వెన్నెల్లో ఆరుబయట పడుకుని సెప్టెంబరులో పరీక్ష తప్పిన రాజు అనే విద్యార్థిని జాబిలి ఓదార్చి నట్లు : కలదు నవకాశ మన్నది! విలపించఁ దగదు పరీక్ష విఫలము జెందను బలపడుమని సెప్టెంబరు నెల దప్పిన రాజుగాంచి నెలరాజనియెన్!
ఈ సమస్యకు చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు.... గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, పండిత నేమాని వారికి, గన్నవరపు నరసింహమూర్తి గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, లక్ష్మీదేవి గారికి, డా. ఆచార్య ఫణీంద్ర గారికి, సుబ్బారావు గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, సహదేవుడు గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, పింగళి శశిధర్ గారికి, మంద పీతాంబర్ గారికి, అభినందనలు, ధన్యవాదాలు. * ఈ సమస్యను పంపిన కవిమిత్రుని నుండి అద్భుతమైన పూరణను ఆశించాను. కాని వారెందుకో పూరించలేదు. * గోలి వారూ, ‘అలనయ్యేయస్సును’ అన్నది అర్థం కాలేదు. * హరి వారూ, ‘కులుకి’....? * సహదేవుడు గారూ, ‘కలదు, ఉన్నది’ అని పునరుక్తి.... ‘కలదింకొక యవకాశము’ అందామా? * రాజేశ్వరి అక్కయ్యా, మొదటి పూరణ రెండవ, మూడవ పాదాల్లో గణదోషం. నా సవరణ..... నెల కొక రూపము మారుచు నెలతగ నిళ రూపమందు నఱి సుద్యుమ్నున్ నెల దాటి కళలు మారగ నెలతప్పిన రాజు గాంచి నెలరాజనియెన్ !
నెలరాజు చెలుడు రాజగు
రిప్లయితొలగించండి" విల విల లాడక శ్రమించి విజయుడ వగుమా "
అలనయ్యెయస్సును గత
నెల తప్పిన రాజుఁ గాంచి నెలరా జనియెన్.
రిప్లయితొలగించండి" కలదుగ మరియొక ' ఛాన్సే '
విల విల లాడక శ్రమించి విజయుడ వగుమా "
అలనయ్యేయస్సును గత
నెల తప్పిన రాజుఁ గాంచి నెలరాజనియెన్
దేవీ భాగవతములోని సుద్యుమ్నుని కథ ఆధారముగా:
రిప్లయితొలగించండినెల సుద్యుమ్నునిగా మరు
నెల "నిళ"గా నొప్పు మూర్తినిన్ బుధు సతిగా
తెలిసి వెరవొంది మది నా
నెల తప్పిన రాజు గాంచి నెలరాజనియెన్
చాంద్రమానము తెలియని కురు రాజుని గాంచి చంద్రుని స్వగతము.
రిప్లయితొలగించండి'చలమున పదమూడేండ్లును
నెల తప్పక పాండుసుతులు నెఱపిరి ప్రజ్ఞన్
నెలతుక యనువర్తింపగ '
నెలతప్పిన రాజుఁ గాంచి నెలరా జనియెన్.
చలము = పంతము
ఇల నొకతండ్రి కుమారుని
రిప్లయితొలగించండికలయక చెప్పినను వినక నాటలతోడన్
కులుకి పరీక్షలలో నీ
నెల తప్పిన రాజుగాంచి "నెలరాజ"నియెన్.
కళవళపడకుము రణమున
రిప్లయితొలగించండిగెలుపొందగలవనియనుచు కృంగిన స్థితిలో
నిలిచిన , ముఖమండల వ
న్నెల తప్పిన రాజు గాంచి నెలరాజనియెన్.
అల పున్నమి జాబిలి గని
రిప్లయితొలగించండిపిలుచుచు పసిబిడ్డ కతని పేరును జెప్పన్
పలుకక, అమవస పిదప వె
న్నెల తప్పిన రాజు గాంచి ’నెలరా’జనియెన్!
