18, జూన్ 2014, బుధవారం

సమస్యా పూరణం - 1448 (విప్రులఁ బూజించిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
విప్రులఁ బూజించిన నపవిత్రులు గారే.

30 కామెంట్‌లు:

  1. నిన్నటి సమస్యకు పూరణ. క్రొత్త సమస్య వచ్చినతరువాత అక్కడ చూస్తారో లేదో అన్న సంశయముతో, ఇక్కడ వ్రాస్తున్నాను. తప్పైన క్షమించండి.


    వామపు ముగింపు నిమ్మన
    రామాయణమునకు, మార్చి వ్రాసెనొకండున్:
    "తా మారెను లంకేశుడు
    రాముడు రావణుని మెచ్చి రాజ్యమ్మొసగెన్"


    "Literature Studies" తరగతులలో, ప్రసిద్ధమైన పుస్తకాలకు వేరొక ముగింపునిస్తే ఎలాగ ఉంటుందని ప్రశ్నించడము అపుడప్పుడు జరుగుతుంది. ఆ త్రోవలో ఈ పూరణ. ఇక్కడ 'వామపు' అంటే 'వక్రపు' లేదా 'ప్రతికూలమైన' అన్న అర్ధంతో వాడాను. సరియో కాదో తెలియదు.

    రిప్లయితొలగించండి
  2. ప్రప్ర ధమము నిద్ర విడచి
    సుప్రభాత సమయ మందు సూర్యుని గొలువన్
    న్నప్ర మేయ మైన రీతిని
    విప్రుల బూజించి ననప విత్రులు గారే ? =

    రిప్లయితొలగించండి
  3. పుష్యం గారూ,
    మరీ రెండు మూడు రోజుల క్రితం సమస్య అయితే ఒక్కొకసారి చూడడం కానీ, చూసినా పని ఒత్తిడిలో వ్యాఖ్యానించడం కానీ జరగదేమో కాని.. నిన్నటి సమస్యను మాత్రం తప్పక పరిశీలిస్తాను.
    ధన్యవాదాలు.
    *
    అక్కయ్యా,
    ‘సుప్రభాత, అప్రమేయ’ అన్నప్పుడు రెండు పాదాల్లోను గణదోషం. సవరించండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. అప్రామాణికతయు వే
    దప్రతిపాద్యవిధివంచనము తద్లాభ
    క్షిప్ర క్రియరత కైతవ
    విప్రులఁ బూచించిన నపవిత్రులు గారే.

    రిప్లయితొలగించండి
  5. యం. ఆర్. చంద్రమౌళి గారు,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తత్ + లాభ = తల్లాభ’ అవుతుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  6. విప్రుల మని ప్రకటించుచు
    ప్రప్రధమముగాగ ధర్మ వర్తన ముడుగ
    న్నప్రామాణికులనదగు
    విప్రులఁ బూచించిన నపవిత్రులు గారే.

    రిప్లయితొలగించండి
  7. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. కప్రా వాసపు విప్రుడు
    సప్రేమను విష్ణు పూజ జరుపుట కతనా
    విప్రుడు పూజా ర్హు డగున్
    విప్రుల పూజించిన నపవిత్రులు గారే !

    రిప్లయితొలగించండి
  9. 18,06.2014.సమస్య:విప్రుల బూ చించిన నపవిత్రులు గారే
    క్షిప్రశ్యేనపువారల?నప్రియమగునెపుడు దేవతార్చనలోనన్?
    సుఫ్రాశువాన కుక్కలు విప్రుల బూ చించిన నపవిత్రులు గారే
    మరియొక పూరణ:అప్రాచ్యుల పాలనలో విప్రుల నతి హీనపరఛ విజ్ఞులు వారే
    అప్రియముగ దూషి౦పగ విప్రుల బూ చించిన నపవిత్రులు? గారే.
    పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    సమస్యలో”బూచించిన” యని” పూరణలు” జించిన

    రిప్లయితొలగించండి
  10. విప్రులమని యపవిత్రపు
    అప్రతిహతి హీన కార్య మాత్మంభరియై
    యప్రమితి లేక జేసెడి
    విప్రుల బూజించి ననప విత్రులు గారే

    రిప్లయితొలగించండి
  11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ...

    అప్రామిణుకు లగుదు
    ర్విప్రులఁ బూజించిన నపవిత్రులు గారే
    యప్రతిహతముగ జదివిన
    విప్రుల పూజలు సలిపిన ప్రియములు గలుగున్.

    రిప్లయితొలగించండి
  12. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కతనా’ అన్నదానిని ‘కతనన్’ అనండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ ప్రయోగం ప్రశంసింపదగినదే. అభినందనలు. కాని ఇది అందరి ఆమోదాన్ని పొందుతుందా?
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    సమస్యలో”బూచించిన” యని” పూరణలు”booజించిన
    యని యున్నవి .రెండుపదాలు సమానార్ధకాలేనా ?
    వివరించవలెను.లోకో భిన్న రుచి .మీకుఆమోదయొగ్యమైతే చాలు

    రిప్లయితొలగించండి
  14. తిమ్మాజీ రావు గారూ,
    మీ ప్రశ్న నాకర్థం కాలేదు. దయచేసి వివరించండి.

