15, జూన్ 2014, ఆదివారం

పద్యరచన - 591

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26 కామెంట్‌లు:

  1. పక్కింటి పిన్ని గారికి
    యెక్కించగ కబురులెల్ల యిల్లే మరచెన్
    తిక్కెక్కిన పతిదేవుడు
    ఎక్కించుకు భుజముమీద యింటికి చేర్చెన్

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    కొద్ది సవరణలతో మీ పద్యం....

    పక్కింటి పిన్ని గారికి
    నెక్కించగ కబురులెల్ల నిల్లే మరచెన్
    తిక్కెక్కిన పతిదేవుం
    డెక్కించుకు భుజముమీద యింటికి చేర్చెన్.

    రిప్లయితొలగించండి
  3. ఆహా యేమా ధైర్యము
    బాహాటముగా సతి నిటు పట్టుక పోవన్
    లోహపు గరిటెల మోదును
    మోహిని రాత్రి కతనికిక పులుసులు గారన్!
    జోకు: పబ్లికులో ప్రదర్శిస్తే మరి రాత్రికి ప్రైవేటుగా కోటా తప్పదు, ఆడవాళ్ళా మజాకానా! అప్పడంలా నంచుకు తింటారు, పాపం పిచ్చి సన్నాసికి తెలియదు.

    రిప్లయితొలగించండి
  4. చీకటి పడినది పిన్నీ!
    నా కాంతుండోర్చుకొనడు నమ్మాకటికిన్
    గేకలు వేసెను, బలిమిని
    చేకొని నను బోవుచుండె జెడుపేముందో!

    రిప్లయితొలగించండి
  5. చంద్రశేఖర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నా పతి యోర్చడాకలికి నమ్ముము పిన్ని యనంచు నుండగా
    నా పతి వచ్చి యబ్జముఖి నాగక శీఘ్రముగా భుజమ్ముపై
    కోపముతోడ వేసుకొని క్షుత్తును దీర్చమనంచు పోయెరా
    పాపము రాత్రి వేళ యిక వానికి తిప్పలు తప్పుటెట్టులో!

    రిప్లయితొలగించండి
  7. మతిమ రుపుగల భార్యను మంద లించి
    తనదు భుజముపై ననమోసి కొనుచు పోవు
    చుండె నింటికి చూడుము సుజన ! నీవు
    జాలి గుండెల భర్తలు మేలు గాదె !

    రిప్లయితొలగించండి
  8. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మాస్టారూ ! సవరణలకు ధన్యవాదములు. ఒకే రకమయిన తప్పులు మళ్ళీ మళ్ళీ దొర్లుతున్నాయి . మీ వోర్పుకు హాట్సాఫ్!

    రిప్లయితొలగించండి
  10. చంద్రమౌళి రామారావు గారి పూరణ :

    పొరుగావిడ యండాళ్ళుకు
    సరియగు మీనాక్షి చెప్పసాగెను కడుపు
    బ్బరమున లోగుట్టుల, విని
    కూరిమి శ్రీవారు బేలఁ గొనిపోయె వెసన్

    రిప్లయితొలగించండి
  11. చంద్రమౌళి రామారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ చంద్రమౌళి రామా రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    4వ పాదములో ప్రాస నియమము పాటింపబడ లేదు.
    4 పాదములలోను తొలి అక్షరము హ్రస్వముగా నుండ వలెను. ఆలాగున రాలేదు కదా!.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. చంద్రమౌళి రామారావు గారూ,
    నేమాని వారి సూచనను గమనించారు కదా!
    నాల్గవ పాదాన్ని ‘గురుకొని’ అని మొదలుపెడితే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  14. ఇరుగు వారి మాట పొరుగిల్లు చేరెనా
    కొట్టు కొనెద రంచు కోపగించి
    సతిని భుజము పైన పతిమోయు కతనాన
    లౌక్య మైన మాట లల్లె జాన

    రిప్లయితొలగించండి
  15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యం....

    ప్రక్కయింటి పిన్ని వాక్కులన్ వినుచును
    మగనిమాట మరచె మగువ యొకతె
    విసుగుచెంది భర్త వేగఁ దానేతెంచి
    యింతి నెత్తుకు చనె యింటికడకు.

    రిప్లయితొలగించండి
  16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. పొరుగింటి పుల్ల కూరను
    విరగబడి తినగ బలిసిన వేయి కిలోలౌ
    భరియించు భర్త గావున
    బరువైనను మోయ వలయు పాపిని నేనై

    రిప్లయితొలగించండి
  18. అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. ఇరుగు వారి మాట పొరుగిల్లు చేరెనా
    కొట్టు కొనెద రంచు కోపగించి
    సతిని భుజము పైన పతిమోయు కతనాన
    లౌక్య మైన మాట లల్లె జాన

    రిప్లయితొలగించండి
  20. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. చంద్రమౌళి రామారావు గారు గురువులకు ధన్యవాదములతో చేసిన సవరణ :

    పొరుగావిడ యాండాళ్ళుకు
    సరియగు మీనాక్షి చెప్పసాగెను కడుపు
    బ్బరమున లోగుట్టుల, విని
    కొఱకొఱ శ్రీవారు చూచి గొనిపోయె వెసన్

    రిప్లయితొలగించండి
  22. ఇంటి పనులు మాని ఇరుగు పొరుగుతోడ
    ముచ్చటించ వలదు ముదిత లార
    ఇంటి గుట్టు నెపుడు విప్పకూడదుసుమీ
    గోప్య ముంచి నంత గొడవ లేదు

    రిప్లయితొలగించండి
  23. భరియించువాడు భర్తను
    సరి సామెత యిచట చూడ చక్కగకుదిరెన్
    తరియించెను స్త్రీలోకము
    అరకొర కబురులకుపడెను అంతపుచుక్కే!

    రిప్లయితొలగించండి
  24. ఎత్తుకెళ్ళగలిగె నీయన నామెను
    కూడు బెట్ట మనుచు చూడ నిపుడు
    పిన్నిగారి భర్త పిలుచుటకే నోరు
    రాక నీరసమున వ్రాలియుండు.

    రిప్లయితొలగించండి
  25. చంద్రమౌళి రామారావు గారూ,
    మీ సవరణ బాగుంది. సంతోషం!
    *
    ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తరియించెను స్త్రీలోక/ మ్మరకొర కబురులకు పడిన దంతపు చుక్కే’ అనండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీరు చిత్రంలో కనిపించని పిన్నిగారి భర్తను చూడగలిగారు. బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి