గురువర్యులిరువురకు ధన్యవాదములు. సవరించిన పద్యం : సామాజిక ధర్మమెరిగి నీమము పాటించి దైవ నిష్టలలవడన్ సేమంబును గోరి సలుపు సామూహిక వ్రతములెల్ల సత్ఫల మొసగున్!
గురువుగారు, ధన్యవాదాలు. ఊళ్ళోలేనందువల్ల ఒక పదిరోజులవి వ్రాసి పెడితే ఇరవై అయినాయి. వచ్చింతర్వాతా కొంచెం బిజీగా ఉండడంతో మళ్ళీ పేరుకున్నాయి. ఇప్పుడు అన్నీ పెడితే చూసే ఓపిక మీకయినా ఇంకెవరికయినా ఎట్లుంటుంది అని మొహమాటపడి ఈరోజు నుంచి ఆరోజువి ఆరోజుకే చేద్దామని మొదలుపెట్టినానండి.
లక్ష్మిదేవి గారూ, పరవాలేదు... ఆ పద్యాలన్నింటినీ బ్లాగులో ప్రకటించండి. సమయానుకూలతను బట్టి నేను పరిశీలిస్తాను. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
సామూహిక వ్రత కల్పము
రిప్లయితొలగించండిశ్రీమంతులు, పేద లింక స్త్రీ, పురుషులు, తా
మీ మాదిరి సలుపుట - "సమ
సామాజిక లక్షణ"మని సంతోషమగున్!
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిసమ సామాజిక లక్షణాన్ని తెలిపిన మీ పద్యంతో బ్లాగుకు శుభోదయ మయింది. అభినందనలు, ధన్యవాదాలు.
దీపమునే శ్రీ లక్ష్మిగ
రిప్లయితొలగించండిపాప పరిహరమునకంచు, వనితలు జగతిన్
కాపాడమనుచు వినయము
తో పూజలఁ జేయుదురట; తొలి నే వింటిన్.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిఈమధ్య మీరు మరీ నల్లపూస అయిపోతున్నారు.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
సామాజిక ధర్మమెరిగి
రిప్లయితొలగించండినీమము పాటించి దైవ నిష్ట మరువకన్
సేమంబును గోరి సలుపు
సామూహిక వ్రతములెల్ల సత్ఫల మొసగున్!
సామూహిక వ్రత విధుల
రిప్లయితొలగించండిన్నీమముతో కలసి మెలసి నిశ్చల మదితో
కోమల స్త్రీ పురుషోత్తము
లేమరకను జేయుచుండ్రి యెన్నగ వశమే!
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
స్త్రీ లు గుంపుగ నచ్చట సిరుల కొరకు
రిప్లయితొలగించండిసత్య నారాయ ణ వ్రత మ త్యంత నియతి
గలిగి జేయుట సంతోష ములుగ దార్య !
నేను వత్తును జేయంగ వ్రతము నచట
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
శ్రీ సహదేవుడు గారు! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
వ్యతిరేక అర్థక పదములో ద్రుతము రాదు. మీరు మరువకన్ అని వాడేరు కదా. సరిచేయండి.
శ్రీ సుబ్బా రావు గారు! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
2వ పాదములో గణములు సరిగా లేవు.
స్వస్తి.
గురువర్యులిరువురకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరించిన పద్యం :
సామాజిక ధర్మమెరిగి
నీమము పాటించి దైవ నిష్టలలవడన్
సేమంబును గోరి సలుపు
సామూహిక వ్రతములెల్ల సత్ఫల మొసగున్!
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండినేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా.
మీ రెండవ పాదాన్ని ఇలా మార్చితే?
‘సత్యనారాయణుని వ్రత మత్యనురతి’
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యం....
రిప్లయితొలగించండికూడినారు ప్రజలు గుడిలోన భక్తితో
విష్ణుపూజ జేయ ప్రీతితోడ
స్వామిపూజలోన జనులంత సమ మని
తెలియజేయుచుండ్రి తీరుగాను.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
సందోహ మందు జనులట
రిప్లయితొలగించండిబంధుర ముగ కలసి మెలసి భార్గవి కొలువన్
వందిత మగు భక్తి మెయిని
నందరు పూజింతు రంట నానందము గన్
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ఊళ్ళోలేనందువల్ల ఒక పదిరోజులవి వ్రాసి పెడితే ఇరవై అయినాయి. వచ్చింతర్వాతా కొంచెం బిజీగా ఉండడంతో మళ్ళీ పేరుకున్నాయి.
ఇప్పుడు అన్నీ పెడితే చూసే ఓపిక మీకయినా ఇంకెవరికయినా ఎట్లుంటుంది అని మొహమాటపడి
ఈరోజు నుంచి ఆరోజువి ఆరోజుకే చేద్దామని మొదలుపెట్టినానండి.
