12, ఆగస్టు 2013, సోమవారం

సమస్యాపూరణం – 1141 (లచ్చిమగని కైదువు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
లచ్చిమగని కైదువు త్రిశూలమ్ము గాదె!

15 కామెంట్‌లు:

  1. దైత్య నాశనకరము సుదర్శనమ్ము
    లచ్చి మగని కైదువు, త్రిశూలమ్ము గాదె
    విశ్వనాథు నాయుధము, భావింప నివియె
    భువన రక్షాకరమ్ములై పొలుపు గాంచె

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. తపసి దుర్వాసుఁ దఱిమె సుదర్శనమ్ము;
    దనియ గజరాజుఁ గాచె సుదర్శన, మదె
    లచ్చి మగని కైదువు! త్రిశూలమ్ము గాదె
    త్రిపుర వైరికిఁ గైదువు త్రినయనునకు!!

    రిప్లయితొలగించండి
  4. సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు,

    చిన్న పిల్ల వాడు గీచిన చిత్రమును జూచిన గురువులు
    =========*=========
    చిరు నగవున చిత్రము గాంచి గురువు బల్కె
    లచ్చి మగని కైదువు త్రిశూలము గాదె ?
    శంఖు చక్ర దారిని నీవు శంకరులను
    జేయ,శివ కేశవుని గాను చిత్ర మలరె!

    రిప్లయితొలగించండి
  5. దైత్య గణమును సు వి దారక మైనది
    లచ్చి మగని కైదువు , త్రి శూ లమ్ము గాదె
    భవుని నాయుధంబు భవ్య మగునదియా
    ఆయుధంబు లార ! హాయి నిండు

    రిప్లయితొలగించండి
  6. ఫాలలోచనుడై యుండి పాలకుండు
    రౌద్రుడై యుండి భక్త వరప్రడాత
    చిన్మయానంద రూపు దాశ్రితుని గీము
    లచ్చి మగని కైదువు త్రిశూలమ్ము గాదె

    రిప్లయితొలగించండి
  7. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యను మంచి విరుపుతో పూరించుటే సులభమైన మార్గము. ముందుగా అందరికీ అభినందనలు.

    శ్రీ గుండు మధుసూదన్ గారు: మంచి విరుపుతో హరిహరుల కైదువులను ప్రస్తావించేరు. పద్యము చాల బాగుగ నున్నది.

    శ్రీ వరప్రసాద్ గారు: ఒక చిన్న పిల్లడు గీసిన బొమ్మ ఆధారముగ పూరించేరు. చాల బాగుగ నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు: మంచి విరుపుతో సమస్యను పూరించేరు. పద్యములో 1వ పాదమును ఇలా సవరించుదాము:
    దైత్య గణములకు విదారకమైనది

    శ్రీ తిమ్మాజీ రావు గారు: హరిహర అభేదముతో సమస్యను పూరించినటుల నున్నది. మంచి పద్యము.

    రిప్లయితొలగించండి
  8. చారుగాత్రంబుతో క్షీరసాగరమందు
    ..........మున్నుద్భవించిన కన్నె యెవరు?
    శాత్రవాంతకమైన చక్రాయుధంబుతో
    ..........బంధమేమున్న దాపడతి కిలను?
    ఫాలలోచనుడైన పరమేశ్వరునకేమి
    ..........హస్తభూషణమౌచు నమరియుండు?
    పూర్వకాలమునందు పుడమిపై కర్షకుల్
    ..........ధాన్య మెందున బోసి దాచువారు?
    క్రమము పాటించి యీనాల్గు ప్రశ్నలకును
    సూటిగా నుత్తరంబులు చూపుడనిన
    చేర్చి చక్కగ నీరీతి చెప్పనగును
    లచ్చి, మగనికైదువు, త్రిశూలమ్ము, గాదె.

    రిప్లయితొలగించండి
  9. హరి విరోధిని శిశుపాలు శిరము ద్రెంచె
    దర్పమడగించె రిపుల సుదర్శనమ్ము
    లచ్చి మగని కైదువు , త్రిశూ లమ్ము గాదె!
    పార్వతీ భర్తతో నుండు ప్రబల మైన

    రిప్లయితొలగించండి
  10. హరి విరోధిని శిశుపాలు శిరము ద్రెంచె
    దర్పమడగించె రిపుల సుదర్శనమ్ము
    లచ్చి మగని కైదువు , త్రిశూ లమ్ము గాదె!
    పార్వతీ భర్తతో నుండు ప్రబల మైన

    రిప్లయితొలగించండి
  11. శ్రీ హరి....మూర్తి గారు శుభాశీస్సులు. మీ సీస పద్యము చాల బాగుగనున్నది. అభినందనలు. సమస్య పూరించుటలో క్రమాలంకారమును ఆశ్రయించేరు.

    శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు: శుభాశీస్సులు. మీ పద్యము చాల బాగుగ నున్నది. పద్యములో ఆఖరి పాదములో అన్వయము పూర్తి కాలేదు.

    రిప్లయితొలగించండి
  12. హరి విరోధిని శిశుపాలు శిరము ద్రెంచె
    దర్పమడగించె రిపుల సుదర్శనమ్ము
    లచ్చి మగని కైదువు , త్రిశూ లమ్ము గాదె!
    పార్వతీ భర్త కరములో వరలు నెపుడు .

    రిప్లయితొలగించండి
  13. దైత్య సం హార మొనరింప ధరను వెలసి
    వివిధ శస్త్రాస్త్రములు బట్టె దేవ గణము
    లచ్చి మగని కైదువు త్రిశూలమ్ము గాదె
    లోక సం రక్షణా ర్ధమై భీకర ముగ

    రిప్లయితొలగించండి
  14. అమ్మా! శ్రీమతి రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము పూర్తి చేసేరు కానీ సమస్యను ఏ విధముగా పరిష్కరించారో తెలియుట లేదు.
    మీ ప్రయత్నమునకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. దైత్య సం హార మొనరించ ధరణి వెలసి
    వివిధ శస్త్రాస్త్రములు బట్టె దేవ గణము
    లచ్చి మగని కైదువు త్రిశూ లమ్ము గాదె
    దక్ష యజ్ఞము రుద్రుడై దగ్ధ మడచె

    రిప్లయితొలగించండి