13, జూన్ 2014, శుక్రవారం

పద్యరచన - 589

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

 1. కనువిందగు ముని పత్నులు
  వనమందున దిరుగు చుండ వాహ్యాళి కనన్
  మనుజులు దిరుగుట సోద్దెము
  మునులకు నెలవైన తావు ముల్లేల దిగెన్

  రిప్లయితొలగించండి
 2. అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  భర్త దగ్గరికి బయలుదేరిన శకుంతల కణ్వాశ్రమాన్ని విడిచి పోలేక ముల్లు దిగిందన్న సాకుతో మరలి మరలి చూస్తూ వెళ్తున్న సందర్భం అది.

  రిప్లయితొలగించండి
 3. నమస్కారములు
  శకుంతలేమొ అనుకున్నానుగానీ సందర్భం తెలియదు .మళ్ళీ ప్రయత్నం చేస్తాను

  రిప్లయితొలగించండి
 4. 'మనసు దోచి పోయె మానవ నాథుండు
  తనువు వివశమాయె తాపమాయె
  యెటుల మరలు దాన నింక నే నా మది
  వినదు చెప్పు మాట విభుని గోరు.'

  'రమ్మిక పోదము, నాయన
  మమ్ముల కోపమున దిట్టు మానిని!' చెలియల్
  గమ్మున వేగిర పర్చగ
  నమ్మో యని కణ్వపుత్రి యాగెను వెనుకన్.

  ముల్లు గ్రుచ్చుకొనెను ముందుకు రాలేను
  ముదితలార యనుచు ముగ్ధ జూచె
  ప్రియుడు పోయిన దెస విరహ వేదన తోడ
  పాప మేమి యిడునొ భవిత తనకు.

  రిప్లయితొలగించండి
 5. కణ్వుని వదల లేకన కాంత యాశ
  కుంతల వెనుది రుగుచుండె వంత కతన
  ముల్లు సాకున కాలెత్త డొల్ల యాయె
  నాశ్ర మంబున ముల్లులా ?హాహ యేమి ?

  రిప్లయితొలగించండి
 6. మిస్సన్న గారూ,
  మీ మూడు పద్యాల ఖండిక చాలా బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. తోటయందు చెలులు తోడుండ దమయంతి
  పూలు గోయ వచ్చె పూజ కొరకు
  అక్కడామె చూచె రాజదుష్యంతుని
  ఒకరిపైన నొకరు మోహమొంద.

  రిప్లయితొలగించండి
 8. ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. Sri P.S.R.Moorti Garu! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  3, 4 పాదములలో యతిని పాటించ లేదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ మిస్సన్న గారు! శుభాశీస్సులు.
  మీ ఖండిక ప్రశంసనీయము. అభినందనలు.
  1వ పద్యము 3వ పాదము "నెటుల"తో ప్రారంబించితే బాగుగ నుండును.
  స్వస్తి

  రిప్లయితొలగించండి
 11. పతి దుష్యంతుడు మరచెను
  సతిని శకుంతలను మౌని శాపఫలముగా
  సుత నంత కణ్వముని యా
  పతి కడకే పంపనెంచె బాలుని తోడన్

  జననంబు నుండియు మునిపల్లెలోననే
  ....గడపె దినమ్ములా కణ్వపుత్రి
  తల్లిని దండ్రినా తరుణి యెరుంగదు
  ....ముని కణ్వుడే సర్వమును ముదితకు
  అక్కడి వారలే యన్నలు దమ్ములు
  ....నక్కలు జెల్లెళ్ళు నగుచునుండ
  నచ్చటి తోటలే యచ్చటి కొలనులే
  ....యా పల్లెలే యామె కాటపట్టు
  విడిచి వానినెల్ల వెడలుటే రీతిగా
  ననెడు బాధ మనమునందు కలిగె
  మరల మరల నాశ్రమమ్మును జూచుచు
  నుండి వెడలసాగె నువిద యంత

