4, జూన్ 2014, బుధవారం

పద్య రచన – 580

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

 1. కాల భైరవు కౌగిలి కదల నీక
  పాప క్షేమము గోరుచు పరమ ప్రీతి
  నమ్మి విడచిన యజమాని వమ్ము యనక
  నుప్పు తిన్నందు కైనను మెప్పు యనగ

  రిప్లయితొలగించండి
 2. అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘వమ్ము + అనక’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘నచ్చునట్లు’ అందామా?

  రిప్లయితొలగించండి
 3. చిక్కని శునకపు కౌగిట
  చక్కని పసిబాలకుండు సాజపు రీతిన్
  అక్కజముగ నాడుకొనుచు
  మిక్కిలిగా గురక పెట్టె మేదినిగనరే!

  రిప్లయితొలగించండి
 4. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభనందనలు.

  రిప్లయితొలగించండి
 5. శునకము ప్రేమను నిచ్చును
  శునకము విశ్వాస మదియ జూపును మనకు
  న్ననుటకు జిత్రము జూడుము
  అనునయముంజూప బిడ్డ హాయిగ నుండెన్

  రిప్లయితొలగించండి
 6. సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘ప్రేమ నొసంగును’, ‘జూడుం/ డనునయముం..’ అనండి.

  రిప్లయితొలగించండి
 7. బిడ్డను వీడి కొల్వునకు వెళ్ళెడు సంస్కృతి వృద్ధిచెందగా
  దుడ్డులు సంగ్రహించుకొన దోషము లేదని వెళ్ళిపోయిరో
  అడ్డుగ బిడ్డ యెందుకని అమ్మయు నాన్నయు విందుకేగిరో
  బిడ్డను నిద్ర బుచ్చుటకు పెంపుడు కుక్కయె దిక్కయెన్ గదా!

  రిప్లయితొలగించండి
 8. చిన్ని బిడ్డడు శయనించె చెన్నుగాను
  వంట పనిలోన పడి యమ్మ యొంటి గుంచ
  కుక్క కాపాడు చున్నది కూర్మితోడ
  శునకమును మించిన రక్షకున్ కనము జగతి

  రిప్లయితొలగించండి
 9. కడుపున బుట్టిన శిశువున్
  విడిచెదరే కుప్ప తొట్ల విపరీతమదే!
  వడిఁ జేరిచి లాలించగ
  పడి చూడగ రండు శునక బంధ మెపటిదో !

  రిప్లయితొలగించండి
 10. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. చక్కగ అక్కున చేర్చుకు
  ప్రక్కన పడుకొని శునకము బాలుని గావన్
  ఎక్కడ అమ్మా నాన్నలు?
  కుక్క కున్నట్టి ప్రేమ కూడా లేదే !

  రిప్లయితొలగించండి