అల పున్నమి జాబిలి గని
రిప్లయితొలగించండిపిలుచుచు పసిబిడ్డ కతని పేరును జెప్పన్
పలుకక, అమవస పిదప వె
న్నెల తప్పిన రాజు గాంచి ’నెలరా’జనియెన్!
నెలతలు సెప్పిరి యామెకు
రిప్లయితొలగించండినెల తప్పిన రాజు గాంచి , నెల రాజ నియెన్
ఇల గనుదువీవు పాపను
తెలతెల్లగ బుట్టు నామె దీటుగ జంద్రున్
గమనిక ; రాజు అనగా రాజ్య లక్ష్మి
ముద్దుగా రాజు
నెలరాజు అనగా చంద్ర మోహన్
గా అన్వయించు కొనవలసినది గా మనవి
మూడవ పాదంలో ఒక లఘువు ఎక్కువయ్యిందని సరిచేసి ప్రచురించబోతే ఎందుకో మళ్ళీ అదే ప్రచురితమయింది. ఇప్పుడు సరి చేసి ప్రచురిస్తున్నాను.
రిప్లయితొలగించండిఅల పున్నమి జాబిలి గని
పిలుచుచు పసిబిడ్డ కతని పేరును జెప్పన్
పలుకక, అమవస మును వె
న్నెల తప్పిన రాజు గాంచి ’నెలరా’జనియెన్!
శివుని మూడోకంటి చూపుతో భస్మమైన మన్మథుని చూచి రతీదేవి అంటున్నట్లుగా........
రిప్లయితొలగించండినెలతాల్పీశునిపై శర
ముల గుప్పిన, ఫాలనేత్రమున భస్మంబై
పలుకుల డాసిన పలు వ
న్నెలతప్పిన రాజుఁ గాంచి నెలరాజనియెన్.
అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిముఖమండల వన్నెలు అనే సమాసము సాధువు కాదు. ముఖమున గల వన్నెలు అంటే బాగుంటుందేమో పరిశీలించండి. స్వస్తి.
అయ్యా,
రిప్లయితొలగించండిమీరు చెప్పిన విధముగా సవరించినాను.
కళవళపడకుము రణమున
గెలుపొందగలవనియనుచు కృంగిన స్థితిలో
నిలిచిన , ముఖమున గల వ
న్నెల తప్పిన రాజు గాంచి నెలరాజనియెన్.
వదన కళ అనవచ్చంటే ఇంకొక సవరణ
కళవళపడకుము రణమున
గెలుపొందగలవనియనుచు కృంగిన స్థితిలో
నిలిచిన , వదనకళల వ
న్నెల తప్పిన రాజు గాంచి నెలరాజనియెన్.
ధన్యవాదములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివెన్నెల్లో ఆరుబయట పడుకుని
రిప్లయితొలగించండిసెప్టెంబరులో పరీక్ష తప్పిన
రాజు అనే విద్యార్థిని జాబిలి
ఓదార్చి నట్లు :
కలదు నవకాశ మన్నది!
విలపించఁ దగదు పరీక్ష
విఫలము జెందను
బలపడుమని సెప్టెంబరు
నెల దప్పిన రాజుగాంచి
నెలరాజనియెన్!
నెల నెల పున్నమి చంద్రుని
రిప్లయితొలగించండివిలసిత హృదయమ్ముతోడ వేడుచునెంతో
పొలుపారగ గొలిచే, గత
నెల తప్పిన, రాజు గాంచి నెలరాజనియెన్ .
ఇలలో బుట్టును రాణికి
రిప్లయితొలగించండినెల తప్పిన రాజు గాంచి నెల రాజనియెన్
కుల దీ పకు డు ద యింపగ
కులము వెలయు మీ దు కీ ర్తి కువలయ మెల్లన్ .
