6, మే 2013, సోమవారం

సమస్యాపూరణం – 1045 (ఆంగ్లం బందున “మమ్మి డాడి”)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఆంగ్లం బందున “మమ్మి డాడి” యనుటే యాంధ్రాభిమానం బగున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

45 కామెంట్‌లు:

  1. బంగ్లాదేశమువార లెప్పుడయినన్ వంగంబు భాషింతు రా
    యాంగ్లేయుల్ సతతంబు దాల్తు రిలలో నాత్మాభిమానంబు, నే
    డింగ్లీషే పఠియించు నాంధ్రులకహో! యింపార సంతాన మీ
    యాంగ్లంబందున "మమ్మి డాడి" యనుటే యాంధ్రాభిమానంబగున్.

    రిప్లయితొలగించండి
  2. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    వేగంగా స్పందించి చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. హరి గారూ ! దుష్కర ప్రాసతో ప్రయాస లేకుండా వేగంగా పూరించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. ఆంగ్లంబే మరి కమ్మ నాయె తెలుగన్నన్ కంటకమ్మాయెగా
    యాంగ్లంబందున మాటలాడ తెలుగున్నవ్వర్సలే మారగా
    యాంగ్లంబందున నాంటి యంకులనుటే యాంధ్రాభిమానంబగున్.
    యాంగ్లంబందున "మమ్మి డాడి" యనుటే యాంధ్రాభిమానంబగున్.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో యతి తప్పింది. ‘తెలుగయ్యా కంటకమ్మాయెగా’ లేదా ‘తెలుగౌరా కంటకమ్మాయెగా’ అనవచ్చు.

    రిప్లయితొలగించండి
  6. ఆర్యా! ధన్యవాదములు.

    ఆంగ్లంబే మరి కమ్మ నాయె తెలుగౌరా కంటకమ్మాయెగా
    యాంగ్లంబందున మాటలాడ తెలుగున్నవ్వర్సలే మారగా
    యాంగ్లంబందున 'నాంటి యంకు' లనుటే యాంధ్రాభిమానంబగున్.
    యాంగ్లంబందున "మమ్మి డాడి" యనుటే యాంధ్రాభిమానంబగున్.

    రిప్లయితొలగించండి
  7. ఆంగ్లాంధ్రమ్ములు రెండు నేర్చి భువిలో నౌన్నత్యమున్ బొందగా
    నాంగ్లా భ్యాసముఁ జేయ , వింతమదిలో నాంగ్లమ్మె తెన్గాయెరా !
    ఆంగ్లం బంచును దల్లితండ్రు లటుపై నాడంగఁ దోల్బొమ్మలై
    యాంగ్లం బందున “మమ్మి డాడి” యనుటే యాంధ్రాభిమానం బగున్.

    రిప్లయితొలగించండి
  8. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ఆంగ్లమ్మే మణిభూషణమ్ము నగునో నా శారదా దేవికి
    న్నాంగ్లమ్మే సకలాభిరామ మగునౌ నాసేతు శీతాద్రుల
    న్నాంగ్లమ్మే పరిభాష గాదె గనగా నా యాచకుల్ ధన్యులౌ !
    ఆంగ్లం బందున “మమ్మి డాడి” యనుటే యాంధ్రాభిమానం బగున్.

    ( ఇప్పటికీ యాచకులు ' అమ్మా ! తల్లీ ! బాబు ! అనడము చూస్తున్నాముగా ! )

    రిప్లయితొలగించండి
  10. ఆంగ్లేయుల్ మన జాతిపైన నతిగా యన్యాయమున్ జేయుచున్
    బాంగ్లాదేశముఁ జీల్చి వైచ సరియా? పాపమ్ము గాదే! యదే
    ఆంగ్లం బందున నమ్మ నాన్న యనుటే? యాంధ్రాభిమానం బగు
    న్నాంగ్లంబున్ విడి మాతృ భాష విధిగా యభ్యాసమున్ జేయగా.

