నిర్వచన భారత గర్భ
రామాయణము
రావిపాటి లక్ష్మీనారాయణ
శా. శ్రీనాళీకభవాండ మాకృతి, ధరిత్రీపాళి
పాదంబు, మి
న్నే నాభిస్థలి, స్వర్గమే శిరము, చిచ్చే యాననాబ్జంబు,
భ
వ్యేనేందు ల్గను, లాశలే చెవులు, గాడ్పే ప్రాణమౌ
వేల్పు నే
కోనారాయణ యంచు ముక్తికొఱకై కోర్కిన్ ధృతిం గొల్చెదన్.
(౧)
చ. పలుకులబోటిఁ బొంది భువిపౌజు
సృజించెడి బ్రహ్మ దానయై
కలుములచెల్వతోడుత జగమ్ములఁ బెంచెడి శౌరి దానయై
చలిమలకూఁతునుం గలిసి సర్వము ద్రుంచెడు శూలి
దానయై
చెలువుగ దక్కు వేల్పులయి చెన్నగు నా యఖిలేశుఁ
గొల్చెదన్. (౨)
టీక- పౌజు = గుంపు, మల = కొండ, శూలి = శివుఁడు.
సీ. ఎవ్వానియాజ్ఞ మొయిళ్లు చిల్లులు
పడ్డ
కరణినిఁ దృటి వాన గురియుచుండు,
నెవ్వానియాజ్ఞచే నెక్కక మిట్టలఁ
బల్లంబు జలమెప్డు పాఱుచుండు,
నెవ్వానియాజ్ఞచే నినశశితారక
లెప్పుడు తమచొప్పుఁ
దప్పకుండు,
నెవ్వానియాజ్ఞచే నీ భూతవిసరంబు
పుట్టుచుఁ బెరుగుచు
గిట్టుచుండు,
తే. నెవఁడు నవ్వించు మఱలను నేడిపించు
నెవఁడు మట్టిలో సదయత నెఱ్ఱ మనుచు
నెవఁడు మొగ్గలకును రంగు లిడుచునుండు
నా మహామహు నఖిలేశు నాత్మ నెంతు. (౩)
టీక- విసరంబు = గుంపు, ఎఱ్ఱ = వానపాము.
కం. విఘ్నేశ్వరుఁడయి దుష్టకృ
తఘ్నస్వార్థకపటకలితప్రబలోద్యో
గఘ్నుఁడయి సుకార్యములకు
విఘ్నములనుఁ బాఱద్రోలు విభునిఁ దలఁచెదన్. (౪)
ఉ. ఉల్లమునందు భక్తిని ఘనోరగగేహజు,
వ్యాసు, దండి, ధీ
వల్లభుఁ గాళిదాసకవి, బాణుఁ గవిత్రయ భాస్కరేంద్రులం
బెల్లగు సోముఁ, బోతనను, బెద్దన, సూరన, మూర్తిఁ
దిమ్మనన్,
మొల్లను, వేంకమాంబ మఱి పూర్వుల నిప్పటివారి
నెంచెదన్. (౫)
టీక- ఉరగగేహజుఁడు = వాల్మీకి.
కం. అనుమానానేకము దీ
ర్చిన మహితుఁడు దుగ్గరాజు సీతారామ
య్యనుఁ గొలుతు వెండి నిండుమ
తిని వేంకటపార్థసారథి కవులఁ దలఁతున్. (౬)
కం. తెలియని శబ్దార్థము పె
ద్దల నడిగి గ్రహింపఁబోక తప్పని ధృతితోఁ
బలుకుచు నితరుల భావం
బులను హరించెడు కుకవులమూఁకఁ దెగడుదున్. (౭)
తే. రామకథ నిర్వచనముగ వ్రాయుదుఁ,
బ్రతి
పద్యమందున వేఱొక్క పద్యముండు,
నట్టి గర్భితములగు పద్యముల నెల్ల
వరుసతోడుతఁ జదువఁగా భారత మగు. (౮)
కం. కలియుగ మఱవదివేల క
వల ముప్పది పయిని రెండవది, క్రీస్తుశకం
బొలయగఁ బదితొమ్మిది వం
దల ముప్పదియొకటిలో నొనరిచితిఁ దీనిన్. (౯)
తే. శ్రీనగమున కీశాన్యంబు, కృష్ణకు
శమ
నదిశ, గుంటూరుజిల్లాను నరసరావు
పేట తాలుకలోపల వెలయు రావి
పాఁడు స్వగ్రామమై నాకు వఱలుచుండు. (౧౦)
సీ. భారతీయుండ, బాపండ నాపస్తంభ
సూత్రుండఁ గౌండిన్యగోత్రజుండ,
బండితాగ్రేసరమండలమునకు న
త్యధికవిధేయుండ, నాఱువేల
వాఁడను, ముత్తాత వఱలును జలమల
రాజనం, గొండలరాజు తాత,
కొండలరాజునకుం జలమయ్య య
ప్పయ్య నాఁ గలిగి రం
దగ్రజుండు
తే. చలమయకు సతి పిచ్చమ్మ వలనను
జని
యించితిమి వేంకటప్పయ్య యేనును గురు
నాథ మనఁగ సుబ్బారా వనంగ నం ద
రయ ద్వితీయుండ లక్ష్మినారాయణుండ. (౧౧)
ఆ.వె. విమలకథలని, నవవిధమని, బుద్బుద
యశమునకు పిరంగినైనఁ దలనుఁ
దూర్చు వీరువయసుతోనుంట, నీ కష్ట
సాధ్యకృతికి సాహసము సలిపితి. (౧౨)
టీక- బుద్బుదయశమునకు... వీరువయసు- షేక్సుఫియర్ (Shakesphere) యొక్క As
you like it నాటకములోని మానవుని సప్తవయస్సుల (Seven ages of Man)లో సూచింపబడిన నాలవవయ్యస్సు
“A soldier seeking the bubble reputation in cannon’s mouth”
తే. ధరణిలోఁ “బ్రమాదో ధీమతామపి”
యన
నల్పుఁడనుఁ జడమతిని నే ననఁగ నెంత
జలముల విడి పాలఁ గొను హంసలవిధమున
దప్పుల వదలి యొప్పులఁ దలఁప రయ్య. (౧౩)
*షష్ఠ్యంతములు*
కం. ధీరునకున్ విదళితసం
సారునకు సమస్తవేదసారున కధికో
దారునకును విమలశుభా
కారున కుపమానరహితగంభీరునకున్. (౧౪)
కం. ఘోరునకును నాగమసం
చారున కఘదూరునకును సచ్చిద్గుణవి
స్తారునకును సకలకలుష
హారికి నినశశిముఖాఖిలాధారునకున్. (౧౫)
కం. ఆ యఖిలాధీశ్వరునకు
నా యమరేశునకు భక్తి నంకితమును నేఁ
జేయుదు; గర్భకవిత రా
మాయణభారతకథాక్రమం బెట్టిదనన్. (౧౬)
రచన గావించె మెప్పుగ రావి పాటి
రిప్లయితొలగించండిపద్యమొక్కటే యర్ధముల్ హృద్య ముగను
భార తంబును రామాయ ణా ర్ధము లవి
యెంత నేర్పది ? పొగడగ సుంత యైన
జాల నేనార్య !నతులను జాల సేతు
పద్యాలు రమ్యంగా ఉన్నాయి. విశ్వరూపాన్ని వర్ణించే పద్యాలు మనోహరంగా ఉన్నాయి.
రిప్లయితొలగించండి