13, జూన్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం - 1443 (సారా గ్రోలంగ జన్మ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.
(ఆకాశవాణి వారి సమస్య)

34 కామెంట్‌లు:

 1. శ్రీరామ తత్త్వవైభవ
  సారంబగు పాయసమిది సజ్జనులారా!
  రారండీ దీనిని మన
  సారా గ్రోలంగ జన్మ చరితార్థమగున్

  రిప్లయితొలగించండి
 2. పారా వారపు టొడ్డున
  ఆరావణు నిలిపె నంట సైకత లింగం
  బారాధన జేసి తనమన
  సారా గ్రోలంగ జన్మ చరితార్ధ మగున్

  రిప్లయితొలగించండి
 3. పండిత నేమాని వారూ,
  శ్రీరామతత్త్వపు పాయసాన్ని మనసారా గ్రోలుమన్న మీ పూరణతో బ్లాగుకు సుప్రభాత మయింది. సంతోషం. ధన్యవాదాలు.
  *
  అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  రెండవ పాదంలో యతి తప్పింది. ‘రావణు’ అనడంలో అన్వయం కుదరడం లేదు. అయినా లింగాన్ని మనసారా గ్రోలడం ఎలా? మరో ప్రయత్నం చేయండి. నేమాని వారి పూరణ మీకు మార్గదర్శనం చేస్తుంది.

  రిప్లయితొలగించండి
 4. నమస్కారములు
  ముందు పండితుల వారినే అనుకరించి వ్రాయాలనుకున్నాను ప్చ్ !అంతలోనే మనసు కాస్తా ప్రొద్దు తిరుగుడై పోయింది.

  రిప్లయితొలగించండి
 5. వారిజభవకృత మానస
  నీరధి హిమగిరి పవిత్రనిధియిదె గొనుమా
  నీ రజతమనాశకి తెలు
  సా, రా గ్రోలంగ జన్మ చరితార్థమగున్

  రిప్లయితొలగించండి
 6. యం. ఆర్. చంద్రమౌళి గారూ,
  చక్కని పూరణ చెప్పారు. ‘తెలుసా, రా’ అన్న విరుపుతో వివిధ్యంగా ఉంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. శ్రీ రాముని ధర్మనిరతి
  భూరి దయారస గుణముల పూర్వమనంగన్
  శ్రీ రామాయణమును మన
  సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.

  రిప్లయితొలగించండి
 8. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. శ్రీరామడు ఘన సద్గుణ
  కారుణ్యంబులకు జలధి కలుషాంతకుడా
  శ్రీరామ నామ సుధ మన
  సారా గ్రోలంగ జన్మ చరితార్ధ మగున్

  రిప్లయితొలగించండి
 10. శ్రీరాముని తత్త్వము మన
  సారా గ్రోలంగ జన్మ చరితార్ధమగున్
  రారా పోదము మనమును
  నారాముని భజన జేయ నాలయ మునకున్

  రిప్లయితొలగించండి
 11. రారా! నా వలపుల దొర!
  నీ రాధను, జాలి లేద? నీరజ నేత్రా!
  ఈరా ప్రేమసుధల, నలు-
  సా? రా! గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.

  రిప్లయితొలగించండి
 12. నా రాధ! మదన కేళికి
  రారాదా యమున దరికి? రాగామృతమున్
  తేరాద? ప్రేమపుంతప-
  సా! రా! గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.


  రిప్లయితొలగించండి
 13. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రాముడు టైపాటు వల్ల రామడు అయింది.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. శ్రీరాముడు దాశరధుడు
  శూరుడు కారుణ్యగుణ విశోభితుడు హరిన్
  గోరి, భవనామమును మన
  సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.

  రిప్లయితొలగించండి

 15. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  నిన్నటి సమస్యకు నాపూరణ పై తమరివ్యాఖ్య తెలుపoడి
  సమస్య:సారా గ్రోలంగ జన్మ చరితార్ధ మగున్
  కే.రా.ఫిల్మున దృశ్యము
  నా.రా.త్రాగంగ దెచ్చె నాయిక నెత్రున్
  “రారా త్రాగుము నీవీ
  సారా గ్రోలంగ జన్మ చరితార్ధ మగున్”

  రిప్లయితొలగించండి
 16. శ్రీ శంకరయ్య గారు,
  అందరినీ ప్రోత్సాహిస్తూ వ్యక్తిగతమైన బాధలనూ లెక్కించక మీరు చేస్తున్న సరస్వతీ నిత్యకైంకర్యం ప్రశంసనీయము మరియు అనుసరణీయము. పూరణం మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
  నమస్కృతులు,
  చంద్రమౌళి

  రిప్లయితొలగించండి
 17. ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘దాశరథి’ని దాశరథుడు అన్నారు. అక్కడ ‘శ్రీరాముడు రఘువీరుడు’ అనండి.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  మరియొక పూరణ
  “ఏరా రామునిగుడి యిది
  సారా త్రాగంగరాదు” “సరి,సరి,జగమo
  తా రాముడుండె నిచటనె
  సారా గ్రోలంగ జన్మ చరితార్ధ మగున్"

  రిప్లయితొలగించండి
 19. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....

