భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * జిలేబీ గారూ, మీ భావానికి నా పద్యరూపం....
పడుచు కోరికల్,సెలరేగు వార్ధకమున వాటి తీయటి తలపుల బాధ, నాటి వయసులో కవి కన్న స్వప్నములు నేటి విశ్రమించెడి కాలాన వెలుగులీను. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, వెంటబడుచున్న కోరికలతో మీ పూరణ వైవిధ్యంగా, మనోరంజకంగా ఉంది. అభినందనలు * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణదోషం.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * చంద్రమౌళి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తనివి తీరని యవ్వన దశను తలచి
రిప్లయితొలగించండిపెరిగి పోయిన వయసుకు తరిగె సొగసు
రెప్ప పాటున కాలము తప్పు కొనెను
పడుచు కోరికల్ సెలరేగు వార్ధక మున
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘యవ్వనదశ’ను ‘యౌవనదశ’ అనండి.
కట్టు వీడిన గుఱ్ఱము గంతు లిడుచు
రిప్లయితొలగించండిపరుగిడుట సాజమటులనే వయసు లోన
పడుచు కోరికల్ సెలరేగు;వార్ధకమున
కోరి పరమాత్మ సన్నిధి చేరదగును
రిప్లయితొలగించండిపడుచు కోరికల్,సెలరేగు వార్ధకమున
వాటి తీయటి తలపుల బాధల్ , నాటి
వయసున కవి కన్న మధుర కలల్
విశ్రామ కాలమున వాటి మెరుపుల్ !!
జిలేబి
paDucu praayamunaMduna paDitivenno
రిప్లయితొలగించండిkashTa nashTaalu kaalammu gaDacipOye
maadhavuni golvumanucunu manasu veMTa
baDucu kOrikal selarEgu vaardhakamuna.
రాజ భవనాన సాగించి రాస క్రీడ
రిప్లయితొలగించండికామ కేళీ విలాసాల కేమరాకు
పట్టుబడినాడు రాష్ట గవర్నరొకడు
పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
రిప్లయితొలగించండినవును వార్ధక్య మనునది యసలు లేదు
కోరి కలకున వియెపుడు గోరు చుండు
బడుచు దనమును నిజమిది బాల !వినుము
గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ....
రిప్లయితొలగించండిపడుచు ప్రాయమునందున పడితివెన్నొ
కష్ట నష్టాలు కాలమ్ము గడచిపోయె
మాధవుని గొల్వుమనుచును మనసు వెంట
బడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపం....
పడుచు కోరికల్,సెలరేగు వార్ధకమున
వాటి తీయటి తలపుల బాధ, నాటి
వయసులో కవి కన్న స్వప్నములు నేటి
విశ్రమించెడి కాలాన వెలుగులీను.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వెంటబడుచున్న కోరికలతో మీ పూరణ వైవిధ్యంగా, మనోరంజకంగా ఉంది. అభినందనలు
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
షష్టి పూర్తి రోజున జంట చక్కనైన
రిప్లయితొలగించండిక్రొత్త దుస్తులు ధరియించి, క్రొత్త లోక
మందు విహరించ, మానస మందు మెదలి
పడుచు కొరికల్ సెలరేగు వార్థకమున
గురువులకు ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి నమస్కారములు.
రిప్లయితొలగించండిపడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
పొసగు జవము మనసు పొందు నొంద
తారతమ్యమెరిగి జూడ తాతకైన
ధర్మకామము యుక్తమే ధరణి లోన
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం.
సహజముగ యుక్త ప్రాయపు జంటలకును
రిప్లయితొలగించండిపడుచు కోరికల్ సెలరేగు, వార్థకమున
తలపునకువచ్చు,సంసార తవిష మీద
నెంత దుర్భర కార్యమో యెరుక పడును
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గణదోషము సూచించినందుకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరణ:-
పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
పొసగు జవము మనసు వాంఛ పొందు నొంద
తారతమ్యమెరిగి జూడ తాతకైన
ధర్మకామము యుక్తమే ధరణి లోన
బాల్య మందుక్రీడలయందు పరమ ప్రీతి
రిప్లయితొలగించండిజవ్వనమునందు సహజము జనుల లోన
పడుచు కోరికల్ సెలరేగు;వార్ధకమున
పారమార్థిక చింతన పరిఢ విల్లు!!!
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెల సోమనాధశాస్త్రి గారి పూరణలు
రిప్లయితొలగించండిపడుచు కవులకు కంటెను,వారియనుభ
వముల శృంగార రసయుత భావములను
చాలబాగుగ వర్ణింప శక్తులగుట
పడుచుకోరికల్ సెలరేగు వార్ధకమున
ఆమ నందున మల్లెలు నాది వలన
బాగ చెలరేగు శృంగార భావములవి.
ముదిమి వారల మదిమెల్గ,మునుపు గుర్తు
పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
పౌత్ర దౌహిత్రుల వివాహ వయసునందు
రిప్లయితొలగించండిపెండ్లి వేడుకఁ జూచిన వృద్ధులకును
షష్టి పూర్తి జరుపుకున్న జంటలకును
పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
పడుచుతనములోన చిలిపి పనులు జేసి
రిప్లయితొలగించండివయసుమళ్ళిన ముదుసలి వయసులోన
గతపు చేష్టలు సతతము మతికి రాగ
పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున!
యౌవనము నందు వాసంత భావనలకు
రిప్లయితొలగించండికమ్మనైనట్టి తావుల గాలికెగసి
పడుచు కోరికల్ సెలరేగు; వార్ధకమున
మోక్షమార్గంపు గంగలో మునక మేలు
రిప్లయితొలగించండిఆశ శర్మిష్ఠపై దేవయాని యున్న
శాప మొందినన్ వృద్దుడై శమముగాక
యౌవనార్థియై సుతుని యయాతి యడుగ
పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
maasTarugaaroo ! dhanyavaadamulu.
రిప్లయితొలగించండిమల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మనసు నూయల నూపుచు తనువు మరచు
రిప్లయితొలగించండియుగళ గీతాల వినుచుండి మిగుల మురిసి
కనులు మూయుచు కలలోన తనరు వేళ
పడచు కోరికల్ సెలరేగు వార్ధకమున!
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.