30, జూన్ 2014, సోమవారం

పద్యరచన - 606

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

28 కామెంట్‌లు:

  1. చిరుగు చొక్కాను తొడిగినా చింతలేదు
    బియ్యమే లేకపోయినా బెంగలేదు
    ఊహలందున విహరించుచుండు నెపుడు
    కవుల భార్యల బాధలు కాంచలేము

    రిప్లయితొలగించండి
  2. తిండి గింజలు లేకున్న మొండి గాను
    పట్టు చీరలు నగలన్న వసలు లేవు
    కవులు కావ్యము వినిపించి కడుపు నింపు
    నిట్టి వాడని దెలియక కట్టు కొంటి

    రిప్లయితొలగించండి
  3. చేత నున్న పట్టీ న పద్య గణ దోషముల
    నెంచి శ్రీమతి కి వివరించిన కవిని గని
    స్వామీ ,అది వంట సరకుల జాబితా
    మార్కెట్టు కి బేగిర వెళ్ళమనె కవి పత్ని !!




    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తొడిగినా, పోయినా’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. అక్కడ తొడిగిన, పోయిన అంటే సరి.
    *
    అక్కయ్యా,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    మీ భావానికి పద్యరూపం....

    భార్య యిచ్చిన సరుకుల పట్టికఁ గని
    పద్య మనుకొని గణయతిప్రాసదోష
    ములను వెదకుచునుండఁగా పోయి తండు
    లములఁ గొనిరమ్మటంచు నా లలన తెలిపె.

    రిప్లయితొలగించండి
  5. మాస్టరుగారూ ! జిలేబిగారి భావం..మీ పద్యరూపం హాస్యస్పోరకముగా నున్నవి...

    రిప్లయితొలగించండి
  6. కొట్టుకెళ్ళుదు తెత్తును కొబ్బరెండు
    మిరపకాయలు మిరియాలు మినపగుండ్లు
    చింత పండుయు శనగలు మెంతులున్ను
    అప్పు పుట్టిన నాశెట్టి యొప్పుకున్న

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    కానీ పాపం కవిగారి భార్య అడిగిన ‘బియ్యం’ సంగతే మరిచినట్టున్నారు!
    ‘చింతపండుయు’ అన్నదాన్ని ‘చింతపండును’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. కడుపు లెండు వారి కష్టమ్ములనుగూర్చి
    కవిత లల్లుచున్న కవివరేణ్య
    కట్టుకున్నదాని కన్నీరు కనలేవు
    కడుపు మంట చేత కందు చుండె.

    రిప్లయితొలగించండి
  9. ఆలు బిడ్డల విషయాలు మరచినట్టి
    మగని జూచి ఇంతి మండి పడెను
    ఉదర పోషణ కొరకు పనిజేయకనున్న
    కవిత లెట్లు నింపు కడుపు మనకు?

    రిప్లయితొలగించండి
  10. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ (ఇదే కదా మీ పూర్తి పేరు!)
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణ, యతి దోషాలు. ఆ పాదానికి నా సవరణ...‘ఉదరపోషణమున కుపయోగపడకున్న’

    రిప్లయితొలగించండి
  11. కవిత లల్లుచు కూర్చున్న కడుపు మండు
    నిండు కున్నవి బియ్యము తెండు పోయి
    కడుపు నింపని కవితలు కట్ట కట్టి
    కాసు లొచ్చెడి మార్గము గనుమ నీవు
    ననుచు తెలిపెను భార్యయే నార్తిగాను

    రిప్లయితొలగించండి
  12. అంబరమున చంద్ర బింబము కనుపించు
    .......నీరసమున వచ్చు నిద్రలోన!
    కరమున నున్నట్టి కడుపు నింపెడి నీటి
    .......పాత్రయే మధువున్న పానపాత్ర!
    కష్టాల సుఖముల కలసి యుండెడి భార్య
    .......కోరిన చారు చకోర నేత్ర!
    వ్రేలాడు తారలు వెలుగు నింగియె గన
    .......పొరలగా చక్కని పూలపాన్పు!