  ఆరోగ్యము చెడు నతిగా
  సారా గ్రోలంగ; జన్మ చరితార్థ మగున్
  పాఱుని సలహాపై హరి
  పారాయణమున్ జరిపెడి ప్రజ లందఱకున్.

  రిప్లయితొలగించండి
 20. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  పూరణ వరకైతే పద్యం బాగుంది. అభినందనలు.
  కాని భావమే ఆమోదయోగ్యంగా లేదు. దేవుడు సర్వాంతర్యామి అని మరుగుదొడ్లో పూజ చేయలేము కదా... అలాగే దేవాలయంలో సారా త్రాగడమూ.. మీ మనసును నొప్పిస్తే మన్నించండి.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. శ్రీ రాముని కావ్య సుధా
  సారము చాగంటి వారు సభికుల మదిలో
  చేరగ ప్రవచించు, మన
  సా!రా! గ్రోలంగ జన్మ చరితార్థమగున్!!!

  రిప్లయితొలగించండి
 22. నోరారా కీర్తించిన
  నారాముడువచ్చి గాయు నమ్ముము నరుడా !
  శ్రీరామనామసుధ మన
  సారా గ్రోలంగ జన్మ చరితార్థమగున్

  రిప్లయితొలగించండి
 23. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. శ్రీ శంకరయ్య గారికి ప్రణామములు.
  పద్యం వ్రాయలేక పోయినా, మీ వంటి మాహానుభావుల పద్యాలు ఆస్వాదించడానికి, రోజుకు రెండు మూడు సార్లు ఈ బ్లాగు దర్సనం తప్పక చేస్తాను.

  మరుగుదొడ్లో రాముదు గుర్తుకు వస్తే, నామస్మరణ చేస్తే తప్పా? బాహ్యపూజ కన్నా, అంతర్ముఖ/ మానసిక చే పూజ ఉత్తమం అంటారు కదా.

  రిప్లయితొలగించండి
 25. శ్రీ మంద పీతాంబర్ గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  3వ పాదములో ఒక లఘువు తక్కువగ నున్నది.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 26. రమణ గారూ,
  పద్యకవిత్వం పట్ల మీకున్న అభిరుచికి సంతోషం!
  రామాలయంలో సారా త్రాగితే జన్మ చరితార్థమౌతుందన్న భావాన్ని ఖండిస్తూ నేనా మాట వ్రాయవలసి వచ్చింది. అంతే!
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణలోని మూడవ పాదాన్ని “చేరగ ప్రవచింతురు మన/సా, రా,...’ అనండి.
  *
  పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 27. నారాయణ లీలామృత
  పారాయణ పాన మిలను పరమాన్నముగా
  గోరుచు నిత్యంబును మన
  సారా గ్రోలంగ జన్మ చరితార్థమగున్ !

  రిప్లయితొలగించండి
 28. ఆరామదాసు చెప్పెను
  మారాముని నామమన్న మధురంబనుచున్
  రారా నామపు రుచి మన
  సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.

  రిప్లయితొలగించండి
 29. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. దేవదాసు ఉవాచ:

  పారును వీడిన నాడే
  దారుణమైనట్టి బ్రతుకు దైన్యంబవగా
  బారులలో బీరు వ్హిసికి
  సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్

  రిప్లయితొలగించండి


 31. ఏరాలముగ జిలేబీ
  వీరావేశముల మాని విభుని తలచుచున్
  భూరిగ మధురిమలన్ మన
  సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 32. మీరిక సాయమ్ముదయము
  సారా గ్రోలంగ...జన్మ చరితార్థ మగున్
  భారము తీరగ నాదిక,...
  కారుది ప్రభుతపు ఖజాన కమ్మగ నిండన్

  కారుది = car's

  రిప్లయితొలగించండి


 33. ఏ రూపంబైన జిలే
  బీ రూఢిగ నతనిదే విభిన్నము లైనన్!
  శ్రీరాముని నామము మన
  సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి