17, జూన్ 2014, మంగళవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 2

కథాప్రారంభము

రామాయణము-
ఉ.      శ్రీరమణీయమై [సిరులఁ జెంది వెలుంగును, జిష్ణువీటి]నిన్
మీఱి, యయోధ్యనా [గరిమ మించుచు బృథ్వి; నఖండహస్తి]ర
క్షోరిగృహంబె యా[పురియు నచ్చటి మేడలు వ్యోమ మంటు] మేల్
తోరఁపు ఖ్యాతితో [నగరి దూగుఁదులన్ హరినట్టుతోడ] దాన్.

భారతము-
తే.గీ.   సిరులఁ జెంది వెలుంగును, జిష్ణువీటి 
గరిమ మించుచు బృథ్వి; నఖండహస్తి
పురియు నచ్చటి మేడలు వ్యోమ మంటు
నగరి దూగుఁదులన్ హరినట్టుతోడ. (౧౭)


టీక- జిష్ణువీటిన్ = అమరావతిని; హరినట్టు = వైకుంఠము; హస్తిరక్షోరిగృహంబె = గజాసురుని విరోధియగు శివునిల్లు (కైలాసము); గరిమ = గొప్పదనము; వ్యోమము = ఆకాశము.

3 కామెంట్‌లు:

 1. గురువులకు ప్రణామములు
  ఉత్పల మాలలో తేట గీతి బాగుంది
  ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 2. మిత్రులు కంది శంకరయ్యగారికి,
  నేఁటి కాలమున అరుదైన ఈ "నిర్వచన భారత గర్భ రామాయణము"నందించుచున్నందులకు ధన్యవాదములు!

  రిప్లయితొలగించండి