బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * శ్రీ యెర్రాజి జయసారథి గారూ, ‘మత్తు వదలరా’ అన్న సినిమా పాటకు మీ పద్యరూపం బాగుంది. ‘ఎత్తు వేయు’ అన్నదానిని ‘ఎత్తు వేసి’ అంటే బాగుంటుంది. దానిమ్మపై మీరు వ్రాసిన పద్యం బాగుంది. నేమాని వారి సవరణ కొత్త అందాన్నిచ్చింది మీ పద్యానికి. * పండిత నేమాని వారూ, దానిమ్మ రూపాన్నీ, గుణాలనూ చక్కని సీసంలో వర్ణించారు. అభినందనలు. * శైలజ గారూ, మంచి ప్రయత్నం చేసారు. అభినందనలు. 2, 4 పాదాలలో గణదోషం. సవరించండి. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మంచి ఫలాన్ని గురించి మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, దాడిమ ఫలం గుణాలను చక్కగా వివరిస్తూ మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
శ్రీమతి శైలజ గారికి మంచి ఆసక్తి యున్నది. పరిశ్రమ ఎక్కువగా చేయాలి. వారి పద్యములో ఎర్రనుండు (ఎర్రగా నుండు); తీరునుండు (తీరున నుండు) పూర్తి గుండు (పూర్తిగా నుండు) అనే విధముగా సవరించితే వ్యాకరణమునకు గాని వినుటకు గాని సొంపుగా నుండును. స్వస్తి.
శ్రీ వరప్రసాద్ గారి మధ్యాక్కర బాగుగ నున్నది. అభినందనలు. 4వ పాదములో "మరులు గొనుచును" అని ఉండాలి. టైపు పొరపాటు కావచ్చును. 6వ పాదములో : శ్రీనాథుడు బొగడె వారి అనుటకు బదులుగా -- శ్రీనాథుడు బొగడె తనదు అంటే బాగుంటుంది. స్వస్తి.
శైలజ గారూ, ఛందస్సు సవరించారు. సంతోషం. వ్యాకరణాంశాల విషయమై నేమని వారి సూచనలను గమనించండి. * వరప్రసాద్ గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * రామకృష్ణ గారూ, అందరాని దాడిమ గురించిన మీ పద్యం చమత్కార భరితమై శోభిస్తున్నది. అభినందనలు. * పండిత నేమాని వారూ, మిత్రుల పద్యాలను పరామర్శిస్తూ ప్రోత్సహిస్తున్న అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు.
శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు మరియు పండిత నేమాని గురువు గార్లకు నమస్కారములు, కవులందరికీ సుప్రభాతం..................
రిప్లయితొలగించండిపుల్ల పండ్లలో దానిమ్మ ముద్దు గొలుపు
ఆయు రారోగ్యముల నిచ్చు నౌషదమ్ము
కెంపువలె మెరిసెడి గింజ లింపుగాను
కాన వచ్చుదానిమ్మలో కన్నులార
గురుదేవులకు పాదాభివందనాలు...
రిప్లయితొలగించండిHappy sunday to all.
చిరు కవిత.....
తే.గీ.
మత్తు వదులుమా! నిద్దుర మత్తు వదులు !
మత్తు గమ్మత్తుగ మనలఁ చిత్తుజేయు
మత్తునే చిత్తుఁ జేసెడి ఎత్తువేయు !
మిత్రమా! ప్రియనేస్తమా !! మేలుకొనుము.,.
కాంచన కలశ మాకారమ్ము, ముఖమున
రిప్లయితొలగించండి....చిగురు టాకుల బోలు చిన్న మొనలు
కనువిందు కలిగించు కమనీయ రూపమ్ము
....నతిమృదులమ్మయి యలరు మేను
కవచంబు బోలు తొక్కను తొలగించిన
....కనుపట్టు గింజలు కాంతు లలర
నతి రసాన్వితములై, యతి మధురమ్ములై
....యందమౌ కూర్పుతో నద్భుతముగ
మంచి యౌషధ సారసంపదలు గలిగి
స్వాస్థ్యము నొసంగు సేవింప శక్తినిచ్చు
సాటి రావన్యఫలములు సరస హృదయ
నెమ్మనమ్మున గొనుము దానిమ్మ పండు
శ్రీ నేమాని గురువులు,శంకరయ్యగురువులకు పాదాభివందనాలు....
రిప్లయితొలగించండికవులందరికి వందనాలు....
దానిమ్మ ఆరోగ్యప్రదాయిని, కుష్టురోగులకు ఉపయోగపడును....