    కాసు కరవైన మనకవి కనుల ముందు
    వచ్చి వ్రాలెను వాసంత వనమయూరి
    తండులమ్ములు లేవని తరుణి చెప్ప
    నేల మీదకు దిగినాడు నెమ్మది కవి.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    కవిని నేలమీదకు తెచ్చిన మీ సీసపద్యం ఆద్యంతం మనోహరంగా ఉంది. చిత్రాన్ని, చిత్రంలోని వ్యాఖ్యలను చక్కగా పద్యంలో ఇమిడ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘నిండుకొనియె/ననుచు...’ అనండి.చివరి పాదంలో గణదోషం. ‘ఆత/డాలకించియు చూసె నిల్లాలివైపు’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  16. సుబ్బారావు గారూ,
    నేను వ్యాఖ్య పెట్టేసరికి మీరు పద్యాన్ని తొలిగించారు. మీ సవరణలతో పద్యాన్ని మళ్ళీ పెట్టండి.

    రిప్లయితొలగించండి
  17. కవిత రూపాన నూహల కలలు గనుచు
    మురియు చుండెను జూడుడు ముసలి వాడు
    బియ్యమింటను రాత్రికి నిండు కొనెను
    ననుచు నిల్లాలు బలుకగ నంత నతడు
    ఆలకించియు చూసెను నామె వైపు

    రిప్లయితొలగించండి
  18. సుబ్బారావు గారూ,
    ఈ పద్యానికైనా పైన నేను సూచించిన సవరణలు వర్తిస్తాయి.

    రిప్లయితొలగించండి
  19. ముందర సతి సుత పోషణ
    మందరి బాధ్యత , కవిత్వ మల్లిన నటుపై
    సందడి జేయుచు మహి నా
    నందము నలరింప మెత్తు రాలూ సుతలున్!

    రిప్లయితొలగించండి
  20. కవులన్నవారు ప్రప్రధమ కర్తవ్యముల మరచి

    బృందావనమందలి కడు
    యందాలను పొగడి పొగడి యానందింపన్
    విందేమి రాదు యింటికీ
    సందేళకు భార్య, బిడ్డ చత్తురు బలియై!

    రిప్లయితొలగించండి
  21. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

    కమ్మని కవితలఁ జెప్పుచు
    సొమ్ములు పొందిన కవులకు సుఖములు కఱవై
    యిమ్ముగ కవితలు వ్రాయక
    ద్రిమ్మరులై తిరుగుచుంద్రు దినవెచ్చముకై.

    రిప్లయితొలగించండి
  22. సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘ఆలూ’ అన్నచోట ‘ఆలున్’ అనండి.
    రెండవ పద్యంలో ‘సందేళ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘కడు యందాలు’ అనడం కూడా సందేహాస్పదమే.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వెచ్చమునకై’ అనవలసింది. అంటే గణదోషం.

    రిప్లయితొలగించండి
  23. అందమైనకవిత ఆహ్లాదమొలికించ
    యింటిలోనిబాధ లెట్లు తీరు
    ఊహనుండివెలికి ఒకసారి దిగివచ్చి
    వాస్తవమ్ముతెలిసి బ్రతుకవలయు!

    రిప్లయితొలగించండి
  24. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సవరణ...
    పెనగాడు చునుంద్రు సతము వెచ్చంబునకై
    (or)
    పెను బాధలు పడుచు నుంద్రు వెచ్చంబునకై.

    రిప్లయితొలగించండి
  25. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఒలికించ/ నింటిలోని...’ అనండి.
    *
    అన్నపరెడ్డి వారూ,
    మీ సవరణలలో రెండవది చాలా బాగుంది. సంతోషం.

    రిప్లయితొలగించండి
  26. గురువుగారికి ధన్యవాదములు. సవరించిన పద్యములు:
    ముందర సతి సుత పోషణ
    మందరి బాధ్యత , కవిత్వ మల్లిన నటుపై
    సందడి జేయుచు మహి నా
    నందము నలరింప మెత్తు రాలున్ సుతలున్!
    కవులన్నవారు ప్రప్రధమ కర్తవ్యముల మరచి

    బృందావనమందలి పూ
    లందాలను పొగడి పొగడి యానందింపన్
    విందేమి రాదు యింటికీ
    సందేళకు భార్య, బిడ్డ చత్తురు బలియై!

    రిప్లయితొలగించండి