నెల కొక రూపము మారుచు
రిప్లయితొలగించండినెలతగ నిళ రూపమందు నేతగు సుద్యుమ్నుం
నెల దాటిన కళలు మారగ
నెలతప్పిన రాజు గాంచి నెలరాజనియెన్ !
-------------------------------------
నెలకొక మారగు పున్నమి
నెల వంకను గాంచి నంత వేడుక పడగన్
కలవర మొందిన తారలు
నెల తప్పిన రాజు గాంచి నెలరాజనియెన్ !
ఫలితము గని వెరవొందకు
రిప్లయితొలగించండికళలుడుగుట వృద్ధిగొనుట గాంచుము నాలో
కళవళపడి ముఖకాంతుల
నెల తప్పిన రాజుగాంచి నెలరాజనియెన్.
కలువల కొలనున తప్పక
రిప్లయితొలగించండినెలనెలజలమిడెడు రాజు నిర్జలుడవగా
కలతన్ జెందితినని మే (MAY)
నెలతప్పినరాజు గాంచి నెలరాజనియెన్!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితలుపులు మూసిన చేడియ
రిప్లయితొలగించండితలపులఁ దా మెలగి మెలగి తలగక యుండన్
వలపులు కెరలగ , చూడ్కుల
నెలతప్పిన రాజుఁ గాంచి 'నెలరా'జనియెన్!!!
తలగు = తొలగు
ఈ సమస్యకు చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
గన్నవరపు నరసింహమూర్తి గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
లక్ష్మీదేవి గారికి,
డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
సుబ్బారావు గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
సహదేవుడు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
పింగళి శశిధర్ గారికి,
మంద పీతాంబర్ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
ఈ సమస్యను పంపిన కవిమిత్రుని నుండి అద్భుతమైన పూరణను ఆశించాను. కాని వారెందుకో పూరించలేదు.
*
గోలి వారూ,
‘అలనయ్యేయస్సును’ అన్నది అర్థం కాలేదు.
*
హరి వారూ,
‘కులుకి’....?
*
సహదేవుడు గారూ,
‘కలదు, ఉన్నది’ అని పునరుక్తి.... ‘కలదింకొక యవకాశము’ అందామా?
*
రాజేశ్వరి అక్కయ్యా,
మొదటి పూరణ రెండవ, మూడవ పాదాల్లో గణదోషం. నా సవరణ.....
నెల కొక రూపము మారుచు
నెలతగ నిళ రూపమందు నఱి సుద్యుమ్నున్
నెల దాటి కళలు మారగ
నెలతప్పిన రాజు గాంచి నెలరాజనియెన్ !
ఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారములు,
ఆటలతోడన్ కులికి - ఆటలతో మురిసిపోతూ(ఆటలతో కాలం వెళ్ళబుచ్చుతూ ఈనెల పరీక్షల్లో తప్పాడు) అనే భావంతో వ్రాశాను.
మాస్టరు గారూ ! ధన్యవాదములు
రిప్లయితొలగించండిఅది (అల) ఐ ఎ యస్ పరీక్ష ను గత నెల తప్పుట....సంధి దోష మేమైనా ఉన్నదాండీ...
హరి వారూ,
రిప్లయితొలగించండి‘కులుకు’ శబ్దానికి ‘శృంగారచేష్ట’ అనే అర్థం ఉండడంతో సందేహించాను. అంతే!
*
గోలి వారూ,
అది ఐ ఏ యస్ అన్న భావం నాకు తట్టలేదు. సంతోషం.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిగురువు గారు ' కలదు నవకాశ మన్నది' అన్నాను పరిశీలించ ప్రార్థన. స్వస్తి .
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండి‘కలదు + అవకాశము’ అన్నప్పుడు సంధి జరిగి ‘కలదవకాశము’ అవుతుంది. నుగాగమం రాదు.