సామూహిక పూజలకై
రిప్లయితొలగించండిసామగ్రిని సిద్ధ పరచి సమ్యగ్రీతిన్
తామెల్లరు కూర్చుండిరి
యీమహివర్ధిల్లువరుణుడికపైననుచున్
లక్ష్మిదేవి గారూ,
రిప్లయితొలగించండిపరవాలేదు... ఆ పద్యాలన్నింటినీ బ్లాగులో ప్రకటించండి. సమయానుకూలతను బట్టి నేను పరిశీలిస్తాను.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
గురువు గారూ,
రిప్లయితొలగించండిమీ కృపాపూరితమైన వాక్కులు ఎంతో సంతోషాన్నిస్తున్నాయి.
30 మే నుంచి నేను చేయగల్గినవి ....
౧. పద్య రచన – 575
కురులను దువ్వెడు తల్లికి
దొరకక పరుగిడెడు వేళ తుంటరి యౌరా!
కురులను దేవునికిచ్చిన
చిరునవ్వుల చిందె పాప సింగారముగా!
౨.సమస్యాపూరణం – 1428 (ధారణ లేనియట్టి యవధానము)
దూరపు తీరమందు కవి తొందరఁ జూపక జాలమందునన్
కోరినరీతులన్ పదము గొప్పగ గూర్చుచు వ్రాసి పంపుచో
ధారణ లేనియట్టి యవధానము గొప్పది; యెంచి చూడగన్
నేరుగనెల్లరున్ కలిసి నేడు సభల్ జరుపంగ సాధ్యమే?
౩.పద్య రచన – 576 _బీటలు వారినభూమి
చినుకుల పలుకుల నెఱుగక
కనులను నీరెండిపోగ కర్షకుడోడెన్
మనమది కరుగదొ వరుణా!
కనికరమునుఁ జూపవయ్య!కందుము వానల్!
౪.సమస్యాపూరణం – 1429 (పరిహాసము చేయువాఁడె)
పరిపరి విధముల కష్టము
దరిచేరినగాని గొప్ప ధైర్యముతోడన్
హరిశరణము పొందితినని
పరిహాసము చేయువాఁడె ప్రాజ్ఞుఁడు జగతిన్.
౫.సమస్యాపూరణం – 1427 (గుణహీనుండయ్యె నతఁడు)
గణనకు రానిపనులలో
గుణహీనుండయ్యెనతడు, గురుకృపచేతన్
గణితమునందు కృషి సలిపె;
గణుతికి నెక్కెను జగతిని, కల నిజమయ్యెన్.
౫.పద్య రచన – 574 బొమ్మలకొలువు
రంగుల బొమ్మలును, వివిధ
హంగులతోడ యమరించి యందముమీరన్
సింగారించియు పండుగ
బంగారముగా నగరిని పాటింతురుగా.
౬.సమస్యాపూరణం – 1426 (లంచము నీయఁగోరె హరి)
లంచమునీయఁ గోరె హరి లక్ష్మినిఁ బొందగ గోరి లుబ్ధుడై
కొంచెము ప్రేమతోడ మరి కొంచెము స్నేహపు భావనమ్ముతో;
యంచల, చిల్కలన్, నెమళులన్ తలపించె గుణాళి కల్గి యే
కుంచెను జాలువారినదొ కొమ్మయనంగల బొమ్మపై మదిన్.
౭.పద్య రచన – 573 పూలవ్వ
పూలఁ దెచ్చియవ్వ మురిపెమొప్ప నమ్ము
పడతులకు వేళ తప్పక; పండగైన
నెట్టి వేడుకైన కనుల కింపు గూర్చు
రంగురంగుల పూలను రాశిపోసి.
౮.పద్య రచన – 572 గాజులు నిండిన మగువ చేయి
కరమునిండుగ గలగల గాజులుండ
నెంత శోభస్కరమ్మది యింతికైన!
చూచొ వారికైనను తోచు సొబగులందు
నిన్న, నేడును, రేపును నిక్కమిద్ది.
౯.సమస్యాపూరణం – 1424 (తారలు మధ్యాహ్నవేళ)
కూరిమి మీరగా తనదు కూతురి పెండ్లికి రంగుదీపముల్
తోరణ కట్ట వెల్గులవి దూరమునన్ వెలుగొందు సూర్యునిన్
మీరగ జాలునే? వెలిగి మెల్లగ నారెడు నాటి దివ్వెలా
తారలకాంతిచే పగలు తళ్కులు చిందియు తెల్లబోయెగా
౧౦.పద్య రచన – 571ఊయలలో భామలు
ఊయలలూగుచు లేమలు
హాయిగనుద్యానవనము నందాడినచో
మాయముగావే చింతల్
బాయును మనమందుదాగు బాధల్ గీదల్.
నమోన్నమః
11.సమస్యాపూరణం – 1423 (పాపము చేయంగవలెను)
రిప్లయితొలగించండిపాపము చేయగా, వలయు భాగ్యము నందగ_ నెల్లవేళలన్
శాపములంది జీవనము సాగక నన్యుల నీడ నుండుచో
లోపలి మత్సరమ్ములకు లోకువగాక జనాళి ధర్మమం
దే పరమార్థమున్ గనిన దివ్యమదేను సుమా! సహోదరా!