నిగనిగ మెరిసే పండు! దానిమ్మ పండు!
నౌషద గుణముల్ గల్గిన నమృతమ్ము
కుష్టురోగుల పాలిట గొప్పవరము
చక్కగ దినుచున్న మనకు శక్తినొసగు.....
.
.
శ్రీ జయసారథి గారి పద్యము చిన్న సవరణలతో:
రిప్లయితొలగించండినిగనిగల్ కల పండు దానిమ్మపండు
ఔషధ గుణప్రపూర్ణము నమృతసమము
కుష్ఠ రోగ వినాశిని గొప్ప వరము
చక్కగా నారగించిన శక్తినొసగు
ఎంత మంచిది దానిమ్మ ఎఱ్ఱనుండు
రిప్లయితొలగించండితినగతినగరూపము తీరునుండు
పుష్కలముగవిటమినులుపూర్తిగుండు
దివ్య మయిన మందిది తినగ రండు
పండు గింజలన్ని పండ్లుగా గనపడు
రిప్లయితొలగించండిరంగుజూడ మనసు పొంగు, తినగ
రక్త పుష్టినిచ్చి రంజిల్ల జేయును
ఈయనారు దినుట శ్రేయమగును.
చూడు దానిమ్మ ఫలమును చూడ్కు లలర
రిప్లయితొలగించండిగింజ లుండెను ము త్యపు గింజ వోలె
తినుట మొదలిడ నోరంత తీపి గలిగి
మంచి రుచి నిచ్చు నయ్యది ,మంచి ఫలము
పచ్చదనపుటాకు పరుపుల నడుమన
రిప్లయితొలగించండినెఱ్ఱదనపు పండు లింపుగొలుపు
చూడముచ్చటయిన సొగసుతో పెదవులు
విచ్చినటుల కనిపించు చుండు
వరుస పేర్చినయట్టి పలు విత్తనములతో
రసములూరుచునుండు కొసరి తినగ
నారోగ్య భాగ్యమ్ము నంద జేయునదియె
దానిమ్మపండన దప్పటోయి?
సుతునకిష్టమనుచు చూచి కొనెడు దాన
పద్యమొకటి నేడు వ్రాయదలతు.
సంతసమ్ము మీర జనులెల్ల వినరండు
ఫలము గుణము దెలియ పలుకుచుంటి.
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
శ్రీ యెర్రాజి జయసారథి గారూ,
‘మత్తు వదలరా’ అన్న సినిమా పాటకు మీ పద్యరూపం బాగుంది.
‘ఎత్తు వేయు’ అన్నదానిని ‘ఎత్తు వేసి’ అంటే బాగుంటుంది.
దానిమ్మపై మీరు వ్రాసిన పద్యం బాగుంది. నేమాని వారి సవరణ కొత్త అందాన్నిచ్చింది మీ పద్యానికి.
*
పండిత నేమాని వారూ,
దానిమ్మ రూపాన్నీ, గుణాలనూ చక్కని సీసంలో వర్ణించారు. అభినందనలు.
*
శైలజ గారూ,
మంచి ప్రయత్నం చేసారు. అభినందనలు.
2, 4 పాదాలలో గణదోషం. సవరించండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మంచి ఫలాన్ని గురించి మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
దాడిమ ఫలం గుణాలను చక్కగా వివరిస్తూ మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారికి ధన్యవాదములు...సరిదిద్ది వ్రాసాను..
రిప్లయితొలగించండిఎంత మంచిది దానిమ్మ ఎఱ్ఱనుండు
తినగతినగగారూపము తీరునుండు
పుష్కలముగవిటమినులుపూర్తిగుండు
దివ్య మయినట్టి మందిది తినగ రండు
శ్రీ శైలజ గారు మీ పద్యములో గణములు సరి గున్నవి. పద్యము బాగున్నది.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములు
రిప్లయితొలగించండిసరదాగా
=======*========
దానవులకు మంచి ఫలము దానిమ్మయె ధరణి యందు,
మానవులకు రోగతతిని మాన్పెడి మధుర ఫలమ్ము,
కానుకగ నిడెను శబరి కంజనేత్రునకు దానిమ్మ,
మేనక మౌనికి నిడెను మేదిని మరలు గొనుచును,
భానుడు పరితోషమునను బహుమతిగను కాంతినిడెను
శ్రీనాధుడు బొగడె వారి శృంగార కావ్యము నందు
దానిమ్మతో నేడు కవుల దాహము దీరునా? రామ?
శ్రీమతి శైలజ గారికి మంచి ఆసక్తి యున్నది. పరిశ్రమ ఎక్కువగా చేయాలి.
