోకాభిరామ!
    రామ! హృదయమ్ము పొంగెను రావణు గన
    నమిత క్రోధమ్ముతో నయ్యు, శమము దాల్చి
    వాని కొనరించితిని చాల జ్ఞాన బోధ

    రిప్లయితొలగించండి
  3. సీతఁ గని తెలుప హనుమ చేర చూచి
    రామ హృదయమ్ము పొంగెను; రావణుఁ గన
    క్రోధమావహించె రణము కోరిచేసె
    రాజ ధర్మమనుసరించి రాముడపుడు.

    రిప్లయితొలగించండి




  4. మూడు లోకాల గెలిచిన రేడు,సురల
    దనవశమ్ముచేసికొనిన దానవేంద్రు
    దమితబలుడు గంభీరుండు నతులతేజు
    డయిన వాని మందోదరి యలరి చూడ
    రామ హృదయమ్ము పొంగెను రావణు గన.

    రిప్లయితొలగించండి
  5. రావణాసుర పాత్రను రక్తి గట్ట
    సీత కల్యాణ మనునొక్క చిత్రమందు
    వేసి " ప్రివ్యూను " చూడగా భేషననుచు
    ' రామ ' హృదయమ్ము పొంగెను రావణుఁ గన.

    రామ = రామారావు

    రిప్లయితొలగించండి
  6. సుతులు బంధువుల్ మిత్రులు సోదరులును
    మడియ గతిలేక ననికేగె మాసి పరువు
    వీని జంపి సీతను జూతు వేగమె యని
    రామ హృదయమ్ము పొంగెను రావణు గన.


    రిప్లయితొలగించండి
  7. నాకు ఇబ్బందిగానే ఉంటోంది ప్రతిసారీ ఇలా చెప్పుకోవడానికి. కానీ పరిస్థితులలా వస్తున్నాయి.

    unknown నేనే.

    రిప్లయితొలగించండి

  8. ద్వార పాలకుండు తనని వదిలి బెట్టి వెళ్ళిన
    ఈశుండు అస్మదీయ ప్రేమతోవచ్చే ఇలలోన
    తల్లి ని చెర బట్టి తన్ను పొంద గోరె రావణుండు
    రామ హృదయమ్ము పొంగెను రావణుఁ గన!!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. అవని సుత వార్త దెలియగ హనుమ వలన
    రామ హృదయమ్ము పొంగెను, రావణు గన
    వాని మరణము నూహించి పడతి యనగ
    పొంగి పొరలెను దుఃఖము పుర జనులకు .

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. తేజ మలర రావణు డేగె నాజియందు
    రామ హృదయమ్ము పొంగెను రావణు గని
    నేల గూలెను దశకంఠు డాలమందు
    రామ హృదయ ముప్పొంగెను రాముని గని

    రిప్లయితొలగించండి
  12. వనములో నున్న సీతమ్మ గనిన నాకు
    అగణి తంబైన ముదముతో డమల చరిత
    రామ! హృదయమ్ము పొంగెను , రావణు గన
    రగిలె నాయెదన్ గ్రోధాగ్ని రామ వినుము .

    రిప్లయితొలగించండి
  13. రాముని ప్రతాపమును గని రయము పరశు
    రామ హృదయమ్ము పొంగెను ; రావణు గని
    దివ్యదృష్టి యందు నతడు తెలిసికొనెను
    “హరియె యవతార మెత్తె నసురుని జంప"

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ మొదటి ప్రయత్నం ప్రశంసనీయమైనదే...
    కానీ సమస్యలోని ‘రామ’ శబ్దాన్ని ‘గ్రామ’గా మార్చడం సంప్రదాయం కాదు. సంధిగత సంయుక్తాక్షరం రావచ్చు.. ఉదా.. సమ్యగ్రామ..ఇలా. ‘మన్ననలతొ’ అన్నార. ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.
    రామారావు గారిని ఉద్దేశించి వ్రాసిన రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    అపరిచితము నజ్ఞాతముల్ సుపరిచిత
    మైన వ్యక్తిత్వమును దాచునా? సుమధుర
    శైలి పట్టించు మిమ్ము మిస్సన్న! యెందు
    కిట్టి యిబ్బంది వచ్చెనో, యేది దారి?
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ఓ సాయంత్రం వేళ మాటల మధ్యలో విష్ణుమూర్తి తో పరమశివుడు:

    కరము నిష్ఠకలిఁగి తనకన్నతల్లి
    కోర్కె నెరవేర్చగను నన్ను గూర్చి ఘోర
    తపము నాచరించుచునుండ, దైత్యగణవి
    రామ!హృదయమ్ము పొంగెను రావణుఁ గన.

    రిప్లయితొలగించండి
  16. రామకృష్ణ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. అవనిజాతను గొంపోయి నట్టి తుళువ
    యనికి చనుదెంచి కన్పట్టినంత కలగి
    రేగు ప్రళయోగ్రజలరాశి లాగు నెగసి
    రామ హృదయమ్ము పొంగెను రావణుఁ గన

    రిప్లయితొలగించండి
  18. శ్యామల రావు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. నారదుని శాప వశమున నరుని గాను
    నవత రించెను రాముడై యవని పైన
    దుష్ట శిక్షణ కొఱకని నిష్ట యనగ
    రాము హృదయము పొంగెను రావణుఁ గన !

    రిప్లయితొలగించండి
  20. గురువుగారూ ధన్యవాదములు.

    ఊకదంపుడు గారు చాలా కాలానికి దయజేసి సంతోషపరచారు.

    రిప్లయితొలగించండి