పండిత నేమాని వారూ, జగత్కళ్యాణ యోగాంచిత మధుర భావంతో ఉత్తమమైన పూరన నందించారు. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ, మంచి ప్రయత్నం. అభినందనలు. సీతను ‘వైదేహి’ అనవలసిందే. విదేహ అంటే మిథిలయే. * మిస్సన్న గారూ, మీ రెండు పూరణలలో రెండవది అద్భుతంగా ఉంది. అభినందనలు. మొదటి పూరణలో ‘కుంభినీహను..’ అంటే...? * లక్ష్మీదేవి గారూ, చాలా అందమైన పూరణ నందించారు. అభినందనలు. ‘అవధు లేకన్’ అన్నది ‘అవధి లేకన్’ అన్నదానికి టైపాటా? * గుండు మధుసూదన్ గారూ, చాలా కాలానికి మీ పూరణ వీక్షించే అదృష్టానికి నోచుకున్నాం. సంతోషం! మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
శ్రీ కందిశంకరయ్యగారికి నమస్కారములు. మన బ్లాగులో నేను ఇప్పటివరకు ఏమీ వ్రాయకపోవటానికి కారణము నా అనారోగ్యమే. దాని నుండి ఇంకా నేను బయటపడలేదు. వీలునుబట్టి వ్రాస్తుండగలను.నా పూరణ ప్రచురించినందులకు ధన్యవాదములు.
సహదేవుడు గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ఈ సమస్య ఆకాశవాణిలోనూ వచ్చిన విషయం తెలియదు. అప్పుడెప్పుడో వ్రాసిన పూరణను గుర్తుంచుకొని మాకు అందించినందుకు ధన్యవాదాలు. * లక్ష్మీదేవి గారూ, మీ సవరించిన పూరణ చాలా బాగుంది. అభినందనలు. మీరు చెప్పేదాకా 'లేకన్' నా దృష్టికి రాలేదు. * గుండు మధుసూదన్ గారూ, భగవత్కృపతో మీరు త్వరగా కోలుకోవాలనీ, మీ పూరణలతో, పద్యాలతో మమ్మల్ని అలరించాలనీ కోరుకుంటున్నాను. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. మీరు కూడా జిగురు వారి వలె 'విదేహ' శబ్దాన్ని ప్రయోగించారు. * మిస్సన్న గారూ, సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.
చనుదెంచెన్ మిథిలాపురమ్మునకు విశ్వామిత్ర మౌనీంద్రు వె
రిప్లయితొలగించండిన్కను, బూనెన్ శివకార్ముకమ్మును, జగత్కళ్యాణ యోగాంచిత
మ్మని జేజేలు నుతింప భూసుతను శోభాఢ్యన్ మహాదివ్యదే
హను, మత్పుత్రిని భార్యగా గొనె నయోధ్యారాము డాహ్లాదియై
ఘనుడా గాధి సుతుండు కోర, మఖమున్ కావంగ రాముండహో
రిప్లయితొలగించండిముని వెంటన్ జని దుష్ట రాక్షసులతో పోరాడి, గుండ్రాతికిన్
వనితా రత్నపు రూపునిచ్చియు, ధనుర్భంగమ్ముతో "మా విదే
హను" "మత్పుత్రిని" భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై!!
జనకుం డిట్లనె గాధి రాజ సుతుతో సౌజన్యమేపార నో
రిప్లయితొలగించండిముని! మీ సత్కరుణా కటాక్ష లహరిన్ మున్గంగ నా భాగ్యమే
మన, మా యేడు తరంబులున్ దనిసె కన్యాదానమై, కుంభినీ-
హను, మత్పుత్రిని భార్యగా గొనె నయోధ్యారాము డాహ్లాదియై.
భూదేవి....
రిప్లయితొలగించండికని సంతోషము కల్గె నేడవధులేకన్, తృప్తితో చూచితిన్,
ఘన చారిత్ర్యను, సీతనా వరుడదో కళ్యాణమాడెన్ ; సదా
వినయమ్మాభరణమ్ముగా గొనిన నాబిడ్డన్, మహద్వృత్త గేహను;
మత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.
జనకుం డిట్లు మనమ్మునన్ దలచె నా జన్మంబు ధన్యంబు శం-
రిప్లయితొలగించండిభుని చాపమ్మును ద్రుంచ లేరనగ సర్వుల్ దాని జేసెన్ దురూ-
హను, మత్పుత్రిని భార్యగా గొనె నయోధ్యారాము డాహ్లాదియై
కన భాగ్యంబన నాది యౌగద జగత్కల్యాణముం జేసితిన్.
గుండు మధుసూదన్ గారి పూరణ.....
రిప్లయితొలగించండిమునితోడన్ జనుదెంచి రాజసభలో మోదంబుతో రాజులన్
దనువుల్ డస్సి పరాక్రమం బుడుగు సంతప్తాత్ములం జూచి, తా
ధనువున్ ద్రుంచి, విశేష వీర్యయుతుఁడై తాదాత్మ్య రోమాంచ దే
హను, మత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిజగత్కళ్యాణ యోగాంచిత మధుర భావంతో ఉత్తమమైన పూరన నందించారు. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మంచి ప్రయత్నం. అభినందనలు.
సీతను ‘వైదేహి’ అనవలసిందే. విదేహ అంటే మిథిలయే.