౧౨.పద్య రచన – 570 అలంకరించిన కూరలంగడి
కూరల ఫలముల బాగుగ
నేరుపుతోడ నిటనెవరొ నింపాదిగనే
కూరిచి యుంచిరి భళిరా!
సౌరును గనినంత నెంతొ సంబరమయ్యెన్.
౧౩.పద్య రచన – 569 (పచ్చబొట్టు)
మునుపటి నాళుల ప్రియముగ
మనుజులు పలు పచ్చబొట్ల మక్కువమీరన్
తనువుపయిన దాల్చెడు లీ
లను నేడును నాగరికులు రమ్యత గనరే!
౧౪. గాయత్రి
గాయత్రీ! పదరేణువైమనగ నీకారుణ్యమున్ జూపుమా!
నీ యౌదార్యము దొడ్డదంద్రు;జగముల్ నీ యాజ్ఞనే సాగు, నా
పై యేలా కనుజూపు వ్రాలదు? సదా భ్రాంత్రిన్ మెలంగున్ మదిన్
కైయండన్ భవబంధముక్తినిడుమా!కాపాడుమా జీవునిన్.
గురువుగారు , చిత్తగించండి.
పురుషులు స్త్రీలు యజ్ఞము సమూహముగా దలపెట్టి మంత్రముల్
రిప్లయితొలగించండివరుసగ వల్లె వేయుచును వాజము బోయుచు కుండ మందునన్
విరివిగ దీప వృక్షమున వేయుచు తైలము కాంతి నింపుచున్
వరుణుని వేడు చుండి రట వర్షము నిమ్మని సాగు నీరుకై!
15.పద్య రచన – 568 (పసుపు కుంకుమలు)
రిప్లయితొలగించండిపసుపుకుంకుమపూవులు పడతి కోరి
విడువనెంచబోదు తెలియ వివరమెల్ల
చెప్పువారు లేక యెఱుక చిక్కకున్న
పిల్లవాండ్రననుట తప్పు పెద్దలార!
౧౬.వేదమాత
మానవాళికి బోధల మార్గదర్శ
నమ్ముఁ జేయ నవతరించెనాడు భువిని
నేటికైన నచ్చెరువగు నిక్కమైన
శాస్త్రమిదియె తొల్లి వెలిసె సార్థకముగ.
౧౭.సమస్యాపూరణం – 1420 (బహుపత్నీవ్రతమె)
మహదానందముతోడను
బహుపత్నులకూడి మెలగు భర్త యొకండున్
సుహృదులతో పలికెనిటుల_
బహుపత్నీవ్రతమె మేలు భర్తలకెల్లన్
౧౮.పద్య రచన – 567 చిన్నారి రైతులు
రైతుదంపతులను బోల రమ్యమైన
రీతి చిన్నవారివురును లెస్స నిలిచి
కనుల పండుగ జేయగ కంటిమయ్య!
చల్లగానుండదీవింతు శాంతివడసి.
౧౯.పద్య రచన – 566 సమర్థురాలైన వనిత
వనితల శక్తియుక్తులును వన్నెలు చిన్నెలు తల్లిప్రేమలున్
కని, కొనియాడకుండినను కష్టముఁ బెట్టక యుండరాదొకో!
మనమున భేదభావములు మార్చుకొనంగల ధీమతుల్ , సదా
జనులకు మంచిచెడ్డలను చక్కగ చెప్పగ వేడికోలిదే!
౨౦.సమస్యాపూరణం - 1418 (కలువ పూవులోన)
కలువపూవులోకటికపుగరళముండు
ననుట మూర్ఖతనపుమాట! యాకసమున
సుధలనొలికించెడు శశాంకుజోడియైన
దానిలోన విషమదెట్లు దాగగలదు?
౨౧.పద్య రచన – 565 వివిధ రాజకీయపక్షాల గుర్తులు
రాజరికముపోయె రాజులనజనులె
యంచుమురిసి ముక్కలైననేమి?
లెక్కదాటిపెరిగి లీలలఁ జూపించు
పక్షములను గనిన బాధపెరుగు.
౨౨.సమస్యాపూరణం - 1417 (నలుగురితోఁ దిరుగు)
గలగలమను నవ్వులతో
కలకలలాడి మురిపించు కానుకలంచున్
చిలకలపలుకుల పిల్లలు
నలుగురితో తిరుగు సాధ్వి నాయిల్లాలే
౨౩.పద్య రచన – 564 (అభిషేకము)
ఈశుని తొలుతగ గంగయు
నాశగ నభిషేకములతొ నారాధించెన్
పాశము విడివడ దేవుని
దేశముఁ జేరగ సలిపెద దేవా! నేనున్.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ ఆసక్తికి, ఓపికకు నమస్సులు. వీలును బట్టి ఈ పద్యాలను సమీక్షిస్తాను.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.