రామాయణము-
చతుర్విధకందము
నీతిగ దివిజవితానము
భాతిన్, ఘనకేసరిశిశువర్గం
బనఁగా,
భూతకరుణాత్ము లనియెడి
ఖ్యాతిన్, జననాథసుతనికాయము
దనరెన్. (౨౮)
భారతము-
చతుర్విధకందము-
ఘనకేసరిశిశువర్గం
బనఁగా భూతకరుణాత్ము
లనియెడు ఖ్యాతిన్,
జననాథసుతనికాయము
దనరెన్ నీతిగ దివిజవితానము
భాతిన్. (౨౮)
(‘భూతకరుణాత్ము లనియెడు’ నుండియు, ‘జననాథసుతనికాయము’ నుండియుఁ జదివినను
కందపద్యములు వచ్చును.)
టీక- వితానము, వర్గము, నికాయము = గుంపు.
రావిపాటి లక్ష్మీనారాయణ
పద్య మంతయు దెలుపును హృద్యముగను
రిప్లయితొలగించండిరామ కధ యను బేరన రామ బలము
భాగ మందున నీకధ భారతంబు
భళిర యనిపించె రెండింటి భావములును .
పద్యంబొక్కటె చూడగ
రిప్లయితొలగించండిహృద్యంబే రామచరిత హితముగ మొదటన్
పద్యము మధ్యన మొదలిడ
చోద్యంబే భారతమ్ము సొగసుగ కుదిరెన్.
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
భారత గర్భ రామాయణాన్ని ప్రశంసిస్తూ మీరు చెప్పిన పద్యాలు బాగున్నవి. ధన్యవాదాలు.