*
మిస్సన్న గారూ,
మీ రెండు పూరణలలో రెండవది అద్భుతంగా ఉంది. అభినందనలు.
మొదటి పూరణలో ‘కుంభినీహను..’ అంటే...?
*
లక్ష్మీదేవి గారూ,
చాలా అందమైన పూరణ నందించారు. అభినందనలు.
‘అవధు లేకన్’ అన్నది ‘అవధి లేకన్’ అన్నదానికి టైపాటా?
*
గుండు మధుసూదన్ గారూ,
చాలా కాలానికి మీ పూరణ వీక్షించే అదృష్టానికి నోచుకున్నాం. సంతోషం!
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఇదే సమస్య 1995 లో ఆకాశ వాణి, కడప కేంద్రవారు ఇవ్వడం జరిగింది. ఆనాడు ప్రసారమైన నా పూరణ:
రిప్లయితొలగించండిజనకుండిట్లని దెల్పె రాజ్యమున నుత్సాహంబుగా,నీశుడి
చ్చిన వింటిన్ గొని నెక్కుబెట్ట నది విచ్ఛినంబునొందన్ సుశీ
ల నవాం బోజ దలాక్షి జానకిని నీలాక్షిన్(శ్రీలక్ష్మిన్) సునీతంపు దే
హను, మత్పుత్రిని భార్యగా గొనె నయోధ్యా రాముడాహ్లాదియై!
గురువు గారు ,
రిప్లయితొలగించండిధన్యవాదములు. అది అవధియనే వ్రాసినాననుకున్నా. మీవ్యాఖ్య చూసినాక పొరపాటు తెలిసినది. లేకన్ కూడా తొలగించి సవరించి వ్రాసినాను.
భూదేవి....
కని సంతోషము కల్గె, పుత్రి నిదె నే గన్నారగా తృప్తితో
ఘన చారిత్ర్యను, సీతనా వరుడదో కళ్యాణమాడెన్ ; సదా
వినయమ్మాభరణమ్ముగా గొనిన నాబిడ్డన్, మహద్వృత్త గేహను;
మత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.
శ్రీ కందిశంకరయ్యగారికి నమస్కారములు. మన బ్లాగులో నేను ఇప్పటివరకు ఏమీ వ్రాయకపోవటానికి కారణము నా అనారోగ్యమే. దాని నుండి ఇంకా నేను బయటపడలేదు. వీలునుబట్టి వ్రాస్తుండగలను.నా పూరణ ప్రచురించినందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఇనవంశమ్మున బుట్టినాడు భళిరా యీ శంభు విల్లెత్తె రా
రిప్లయితొలగించండికనగా పుల్లగ విర్చె దాని గదరా కల్యాణ రాముండయెన్
జనకుండేను ముదమ్ము తోడ బనుపగా సాగేను వీడున్ విదే
హను, మత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.
గురువుగారూ ధన్యవాదములు.
రిప్లయితొలగించండినిఘంటువులో ఈహ అంటే వరము అని అర్థం చూశాను.
కుంభిని+ఈహ అంటే భూదేవి ఇచ్చిన వరంగా సీతను జనకుడు భావించాడని నా భావన.
సరైనదే అంటారా?
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఈ సమస్య ఆకాశవాణిలోనూ వచ్చిన విషయం తెలియదు. అప్పుడెప్పుడో వ్రాసిన పూరణను గుర్తుంచుకొని మాకు అందించినందుకు ధన్యవాదాలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ సవరించిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మీరు చెప్పేదాకా 'లేకన్' నా దృష్టికి రాలేదు.
*
గుండు మధుసూదన్ గారూ,
భగవత్కృపతో మీరు త్వరగా కోలుకోవాలనీ, మీ పూరణలతో, పద్యాలతో మమ్మల్ని అలరించాలనీ కోరుకుంటున్నాను.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మీరు కూడా జిగురు వారి వలె 'విదేహ' శబ్దాన్ని ప్రయోగించారు.
*
మిస్సన్న గారూ,
సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.
వినయం బున్ గురు వాన తీయగనె తా భేధింప భాగ్యం బహో
రిప్లయితొలగించండిమనమున్ సంతస మొంది గాదిసుతుకున్ మౌనంబుగా మ్రొక్కి యా
ధనువున్ తానొక జేతబట్టి విఱి చెన్ ధాత్రిన్ ప్రకం పింప గే
హను మత్పుత్రిని భార్యగా గొనెన యోధ్యారాముఁ డాహ్లాది యై !
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండివివాహము కాగానే విదేహను వీడి అయోధ్యకు సాగి పోతారు అని నాభావం...
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఏదో పరధ్యానంలో మీ పూరణను పరిశీలించకుండా వ్యాఖ్యానించాను. మీ పూరణ నిర్దోషమూ, నిరుపమానమూ.
నాదే పొరపాటు. మన్నించండి.
కనుచున్ రాముని భక్తులన్ కడుపునన్ కాలంగ నత్యాశతో
రిప్లయితొలగించండితినుచున్ కొబ్బరి లడ్డులన్ నగవుచున్ తీండ్రించి చెల్లెమ్మతో
చనుచున్ రాహులుడాదటన్ వడివడిన్ ఝాడించెగానివ్విధిన్:
"హనుమత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై"