4, జూన్ 2014, బుధవారం

సమస్యాపూరణం – 1433 (పందే నా కిష్ట మనుచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పందే నా కిష్ట మనుచు బాపఁడు పలికెన్.
(వావిళ్ల వారి ‘తెలుగు సమస్యలు’ గ్రంథంనుండి)

32 కామెంట్‌లు:


  1. కందా బచ్చలి కూరయు,
    బూందీ లడ్లు, వడియాలు, పూర్ణము బూరెల్
    బిందెడు చారును మరి ప
    ప్పందే నాకిష్టమనుచు బాపడు పలికెన్!

    రిప్లయితొలగించండి
  2. పందిగ రూపమును దొడిగి
    దుందుడుకు హిరణ్యనేత్రు దునుమాడెను గో
    విందుడు మన రక్షకు డా
    పందే నా కిష్టమనుచు బాపడు పలికెన్

    రిప్లయితొలగించండి
  3. కుందనపు బొమ్మ యనగను
    నందమునకు తీసి పోదు చంద్రుని కంటెన్
    డెందము నిండగు చెలివల
    పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్
    __________________________
    పందెము వేసిరి కొందరు
    బందరు లడ్డూలు తినగ బహు వేగమునన్
    విందున వేడుక గనతల
    పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్

    రిప్లయితొలగించండి
  4. పష్యం గారూ,
    విందులో పప్పు ఇష్టమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    వరాహస్వామిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. ‘చంద్రునికంటెన్’ అన్నదాన్ని ‘హరిణాంకునకున్’ అనండి.

    రిప్లయితొలగించండి
  5. విందులు నాకేం వలదులె
    విందురె నే జెప్పుచుంటి వేడిగయన్నం
    బందున నెయ్యావయు ప
    ప్పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్.

    రిప్లయితొలగించండి
  6. పందిగ సింహంబుగ భూ
    మిందిగి రక్కసులధృ౦చి మింటి కెగురగన్
    ముందుగ ధర కేతెంచిన
    పందే నా కిష్ట మనుచు బాపఁడు పలికెన్

    రిప్లయితొలగించండి


  7. మందపు వైశ్వానర శిఖ
    లందే నిత్యాగ్నిహోత్రి లక్ష్యము కాదా
    సందేహ రహితుడల ని-
    ప్పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్.

    రిప్లయితొలగించండి
  8. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

    కందా బచ్చలి కూరను
    విందారగ వండి, యావ, వేడుక నిడియున్,
    అందున, నింగువ నిడ్, పో
    పందే, నా కిష్టమనుచు బాపడు పలికెన్
    ************************
    విందౌ వంకాయను, వే
    యందియు, కారము నిడగను, అల్లపు ఘాటున్,
    చిందెడి వాసనతో, రూ
    పందే నా కిష్టమనుచు బాపడు పలికెన్
    ************************
    అందంపు మావి ముక్కల
    యందా, కారము, లవణము, నావయు నూనెన్
    చిందెడి, యెఱ్ఱని యారూ
    పందే నా కిష్టమనుచు బాపడు పలికెన్

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నాకేం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ఆ పాదాన్ని ‘విందులు నాకెందుకులే’ లేదా ‘విందులు నాకు వలదులే’ అనండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ విరుపు బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    పోపు, రూపులందు ఇష్టాన్ని చూపిన మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. పందిని విష్ణువు జూచుచు
    పందే నాకిష్ట మనుచు బాపడు పలికె
    న్నందము కంటెను నిలనర
    విందపు పాదాలు గొప్ప వేయి వి ధంబుల్

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ నాగరాజు రవీందర్ గారు!
    శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది.
    సంస్కృతములోని అపూపం తెలుగులో అపూపము అగును (అపూప అనుట సరికాదు).
    మీ భావము ప్రకారము అపూపముందే అనవలసి యుండును. అప్పము అని కూడా వ్యవహరింతురు. పరిశీలించండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. అందముగ కోసి పండ్లను
    పొందికగా సర్ది పెట్టి పొంకముతోడన్
    విందున వడ్డించగ"ను
    ప్పందే నాకిష్ట"మంచు బాపడు పలికెన్!

    రిప్లయితొలగించండి
  14. గురువులకు ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి నమస్కారములు.

    బిందమునందున విలయం
    బందున దైత్యుల దునిమిన భూనాధుడు గో
    విందుడు సూకర రూపుడు
    పందే నా కిష్ట మనుచు బాపఁడు పలికెన్

    రిప్లయితొలగించండి
  15. ఎందరినో గుడిఁ జూచితి
    పందేరము పైన దృష్టి! పరమాత్ముని, గో
    విందుని మదినుంచెడు తల
    పందే నాకిష్ట మనుచు బాపఁడు పలికెన్

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. ఏందే!తినుటకు లేదా!
    ముందే చెప్పిన చటుకున మోసుకురానా!
    విందారగించ ఘృతసూ
    పందే నా కిష్టమనుచు బాపఁడు పలికెన్

    రిప్లయితొలగించండి
  18. శ్రీ రెండుచింతల రామకృష్ణ మూర్తి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    ఘృత సూపములను దెమ్ము/లేక ఘృత సూపములందే అనుటకు బదులుగా "ఘృత సూపందే" అనినచో అన్వయము కుదురునా?
    పరిశీలించండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. అందిన కాడికి దోచుకు
    తిందా మనుకొని ప్రజలను తేరగ దోచే
    కొందరు నీచుల కంటెను
    పందే నా కిష్ట మనుచు బాపఁడు పలికెన్

    రిప్లయితొలగించండి
  20. మాస్టరుగారూ ! ధన్యవాదములు...చక్కని సవరణ చేశారు..
    సవరణతో....

    విందులు నాకెందుకులే
    విందురె నే జెప్పుచుంటి వేడిగయన్నం
    బందున నెయ్యావయు ప
    ప్పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్.





    రిప్లయితొలగించండి
  21. మాస్టరుగారూ ! ధన్యవాదములు...చక్కని సవరణ చేశారు..
    సవరణతో....

    విందులు నాకెందుకులే
    విందురె నే జెప్పుచుంటి వేడిగయన్నం
    బందున నెయ్యావయు ప
    ప్పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్.





    రిప్లయితొలగించండి
  22. సుందరి వివాహ మందు ప
    సందగు వంటలను జేయ, చక్కని రుచితో
    విందున వడ్డించిన ప
    ప్పందే నాకిష్టమనుచు బాపడు పలికెన్

    రిప్లయితొలగించండి
  23. శంకరయ్య గారికి నమస్తే
    నేను "ఘృతసూపందే"అనే మాటను "ఘృత సూపములు వున్నదే"అనే అర్ధంతో వాడాను దయచేసి గమనించండి.

    రిప్లయితొలగించండి


  24. చంద్రమౌళి గారు,

    మీ పూరణ వైవిధ్యంతో చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  25. విందుల మాగాయను ని
    స్సందియముగనారగింప సలుపు రసాల
    మ్మందున మాకందపు పులు
    పందే నా కిష్టమనుచు బాపడు పలికెన్

    రిప్లయితొలగించండి
  26. శ్రీమతి సుమలత గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    నిస్సందేహము అనవచ్చును గాని నిస్సందియము అనుట సాధువు కాదు.
    మీ పద్యమును ఇలాగ మార్చుదాము:
    విందులలో మాగాయ ప
    సందనుచును..........
    ...............
    ..............
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  27. విందున చేసెడి భోజన
    మందున పప్పన్నమందు నాజ్యము వలయున్
    మందులు కల్తీలను కల
    పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్.

    రిప్లయితొలగించండి
  28. సుందరి సీమంతమ్మున
    విందుల పాకమ్ములందు వెల్లులి పాయల్
    కందుల పచ్చడిలో కల
    పందే నా కిష్ట మనుచు బాపఁడు పలికెన్

    రిప్లయితొలగించండి


  29. కుందనపు బొమ్మ పారుని
    విందుకు బిలిచి నమనములివి, గురువుల కనన్
    డెందంబరయగ "యిడియా
    ప్పం", దే నా కిష్ట మనుచు బాపఁడు పలికెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి