3, ఆగస్టు 2013, శనివారం

సమస్యాపూరణం – 1132 (సంపాదన లేని మగని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్.

25 కామెంట్‌లు:

  1. ఇంపయిన జీవితములో
    నింపాదిగఁ బుణ్యములను నింపుకొనుచుఁ, దా,
    ముంపు నిడునట్టి "పాపపు
    సంపాదన" లేని మగని, సాధ్వి నుతించెన్!

    రిప్లయితొలగించండి
  2. పెంపు గనుచు ప్రజ్ఞాన ప
    థంపు సుఖములొందు చుండి ధన్యత గని య
    న్యంపు సిరులు వాసనలను
    సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్

    రిప్లయితొలగించండి
  3. పెంపగు కోరిక లేలని
    ఇంపుగ తానుండి పతిని యీశ్వరు డనుచున్ !
    రంపపు కోతలు బెట్టక
    సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్ !

    రిప్లయితొలగించండి
  4. పెంపొనరించుచు ధర్మము
    నింపారగ రక్షజేయనిద్ధరనందున్
    గుంపులు గట్టుచు నక్రమ
    సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాడు మంచి భావములతో పూరణలు వచ్చుచున్నవి. అందరికీ అభినందనలు.

    1. శ్రీ మధుసూదన్ గారు: మీ పూరణ - పాపపు సంపాదన లేదని - చాల బాగుగ నున్నది.

    2. శ్రీమతి రాజేశ్వరి గారు: మీ పూరణ సంస్కారవంతముగా నున్నది - మంచి సాధ్వి లక్షణములను ఉట్టంకించేరు.

    3. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: అక్రమ సంపాదన లేని అని ధర్మ బద్ధముగా గల వారిని వర్ణించేరు - చాల బాగుగ నున్నది.

    రిప్లయితొలగించండి
  6. అన్నయ్యగారికి , గురువులకు నమస్సులు !

    తెంపరితనమే యెఱుగక
    లంపటముల నాస లేక లజ్జావతుడై
    పెంపును నొందుచు ,లంచపు
    సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్.

    రిప్లయితొలగించండి
  7. తమ్ముడు డా. నరసింహమూర్తి వ్రాసిన పద్యము బాగుగనున్నది. 2వ పాదములో లజ్జావతుడై కి బదులుగా ప్రజ్ఞామయుడై అని గాని లేక ప్రజ్ఞాన్వితుడై అని గాని అంటే ఇంకా బాగుంటుంది. అభినందలు - శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. పెంపువహించినమునియే
    సంపదలహరించిజేయ సత్యపరీక్షన్
    కంపమునొందక పిడికెడు
    సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్!!!
    (సాధ్వి =చంద్రమతి)

    కొంపను సంసారపుచిరు
    గంపను నడుపగ సరి పడు కష్టపు ఫలమే
    యింపనిదలచు నధర్మపు
    సంపాదనలేనిమగని సాధ్వి నుతించెన్!!!

    రిప్లయితొలగించండి
  9. ఇంపుగ సంసారంబును
    పెంపొనరగ జేసికొనుచు ప్రేమలు నిం పీ
    రొంపున మునిగెడు నక్రమ
    సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

    కోట్లు సంపాదించిన వారు జైలు పాలై యుండుట జూచి
    ========*======
    ఇంపుగ సంపాదించిన,
    కంపున జీవనము జేయు ఖలులను గని యే
    కెంపుల గుంపుకు జేరని
    సంపాదనలేనిమగని సాధ్వి నుతించెన్!
    (కెంపుల గుంపు= దొంగలగుంపు)

    రిప్లయితొలగించండి
  11. ( నా గత పూరణకు కొన్ని సవరణలతో )
    జంపాలాటల నాడక,
    నింపాదస్తుడు దన మది నిండుగ నుండెన్,
    పంపా తీరము నందున
    సంపాదనలేని మగని సాధ్వి నుతించెన్!

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి మరికొన్ని పూరణలను తిలకించుదాము. ముందుగా అందరికీ శుభాభినందనలు.

    శ్రీ పీతాంబర్ గారు: 2 పద్యములు చాల బాగుగ నున్నవి (1) చక్కగా సత్యహరిశ్చంద్ర కథను ఉట్టంకించేరు (2) అధర్మపు సంపాదన లేని వారిని గురించి స్తుతించేరు.