    అర్థము మారకపోయినా పదములు మార్చకుండానే సమస్యాపూరణము చేయవలెను. తప్పు మన్నించండి.

    రిప్లయితొలగించండి
  11. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    ‘భూషణ మ్మయినచో నా శారదా...’, ‘ఆసేతు శీతాచల మ్మాంగ్లమ్మే...’ అంటే బాగుంటుందేమో?
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అయితే పృచ్ఛకుడిచ్చిన సమస్యలో మనం మార్పులు చేయడం సంప్రదాయం కాదు. కాకుంటే ఆగమ, ఆదేశ సంధుల వల్ల మొదటి, చివరి అక్షరాలు కొద్దిగా మారవచ్చు.

    రిప్లయితొలగించండి
  12. బెంగ్లూరందున చెన్న పట్టణములో పిట్స్ బర్గు న్యూయార్క్ లలో
    మంగ్లూరందున మారు మూల బడిలో మాటాడ నేర్పింపరే
    యింగ్లీషందున, నాంధ్ర బాల్యమునకున్ హెచ్చిల్లె దౌర్భాగ్యమే
    ఆంగ్లం బందున “మమ్మి డాడి” యనుటే యాంధ్రాభిమానం బగున్!!
    - జిగురు సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  13. ఇంగ్లీషన్న పరాయి నామమును తామిష్టంబుగన్ యాంధ్రిలో
    ఆంగ్లంబంచు వచించె పూర్వులు మహా యాంధ్రాభిమానంబుచే
    ఆంగ్లోపాసన హెచ్చి నేటి పరదేశార్ధార్ధితాంధ్రాళికిన్
    యాంగ్లంబందున "మమ్మి డాడి" యనుటే యాంధ్రాభిమానంబగున్

    రిప్లయితొలగించండి
  14. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కళ్యాణ్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    `ఇష్టంబుగన్ + ఆంధ్రిలో = ఇష్టంబుగ నాంధ్రిలో' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ `ఇష్టంబుగా నాంధ్రిలో' అందాం. పూర్వులు `వచించె' అని ఏకవచనాన్ని ప్రయోగించారు. `వచించి రార్యులు' అందాం.

    రిప్లయితొలగించండి
  15. ఆంగ్లం బన్నది మానవాళి కిలలో నత్యుత్తమౌ భాష యౌ
    నాంగ్లం బందున వ్రాయుటే హితము సత్యమ్మాంగ్ల ముద్యోగి కౌ
    నాంగ్లంబున్ విడనాడ బోకు మని యాంగ్లాధ్యాపకుం డిట్లనెన్
    యాంగ్లంబందున మమ్మి డాడి యనుటే యాంధ్రాభిమానంబగున్.

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ,
    ఇంగ్లీషు మాస్టారి ఉపదేశంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. సోంగ్లం బందున శోభ వచ్చె దెనుగున్ శోధింప మా తెల్గుతో
    నాగ్లం బించుక స్నానమాడి మునకల్ నాంధ్రత్వమున్ బొందెగా !
    ఆంగ్లం బందుర పెన్ను,పేప రటులే నా రోడ్డె కారుం జనీ
    యాంగ్లం బందున “మమ్మి డాడి” యనుటే యాంధ్రాభిమానం బగున్.

    రిప్లయితొలగించండి
  18. గురువు గారూ! నమస్సులు. నా రెండవ పూరణకు మీ సవరణలు, బాగున్నాయి. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. లక్ష్మీ దేవి గారూ ! సోదరు లెవరైనా తప్పులు చూపవచ్చు నన్నారు. నా తత్వము కూడా నంతే.

    'ఆంగ్లేయుల్ మన జాతిపైన నతిగా యన్యాయమున్ జేయుచున్ ' ని

    ఆంగ్లేయుల్ మన జాతిపైన నతిగా నన్యాయమున్ జేయుచున్ ' గా మార్చాలి. అది కాఁ కాబట్టి. ఇదివరలో శ్రీ పండిత నేమాని గారు నాకు చెప్పిన పాఠము !

