10, జూన్ 2014, మంగళవారం

సమస్యా పూరణం - 1440 (కమలము ముకుళించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
కమలము ముకుళించె సూర్యకరములు సోకన్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

 1. కమలాప్తుడు వ్రాలగనే
  కమలము ముకుళించె,సూర్య కరములు సోకన్
  ప్రమదముతో వికసించెను
  కమలమునకు దినకరునకు గలతోడేదో!

  రిప్లయితొలగించండి
 2. రమణుల ఎడదను దోచిన
  హిమకరుని వెలుగు లందు హేలగ తారల్
  తమకము నగాంచి యలిగిన
  కమలము ముకుళించె సూర్య కరములు సోకన్

  రిప్లయితొలగించండి
 3. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తోడేదో’ అన్నచోట ‘బంధ మదే’ అంటే ఇంకా బాగుంటుందని నా సలహా.
  *
  అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. వివాహపు పనుల్లో వ్యస్తురాలైన కూతురుతో ఒక తండ్రి .

  అమలా వేసవి, నీముఖ
  కమలము ముకుళించె సూర్య కరములు సోకన్
  కొమరుని బంపుము ప్రొద్దున
  అమరును పనులన్ని ,దీరు నలసట నీకున్ !!!

  రిప్లయితొలగించండి
 5. తమరజనీ నిద్రకుసుమ
  రమితంబై వసుధలేవ రవిరాజునికై
  క్రమమున వాలుబడి తిమిర
  కమలము ముకుళించె సూర్య కరములు సోకన్

  రిప్లయితొలగించండి
 6. కుముద సఖుని వెలుగుల గని
  కమలము ముకుళించె, సూర్య కరములు సోకన్
  బ్రమరములు తేనెకై చన
  కమలిని వెల్గెను కరమగు, కాంతుల తోడన్

  రిప్లయితొలగించండి
 7. హిమకరు డుదయించ గనే
  కమలము ముకుళించె, సూర్య కరములు సోకన్
  కమలములు విచ్చు కొను గద
  కమలముతో బూజసేయ గా లుడు మెచ్చున్

  రిప్లయితొలగించండి
 8. సుమ శరుని మామనుంగని
  కమలము ముకుళించె; సూర్యకరములు సోకన్
  విమలంబగు రూపంబున
  కమలము వికసించె దివ్య కాంతుల తోడన్

  రిప్లయితొలగించండి
 9. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు సమస్య:పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
  పూరణ:గ్రీష్మమాయెను కారుగా ఋతులు మారె
  శరతు హేమంత మాయెను మురిపెమొప్ప
  శిశిర మాయె వసంతము చిగురులెత్త
  పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
  సమస్య:కమలము ముకుళించె సూర్య కరములు సోకన్
  పూరణ:తిమిర హరు కరము సోకగ
  కమలము వికసించు దంతి గ్రక్కున పెరుకన్

  తమ నెలవును కోల్పోయిన
  కమలము ముకుళించె సూర్య కరములు సోకన్

  రిప్లయితొలగించండి
 10. రమణులు తటాకమున దిగి
  కమలములను గోసి సిగను కట్టుట గనుచున్
  సుమతులకు జిక్కవలదని
  కమలము ముకుళించె సూర్యకరములు సోకన్!

  రిప్లయితొలగించండి
 11. మంద పీతాంబర్ గారూ,
  ముఖకమలపు పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  యం.ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రవిరాజునకై’ అనడం సాధువు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  నిన్నటి సమస్యకు, ఈనాటి సమస్యకు మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. సమయము గానక భృగువట
  రమారమణు రొమ్ముఁ దన్న రాగము కలదై
  చెమరిన కన్నుల భువి చన
  కమలము ముకులించె సూర్య కరములు సోకన్!

  రిప్లయితొలగించండి
 15. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

  కమలాప్తుడు రోహిణిలో
  కమలగ జేయుచు సకలము కాల్చుచు నుండన్
  తమనిలయము వీడ,వదన
  కమలము ముకుళించె సూర్య కరములు సోకన్

  కమలాకరమును వీడిన
  కమలము నందంబగుచును కాంతిని వెలిగెన్
  చిమచిమ రోహిణి యెండకు
  కమలము ముకుళించె సూర్యకరములు సోకన్

  రిప్లయితొలగించండి
 16. అమలిన ప్రేమోదాత్తుల
  సుమనస్కుల జంటజూచి చూపులు కుట్టన్
  చెమరించె రెండుబ్రతుకులు
  కమలము ముకుళించె సూర్య కరములు సోకన్

  రిప్లయితొలగించండి
 17. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 18. తిమిరాంతకునే మునిస
  త్తముమంత్రపు మహిమ జూడ దరికే పిలిచెన్
  రమణీ యన కుంతీ ముఖ
  కమలము ముకుళించె, సూర్యకరములు సోకన్.

  రిప్లయితొలగించండి
 19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. అమరించ గోరి పూజకు
  కమనీయపు పాలవెల్లి గణపతి కొఱకై
  సుమముల వేకువ కొనగా
  కమలము ముకుళించె సూర్యకరములు సోకన్

  రిప్లయితొలగించండి
 21. నెమరుచు నాంగ్లపు రైములు
  సుమతీ! వినలేద నీవు సుందర వదనా!
  విమలపు నీటను బాసిన
  కమలము ముకుళించె సూర్యకరములు సోకన్

  రిప్లయితొలగించండి