చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, సవతి తల్లి కొడుకు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అక్కయ్యా, మేనమామను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. * జిలేబీ గారూ, మీ భావానికి పద్యరూపం....
ఈ విడాకుల మాడరన్ జీవితాల కాలమునఁ దండ్రి వేఱొక కాంతఁ బెండ్లి యాడి యింటికిఁ గొనివచ్చె నట్టి సవతి తల్లికి జనించువాఁడు సోదరుఁడు కాదు.
1.తల్లికి జనించు వాడు సోదరుడు కాదు యనుట జెల్లును మృగ పక్షి గణములందు వింత యాచారముల వేల్పు వేశ్య లందు కాని భరత చట్టము నందు గానరాదు 2.ధర్మ పత్నులు పెక్కురు తండ్రి కున్న తల్లి యుదరము వేరైన తనయు లెల్ల యన్నదమ్ములౌదురు గాని యెన్న సవతి తల్లికి జనించు వాడు సోదరుడు కాదు
మల్లెల సోమనాథ శాస్త్రి గారి పూరణలు..... 1. నాడు రోమను రాజ్యాన తోడ బుట్టు వాని బెండ్లాడి రాణులై వరలు వారు రక్త సంకర మదియె వరలక యుండ తల్లికి జనించు వాడు సోదరుడు కాడు 2. తండ్రితల్లికి జనియింప తండ్రి వరుస తల్లితల్లికి జనియింప తాను మామ తండ్రితనయుడే యైనను ధరను మారు తల్లికి జనించు వాడు సోదరుడు కాడు 3. అరయ తల్లిని కూడిన నాలపోతు మరల యా దూడకే తాను మగడు యౌను సరిగ వావియు లేనట్టి జంతు తతిని తల్లికి జనించు వాడు సోదరుడు కాడు.
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘కాడు + అల్ల’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి జరుగుతుంది. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘కాదు + అనుట’ అన్నప్పుడు యడాగమం రాదు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మూడవ పూరణలో ‘మగడు + ఔను’ అన్నప్పుడు యడాగమం రాదు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవతి తల్లిని ద్వేషించు సవతి కొడుకు
రిప్లయితొలగించండిగర్భవతి యైన యామెను గాంచి, సవతి
తల్లికి జనించువాఁడు సోదరుఁడు కాదు,
అన్యమాతృజు డగునని యరచెనతడు
చంద మామను మించిన యంద గాడు
రిప్లయితొలగించండికుందన పుబొమ్మ వవినిన్ను కోరి కోరి
చిన్న తనమున నుండియా శించె , తల్లి
తల్లికి జనియించు వాడు సోదరుడు కాదు
తల్లి తల్లికి = అనగా మేనమామ
రిప్లయితొలగించండిఈ విడాకుల మాడర్ను కాలములో
తండ్రి మారు పెళ్లి చేసుకొని వచ్చె
ఇంట వచ్చిన ఇంతి తల్లి ఐన ఆ
తల్లికి జనించువాఁడు సోదరుఁడు కాదు !!
జిలేబి
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిసవతి తల్లి కొడుకు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అక్కయ్యా,
మేనమామను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
మీ భావానికి పద్యరూపం....
ఈ విడాకుల మాడరన్ జీవితాల
కాలమునఁ దండ్రి వేఱొక కాంతఁ బెండ్లి
యాడి యింటికిఁ గొనివచ్చె నట్టి సవతి
తల్లికి జనించువాఁడు సోదరుఁడు కాదు.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కూతునకునైన చూడగా కొడుకుకైన
రిప్లయితొలగించండిభార్యతమ్మునికైనను బావకైన
చెల్లి, తమ్ముడు, మామకు,చెప్ప తల్లి
తల్లికి జనించువాడు సోదరుడు కాదు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....
రిప్లయితొలగించండినన్ను ప్రేమతోఁ బెంచిన నాదు తల్లి
తల్లికి జనించువాఁడు సోదరుఁడు కాదు
పెనిమిటయ్యెను నన్ను తాఁ బెండ్లియాడి
యమ్మ కిచ్చిన బాసల నాచరించి.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమేనమామ విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తల్లికి జనించు వాడు సోదరుడు? కాదు
రిప్లయితొలగించండితల్లి భూమాత పశుపక్షి తరులకైన
పంచభూతాత్ములందరు భ్రాతృభగిని
యనుట హైందవ విధికాద ఆర్యులార !