    రిప్లయితొలగించండి
  20. ఆంగ్లం బౌసర మెంతయేని జగతిన్ సంసార బంధంబులన్
    యాంగ్లంబేగద భుక్తినీయును వినోదంబేని పెంపొంద గా
    నాంగ్లం బొప్పును వేష భాషలకు నుల్లాసంబు గల్పించు నే
    యాంగ్లం బందున మమ్మిడాడి యనుటే యాంధ్రాభి మానంబ గున్ !

    రిప్లయితొలగించండి
  21. ఇంగ్లీషు భాషతో, ఇంగ్లీషును ఖూనీ చేస్తూ బ్రతికే ద్రోహిని నేను ! నాగ్లం బించుక ను నాంగ్లం బించుక గా చదువుకోవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  22. అక్కయ్యగారూ ! మీ చిత్రముతో మిమ్ములను ప్రతిదినము చూడగల్గడము సంతోషదాయికముగా నుంది.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారు,
    ధన్యవాదములు.
    ఆంగ్లపదాలను పద్యంలో వాడకూడదని నిశ్చయించుకున్నందున అమ్మ నాన్న అని వ్రాసినాను. ఇది పూరణలలెక్కలోకి రాదని తెలుసును. అయితే ఎందుకు వ్రాసినానంటారా? దుష్కర ప్రాసను అభ్యాసము చేయుటకొరకు మాత్రమే . అందుకే తప్పు ని మన్నించమని కోరుతున్నాను.
    మూర్తిగారు,
    మీకు ధన్యవాదములు.
    మీ సూచన ఇకమీదట గుర్తుంచుకుంటాను.
    ఇప్పుడు ఎట్లాగూ నా పద్యము పూరణ అర్హతను పొందినది కాదు కావున మార్చి ప్రచురించాలని తోచదు.

    రిప్లయితొలగించండి
  24. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘మునకల్ నాంధ్రత్వమున్ బొందెగా’... ‘మునుకల్ న + ఆంధ్రత్వముల్ బొందెగా’ అంటే ‘ఆంధ్రత్వము కాని దానిని పొందిందా’ అనే అర్థం తీసుకోవాలా?
    ‘మునకల్ + ఆంధ్రత్వము’ అన్నప్పుడు సంధి జరుగుతుంది కదా! అక్కడ నుగాగమం వచ్చే అవకాశం లేదుమరి!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసార్హం.
    కానీ ‘ఔసర’ శబ్ద ప్రయోగం, మూడు పాదాల్లో యతిమైత్రి సవరించవలసి ఉంది. నా సవరణలతో మీ పద్యం.....
    ఆంగ్లం బక్కర యెంతయో యగు జగద్వ్యాపారముల్ సాగగా
    నాంగ్లంబేగద భుక్తి నిచ్చును వినోదార్థంబు వర్ధిల్లు నీ
    నాంగ్లం బొప్పును వేషభాషలకు నాహ్లాదంబు గల్పించు నే
    యాంగ్లంబందున మమ్మిడాడి యనుటే యాంధ్రాభిమానం బగున్ !

    రిప్లయితొలగించండి
  25. రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ బాగుంది.

    రిప్లయితొలగించండి

  26. ఆంగ్లంబంతట వ్యాప్తి చెందె నికపై యాంగ్లంబె పెంపొందు నా
    యాంగ్లంబే జన జీవ నాడియని యాప్యాయంబుతో నిత్యమున్
    ఆంగ్లంబే మియురాక పోయినను వారాంగ్లంబులో పల్కరే !
    ఆంగ్లం బందున “మమ్మి డాడి” యనుటే యాంధ్రాభిమానం బగున్.