రిప్లయితొలగించండివారి పద్యములో ఎర్రనుండు (ఎర్రగా నుండు); తీరునుండు (తీరున నుండు) పూర్తి గుండు (పూర్తిగా నుండు) అనే విధముగా సవరించితే వ్యాకరణమునకు గాని వినుటకు గాని సొంపుగా నుండును. స్వస్తి.
శ్రీ వరప్రసాద్ గారి మధ్యాక్కర బాగుగ నున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి4వ పాదములో "మరులు గొనుచును" అని ఉండాలి. టైపు పొరపాటు కావచ్చును.
6వ పాదములో : శ్రీనాథుడు బొగడె వారి అనుటకు బదులుగా -- శ్రీనాథుడు బొగడె తనదు అంటే బాగుంటుంది.
స్వస్తి.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు చాల కాలము తరువాత కనుపించిరి. శుభాశీస్సులు. మీ పద్యము ప్రశంసనీయము. స్వస్తి.
రిప్లయితొలగించండిచిన్నతనమునందు చెట్లనెక్కగలేక
రిప్లయితొలగించండిపెరిగి నేడు దాని ధరలనంద
లేక, యపుడు యిపుడు నాకునందగరాని
ద్రాక్ష వలెనె దోచు దాడిమయును
శైలజ గారూ,
రిప్లయితొలగించండిఛందస్సు సవరించారు. సంతోషం. వ్యాకరణాంశాల విషయమై నేమని వారి సూచనలను గమనించండి.
*
వరప్రసాద్ గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
రామకృష్ణ గారూ,
అందరాని దాడిమ గురించిన మీ పద్యం చమత్కార భరితమై శోభిస్తున్నది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మిత్రుల పద్యాలను పరామర్శిస్తూ ప్రోత్సహిస్తున్న అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు.
పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారిక్ నమస్కారములు
రిప్లయితొలగించండిపారసీకమునందు ప్రభవించినావు నీ
ప్రభలతో భరతవర్షమ్ము జొచ్చి
మొగలుల సామ్రాట్ట్టు వగల నాకర్షించి
పూవువై మన్కి కోల్పోయినావు
పిందె వై చేదు పసందువై సేవింప
ఉదర వ్యాధుల కొక ఓషధి గను
పండువై పులుపుయు స్వాదు రుచులు కల్గి
రసభర కణకముల్ గ్రాలినావు
నీరసమ్ము తొలగు నీ రసమ్మును గ్రోల
బలము చేకురు నుసురులకు ఘనము
పోషణమ్ము నిచ్చు నౌషధమైనావు
దాడినిమ్మ ఫలమ ధన్యవీవు
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండితమ సూచనలను గ్రహించితిని గురువు గారు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిదాడినిమ్మ చరిత్రను మనోజ్ఞంగా చెప్పారు. ‘నీరసమ్ము తొలగు నీ రసమ్మును గ్రోల’ అనడం బాగుంది. అభినందనలు.
‘ఉదరవ్యాధుల’ అన్నచోట ‘ర’ గురువై గణదోషం. అక్కడ ‘ఉదర రోగములకు నోషధిగను’ అనండి.
‘పులుపుయు’ అనడం వ్యాకరణ విరుద్ధం. ‘పులుపును’ అందాం.
‘కణకముల్’...? ‘కణములన్’ అందామా?
ఆటవెలదిలో రెండవపాదంలో గణదోషం. ‘బలము చేకుఱు మన ప్రాణములకు’ అంటే సరి.
శ్రీనిధానమ్మట దానిమ్మపండన
రిప్లయితొలగించండి....పలుక శక్యమె దాని వైభవములు?
విద్యుల్లతకునేని విభ్రమమ్మును గొల్పు
....కాంతిపుంజములతో గాత్రమొప్పు
కనకాంబరంబులు గట్టిన సింగారి
....ముద్దు మొగమ్మును బోలియుండు
సుదతి దంతంబుల శోభలు మించిన
....యందాల బీజమ్ము లలరుచుండు
అమృతమ్ము దలపించు నట్టి రసమ్ములు
....పండు గింజలలోన నిండియుండు
తలపైని దాల్చిన నెలవంకయోయన
....చెన్నైన ముచ్చిక చెలగుచుండు
ఆమయమ్ముల మాన్చు దివ్యౌషధమ్ము
బలము తేజమ్ములిడు దాని భవ్య రసము
అమిత యోగప్రదాయిని యైన పండు
నిర్జరులు మెచ్చు పండు దానిమ్మ పండు