    శ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము బాగుగ నున్నది. 2వ పాదములో ప్రేమలు నింపీ అన్నారు - దానిని సవరించుచూ -- ప్రేమమ్మలరన్ అందాము.

    శ్రీ వరప్రసాద్ గారు: 2 పద్యములు బాగుగ నున్నవి. (1) కోట్ల సంపాదనలని జైలుకి వెళ్ళకుండా నీతి నియమములతో ఉండే వాళ్ళూ, (2) దురలవాట్లు లేకుండా మంచి నడవడి గల వాళ్ళు గురించి బాగుగా చెప్పేరు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  13. నింపారుగ గష్టించియు
    సంపత్కరుడైన వాన్ని సత్కర్మలతో
    సంపన్నుండై దుర్నయ
    సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్

    రిప్లయితొలగించండి
  14. సొంపగు భుజ బల యుతుడగు
    తెంపరి భీముని హిడింబ తెలిసి వరించెన్
    పెంపు వహింపగ రాజ్యము
    సంపాదన లేక మగని సాధ్వి నుతించెన్

    రిప్లయితొలగించండి
  15. శ్రీ లక్ష్మీనారాయణ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. సత్కర్మలతో సంపన్నుడైన వానిని దుర్నయ సంపాదలేని వానిని చక్కగా ప్రస్తావించేరు. అభినందనలు.

    శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. రాజ్యము లేకపోయినా బాహు బల సంపద గల భీముని వరించిన హిడింబ గురించి చక్కగా వ్రాసేరు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. అన్నయ్య గారి సూచనకు ధన్యవాదములు. సవరణతో నా పద్యము,

    తెంపరితనమును నెఱుగక
    లంపటముల జిక్కుకొనక ప్రజ్ఞాన్వితుడై
    పెంపు వహించుచు ,లంచపు
    సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు
    సంపాదన ముఖ్యమని యింటి ముఖము జూడని వాని కంటే,యింటిలో నుండు అవిటి మొగుడు మంచి వాడని
    ========*=========
    సంపాదన ముఖ్యమనుచు
    గుంపున జేరి ననిశమ్ము గొంపను వీడెన్,
    నింపాదిగ నడచుచు నే
    సంపాదనలేని మగని సాధ్వి నుతించెన్!

    రిప్లయితొలగించండి
  18. శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు
    మోసము జేయు వారిని జూచిన, యువతి మంచి మనమున్న వారిని గౌరవించు
    ========*======
    బంపరు నాఫరు గనినా
    తెంపర యువతులు మునిగిరి దేనె బలుకుకున్,
    రంపపు బలుకులు బలుకని
    సంపాదనలేని మగని సాధ్వి నుతించెన్!

    రిప్లయితొలగించండి
  19. శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ 2 పద్యములను చూచితిని. బాగుగ నున్నవి. అభినందనలు. కొన్ని సూచనలు:

    1. 1వ పద్యము - 2వ పాదములో: జేరి + అనిశమ్ము = యడాగమముతో జేరి యనిశమ్ము అగును.

    2. 2వ పద్యములో అన్య భాషా పదములలో కూడా మీరు నుగాగమమును వాడేరు --
    బంపరు + ఆఫరు
    పలుకుకున్ అన్నారు - పలుకునకున్ అనాలి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. చంపక నీతి నియమములఁ
    నింపాదిగ పనులజేసి నిష్ఠను విడకన్
    సంపద నొందుచు, తప్పడు
    సంపాదనలేని మగని సాధ్వి నుతించెన్!

    రిప్లయితొలగించండి

  21. తండ్రి దక్షుని మాట ను పక్కన బెట్టి
    దాక్షాయణి పరిణయ మాడి శంకరుని
    బూడిద నిచ్చే వాడైనను మానస చోరుడని ,
    సంపాదనలేని మగని సాధ్వి నుతించెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. గంపెడు కట్నము తోడన్
    నింపారుగపెండ్లి యాడ నిల్లరికమునన్
    కొంపను గొర్రెల గాచెడి
    సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్

    ..అఖండ యతి ?

    రిప్లయితొలగించండి


  23. చంపా ! విడువుము విడువుము
    సంపాదన లేని మగని , సాధ్వి నుతించెన్
    నింపాదిగ గాచు మగడు
    గంపెడు చీరలన దేల్చు గండడు వలయున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. బంపరు లాటరి గెల్వగ
    కంపము లేకుండ మేటి కాపురమందున్
    సొంపగు జీతముతో పై
    సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్

    రిప్లయితొలగించండి