    రిప్లయితొలగించండి
  27. Laxminarayan Ganduri గారూ పూరణ బాగుంది.నిజం చెప్పారు.
    ------------
    ఆంగ్లంబంతట వ్యాప్తి చెందె నికపై యాంగ్లంబె పెంపొందు నా
    యాంగ్లంబే జన జీవ నాడియని యాప్యాయంబుతో నిత్యమున్

    రిప్లయితొలగించండి
  28. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. ధన్య వాదములు మూర్తి గారూ !
    పద్యాలు నేర్చు కోవడమే గాక సోదరుల ఆదరాభి మానములు పొదగలగడం నా అదృష్టం. మరి మిమ్మల్ని కుడా చూసే భాగ్యం కలిగించండి

    రిప్లయితొలగించండి
  30. గన్నవరపు వారూ,
    మీ తాజా సవరణ బాగుంది. స్వస్తి!

    రిప్లయితొలగించండి
  31. గురువు గారూ ! కృతజ్ఞతలు

    నాగ్లం బించుక స్నానమాడి మునగం గాంధ్రత్వమున్ బొందెగా !

    అంటే సరిపోతుందాండీ ?

    లక్ష్మీ దేవి గారూ ! పద్యాలలో అన్యదేశ్యములు వాడడము నాకు కూడా యిష్టము ఉండదు. ఇప్పటి వరకు రెండు మూడు పూరణలలో తప్ప లేదు.( గురువు గారు కష్టమైన సమస్యల నిచ్చి నా వ్రతభంగము కావించారు.) తెలుగుపై అపారమైన అభిమానమూన్నా అన్ని వాక్కులూ ఆ అమ్మవే కదా తృప్తి.

    రిప్లయితొలగించండి
  32. గురువులకు సవరణ జేసి నందులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  33. మూర్తిమిత్రమా! మరీ అంతగా ఆత్మ దూషణ చేసుకో వలసిన అవసరం ఏం వచ్చిందో నాకర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  34. మిస్సన్న మహాశయా ! ఏమని చెప్పను ? తెలుగుపై అభిమానముతో తెలుగులో తప్పులు వ్రాసేటప్పుడు బాధ, ఆంగ్లము(పై)లో తప్పులు వ్రాసేటప్పుడు మహానందము కలుగుతాయి నాకు. కాని ఆ ఆనందమును లోపలె దాచుకొని పైకి మాత్రము సంజాయిషీలు చెబుతాను.
    ఆంగ్ల భాష వాడకము ( కొద్ది మంది అనువాదకులు తప్ప ) లేకుండా ప్రపంచములో చాలా దేశాలు మనుగడ సాగిస్తున్నాయి. కాని మనము మాత్రము ఆంగ్లము లేకపోతే బ్రతక లేమని భావిస్తాము. ఆ భావన ఎప్పుడో అప్పుడు పోకుండా ఉంటుందా !
    ( మా పిల్లలు తెలుగులో మాట్లాడినా ఆంగ్లములో మాట్లాడినా నన్నెప్పుడూ నాన్న అనే పిలుస్తారు.వాళ్ళ అమ్మని అమ్మనే పిలుస్తారు.మరోలా పిలుస్తే తప్పు కాదు గాని నాకు మాత్రము జెఱ్ఱులు ప్రాకినట్లుంటుంది .)
    మీ స్పందనకు కృతజ్ఞుడిని.

    రిప్లయితొలగించండి
  35. మూర్తి మిత్రమా! బాగుబాగు! మాతృభాషపై మీకు గల ప్రేమ హర్షదాయకం.

    రిప్లయితొలగించండి
  36. ఇంగ్లాండందున పుట్టి కర్మకొలదిన్ హిందూత్వమున్ వీడుచున్
    బెంగ్లూరందున జాబు జేయుచు మహా భీభత్సమౌ తీరునన్
    బంగ్లాదేశమునందు యాత్ర గొనుచున్ బంగాలి రాకుండుచో
    నాంగ్లం బందున “మమ్మి డాడి” యనుటే యాంధ్రాభిమానం బగున్

    రిప్లయితొలగించండి