    రిప్లయితొలగించండి
  15. రాముడు రావణుని మెచ్చి రాజ్యమ్మొసగెన్


    తామస గుణుడే కదమఱి
    రాముడు, రావణుని మెచ్చి రాజ్యమ్మొసగె
    న్నీ మాట సత్య దూరము
    శ్రీ రాముని సేవ జేయ సిరులను నిచ్చున్


    kshaminchaali , ninnatidi

    రిప్లయితొలగించండి
  16. శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    ఈ నాటి సమస్యలో ఒక టైపు పొరపాటు దొరలినది. "బూజించిన" అనుటకు బదులుగా "బూచించిన" అని టైపు పడినది. సరిచేయండి.

    నా స్వదేశమునకు తిరుగు ప్రయాణము నేడే. 20వ తేదీ ఉదయము విశాఖ చేరుకొంటాను.

    నా శారీరిక స్వాస్థ్యతలో మార్పు లేదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులు మన్నించాలి.
    ఈనాటి సమస్యలో ‘పూజించిన’కు బదులు ‘పూచించిన’ అని పొరపాటున టైపయింది. కెంబాయి తిమ్మాజీ రావు గారు చెప్పినా ఆ పొరపాటును గుర్తించలేక పొయాను. ఇప్పుడు నేమాని వారి వ్యాఖ్య చూసి సమస్యను పరిశీలనగా చూస్తే జరిగిన తప్పు తెలిసిపోయింది. సవరించాను.
    అయినా మిత్రులంతా దాన్ని పూజించిన అనే భావంతోనే పూరణలు చెప్పరు.
    పొరపాటును గుర్తించి నా దృష్టికి తీసుకువచ్చిన తిమ్మాజీరావు గారికి, పండిత నేమాని వారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. పండిత నేమాని వారూ,
    జన్మభూమికి తిరిగి వస్తున్న మీకు హార్దిక స్వాగతం. ఇక్కడి గాలి, నీరు మీకు స్వస్థత చేకూరుస్తాయని నా ప్రగాఢ విశ్వాసం. శుభమస్తు!
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణలను చదివినప్పుడు సందేహం రాలేదు. మీరు ఒక సందేహాన్ని తెలిపినప్పుడూ గమనించలేదు. మన్నించండి.
    *
    సుబ్బారావు గారూ,
    నిన్నటి సమస్యకు మీ ఈనాటి పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి


  19. నాసందేహము గుర్తించి నందుకు ధన్యవాదములు గురుదేవులు మీరే మన్నించాలి

    రిప్లయితొలగించండి
  20. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    నాపూరణ చిత్తగించండి :సప్రశ్రయముగపెద్దల
    విప్రుల బూజించిన, నపవిత్రులుగా రే
    యప్రాచ్యులైన వసుధను
    విప్రులె యాచార్యులు గద వినుతించంగన్
    .

    రిప్లయితొలగించండి
  21. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ తాజా పూరణ చాలా బాగుంది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. ప్రప్రధమము నిద్ర విడిచి
    సుప్రతిభ నుగలిగి యుండి సూర్యుని గొలువన్
    అప్రతిభు డైన మనుజుడు
    విప్రుల బూజించిన నపవిత్రులు గారే

    రిప్లయితొలగించండి
  23. అప్రయతనముగ నైనన్
    దాఁప్రవచించ నపురోహితమ్మగు వచనం
    బే ప్రజ మెత్తురె? నిజమా
    విప్రులఁ బూజించినఁ నపవిత్రులు గారే!

    రిప్లయితొలగించండి
  24. విప్రులము మనది శైవము
    విప్రులు ప్రక్కింటివారు వైష్ణవులంటిన్
    ఓప్రమధనాధ మరియా
    విప్రుల బూజించిన నపవిత్రులుగారే?

    రిప్లయితొలగించండి
  25. శ్రీ శంకరయ్య గారు. అవును అది తల్లాభమే కావాలి. నాదే పొరబాటు.

    రిప్లయితొలగించండి
  26. అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అప్రయతనము’ ప్రయోగం దోషమే.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. విప్రులు యుగపురుషులపుడు
    చప్రాసుల్లవగ నేడు చవటల యెదుటన్
    "కప్రా! శాలువ" నాకను
    విప్రులఁ బూజించిన నపవిత్రులు గారే!

    రిప్లయితొలగించండి


  28. అప్రకృతి పలుకులివియౌ
    "విప్రులఁ బూజించిన నపవిత్రులు గారే"
    కప్రపు సాక్షిగ చెప్పితి
    నప్రతి సుమ్మీ జిలేబి నమ్మను వలదే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. ఏ ప్రతిభయు లేక ధనిక
    సుప్రియలకు దాసులగుచు సుండల కొరకై
    చప్రాసీలగు నకిలీ
    విప్రులఁ బూజించిన నపవిత్రులు గారే

    రిప్లయితొలగించండి