అయ్యా శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు. మీరు చాల పెద్ద మనసుతో వ్రాసిన పద్యాలు కాబట్టి చాల బాగుగ నున్నవి. "దొంగిలించినవే" అనే పదము సమంజసము కాదు - నేను అంగీకరించలేను. ఇతరుల పద్యములలో భావమును గాని పద ప్రయోగమును గాని వాడుకొనుట దోషము కాదు. అది వారియందున్న గౌరవమును సూచించును. స్వస్తి.
వందేహ మంజనాపుత్రం
రిప్లయితొలగించండివజ్రగాత్ర సుశోభితం
సీతా దుఃఖాపహం దేవం
రామకార్యరతం సదా
వందే లోకాప్త సఛ్ఛాత్రం
వందే వానర నాయకం
రామ భక్త వరేణ్యం తం
వందే వాయుతనూభవం
వందే రావణ దర్పఘ్నం
వందే లంకా భయంకరం
వందే భక్త సురోర్వీజం
వందే సర్వ భయాపహం
రాక్షస పిశాచ పీడల్
రిప్లయితొలగించండిశిక్షించగ తొలగి పోవు శ్రీఘ్రము గానే
దీక్షను మారుతి దలచగ
రక్షించును భక్త జనుల రాముని తోడై.
గురువుగారు,
రిప్లయితొలగించండిమనుమడు పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు అందుకోండి.
భక్తి యనగనేమొ యెఱుక పఱచునాంజ
నేయునిఁ గొలుచు దీక్షను నిష్ఠతోడఁ
జేయు భక్తుల నాతండె శీఘ్రగతిని
వచ్చి గాచునంద్రు విబుధవరులు; వినుము.
దీక్ష లన్నిటి గంటె ను దీక్ష యరయ
రిప్లయితొలగించండిఆంజనేయుని దీ క్షయే యభయ మిచ్చు
వాయువేగమునన మన పనులు జరుగు
సంశ యంబులు జెందక శరణు వేడు .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములు బాగుగా నున్నవి.
ఈ క్రింది విషయములు పరిశీలించ గలరు.
-- ఆంజనేయుని తల్లి పేరు "అంజన" - అంజని కాదు.
-- వజ్రతనునకు బదులుగా వజ్రాంగునకు అనండి - బాగుంటుంది.
స్వస్తి.
దీక్షలు పలురకముల నగ
రిప్లయితొలగించండిరక్షణ కొరకంచు సలుప రాక్షస బారిన్ !
కక్షలు కార్పణ్యముల వీడి
ప్రక్షాళన పొంది మదిని పాప హరంబౌ !
నేమాని పండితార్యా! సూచనకు, సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీరు క్షమించాలి. నా పద్యముల భావము లోని సింహభాగము మీ పవిత్ర శ్లోకములనుండి దొంగిలించినదే.
వందన మంజన సుతునకు
వందనము సుశోభలీను వజ్రాంగునకున్
వందనము రామ భటునకు
వందన మవనిజకు నార్తి బాపిన కపికిన్.
దండము రవి శిష్యునకును
దండము కపి నాయకునకు దైత్యఘ్నునకున్
దండము రామాప్తునకును
దండము మారుతికి వాయు తనుజాతునకున్.
అంజలి లంకా వైభవ
భంజనునకు, రావణారి భక్తునకు, మహా
భంజన సూతికి, కోతికి,
నంజన కొమరునకు జేతునతి భక్తి మెయిన్.
ప్రణతులు రావణు గర్వము
నణచిన మన వీరునకును, నసుర దళములన్
వణకించిన వానికి, కపి
గణములకిల కీర్తినిడిన ఘన మారుతికిన్.
ఆంజనేయ దీక్ష నతి నిష్ఠ గైకొని
రేబవళ్లు శ్రద్ధ లిప్త గాక
హనుమ దలచు చుండి యత్యంత భక్తితో
పూజ చేయ దొలగు భూత భయము.
అయ్యా శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు చాల పెద్ద మనసుతో వ్రాసిన పద్యాలు కాబట్టి చాల బాగుగ నున్నవి. "దొంగిలించినవే" అనే పదము సమంజసము కాదు - నేను అంగీకరించలేను. ఇతరుల పద్యములలో భావమును గాని పద ప్రయోగమును గాని వాడుకొనుట దోషము కాదు. అది వారియందున్న గౌరవమును సూచించును. స్వస్తి.
రిప్లయితొలగించండిబ్రహ్మచర్యమందు బరమధర్మంబగు
' నాంజనేయదీక్ష ' నమితభక్తి ,
నాచరింపగ దగు నతినిష్ఠ తోడను
నలవడును యువకుల కాత్మబలము.
నేమాని పండితార్యా! ప్రణామ శతము.
రిప్లయితొలగించండి