యం. ఆర్. చంద్రమౌళి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అల్ల కృష్ణుడు కంసునికల్లుడవడు
రిప్లయితొలగించండిఅల్ల కర్ణుడు ధృపదునికల్లుడవడు
భక్తీ జూపక, బంగరు భరత భూమి
తల్లికి జనించువాఁడు సోదరుఁడు కాదు
ప్రేమ సంబంధ బంధపు విలువ నరసి
రిప్లయితొలగించండివావి వరసలు పాటించ వలెను గాన
పిలుచుచుందురు వరసలు కలిపి, మారు
తల్లికి జనించువాడు సోదరుడు కాదు.
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
1.తల్లికి జనించు వాడు సోదరుడు కాదు
యనుట జెల్లును మృగ పక్షి గణములందు
వింత యాచారముల వేల్పు వేశ్య లందు
కాని భరత చట్టము నందు గానరాదు
2.ధర్మ పత్నులు పెక్కురు తండ్రి కున్న
తల్లి యుదరము వేరైన తనయు లెల్ల
యన్నదమ్ములౌదురు గాని యెన్న సవతి
తల్లికి జనించు వాడు సోదరుడు కాదు
మల్లెల సోమనాథ శాస్త్రి గారి పూరణలు.....
రిప్లయితొలగించండి1.
నాడు రోమను రాజ్యాన తోడ బుట్టు
వాని బెండ్లాడి రాణులై వరలు వారు
రక్త సంకర మదియె వరలక యుండ
తల్లికి జనించు వాడు సోదరుడు కాడు
2.
తండ్రితల్లికి జనియింప తండ్రి వరుస
తల్లితల్లికి జనియింప తాను మామ
తండ్రితనయుడే యైనను ధరను మారు
తల్లికి జనించు వాడు సోదరుడు కాడు
3.
అరయ తల్లిని కూడిన నాలపోతు
మరల యా దూడకే తాను మగడు యౌను
సరిగ వావియు లేనట్టి జంతు తతిని
తల్లికి జనించు వాడు సోదరుడు కాడు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు సవరించిన పూరణ....
రిప్లయితొలగించండిఅధికప్రేమతోఁ బెంచిన యమ్మయొక్క
తల్లికి జనించువాఁడు సోదరుఁడు కాదు;
ఆప్తుఁడౌ మేనమామయౌ నాదరించి
పెండ్లియాడిన కోడలి పెనిమిటి యగు.
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కాడు + అల్ల’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి జరుగుతుంది.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘కాదు + అనుట’ అన్నప్పుడు యడాగమం రాదు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణలో ‘మగడు + ఔను’ అన్నప్పుడు యడాగమం రాదు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పసుపు బొమ్మకు ప్రాణమీయ సుతుడైస
రిప్లయితొలగించండివిఘ్నముల బాపి కరుణించు వేలుపు నకు
తారకాసురుఁ జంపగ తనయుఁ డగుచు
తల్లికి జనించు వాడు సోదరుడు కాదు!
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సోదరుండగు నిజమిది సూర్య !వినుము
రిప్లయితొలగించండితల్లికి జనించు వాడు, సోదరుడు కాడు
మేనయత్తకు బుట్టిన నాని మనకు
బావ యగుజుమీ తెలియుము బంధ మిటుల
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధర్మజుని నాకు నన్నగా తగదు పలుక
రిప్లయితొలగించండిసూది మొన మోపు నేలైన చూడు తండ్రి
యీయ జాలను వానికి వాయు సుతుని
తల్లికి జనించువాఁడు సోదరుఁడు కాదు
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంటిపనిచేయ నొకనిని వెంట తెచ్చి
రిప్లయితొలగించండికాలక్రమమున యతనికి బాలతోడ
పరిణయంబైన నాతడెపైడితల్లి,
తల్లికి జనించువాడు సోదరుడుకాదు
రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పైడితల్లి పూరణ బాగుంది. అభినందనలు.
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిపొరపాటే.. ‘అవడు + అల్ల’ అని టైపు చేయబోయి ‘కాడు + అల్ల’ అన్నాను. మన్నించండి.