  అటుల మరొక సారి యామె చూడగనెంచి
  ముల్లు తగిలె పాదమున కటంచు
  ముల్లు తీయు చందమున నాగి వెనుకకు
  తిరిగి చూచుచుండె సరసిజాక్షి

  రిప్లయితొలగించండి
 12. ప్రయాగ రామచంద్ర మూర్తి గారూ,
  మీ పద్యాన్ని సరిగా గమనించలేదు.
  దమయంతీ దుష్యంతులకు ఏమిటి సంబంధం? నేమాని వారన్నట్టు ఆ రెండు పాదాలలో యతి తప్పింది. కనుక మీ పద్యాన్ని సవరించండి.
  *
  పండిత నేమాని వారూ,
  చిత్రానికి తగిన పద్యాలను రసవత్తరంగా రచించి ఆనందింపజేశారు. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. త్రుళ్లి పడి శకుంతల మది
  మల్లెను దుష్యంతు వైపు మరులే కురియన్
  తల్లై పతిఁ జేరు కతన
  ముల్లిరిగిన నెపమునఁ గనె మున్యాశ్రమమున్!

  రిప్లయితొలగించండి
 14. సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘ముల్లు విరుగు నెపమున గనె..’ అనండి.

  రిప్లయితొలగించండి
 15. guruvugaariki dhanyavaadamulu. savarincina padyam:

  త్రుళ్లి పడి శకుంతల మది
  మల్లెను దుష్యంతు వైపు మరులే కురియన్
  తల్లై పతిఁ జేరు కతన
  ముల్లు విరుగు నెపమునఁ గనె మున్యాశ్రమమున్!

  రిప్లయితొలగించండి
 16. చెలికాని నుండి చూపు మ
  రలక, చెలులను నిలుపంగ రమ్యపు మిషనా
  లలన యకట! కాలున ము
  ల్లులుదిగెనని నిలిచి కాంచె లోలాక్షి యనన్

  రిప్లయితొలగించండి
 17. నాగరాజు రవీందర్ గారూ,
  ఆ కాప్షన్‍ను వ్రాసింది చిత్రకారుడు రాజా రవివర్మ కాదు, మరెవరో. అతను చిత్రాన్ని తప్పుగా అర్థం చేసికొని అలా వ్రాశాడు. అటువంటి సందర్భం భారతాంతర్గత శకుంతల కథలో కాని,కాళిదాసు శాకుంతలంలో కాని లేదు. కణ్వాశ్రమాన్ని వీడలేక వీడలేక భర్త దగ్గరికి బయలుదేరిన శకుంతల చిత్తప్రవృత్తిని ఆవిష్కరిస్తున్నది ఆ చిత్రం.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. నేమాని పండితార్యా! తప్పును సవరించినందుకు ధన్యవాదములు. మీ పద్యములు మనోహరముగా నున్నవి.
  గురువుగారూ! ధన్యవాదములు.
  నాకైతే చిత్ర సందర్భం శకుంతల దుష్యంతుని వీడి వెళ్ళలేక వెళ్ళలేక వెడుతున్నట్లుగానే అనిపిస్తున్నది. కణ్వుడు ఆమెను దుష్యంతుని కడకు పంపే సందర్భంలో తన శిష్యుల కిద్దరికి అప్పజెప్పి పంపినట్లుగా చదివినట్లు గుర్తు. చిత్రంలో శిష్యులు కనుపించడం లేదు. చెలికత్తె చేతిలోనేమో పూల సజ్జ ఉన్నది.

  రిప్లయితొలగించండి
 19. మిస్సన్న గారూ,
  మీరు చెప్పిందే నిజ మనిపిస్తున్నది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి

 20. భామామణి శాకుంతల
  కోమలి ప్రియ సఖులతోను గూడియు విరులా
  రామమున గోసుకొని తన
  ధామమునకు బోవుచుండ దలసూచి దిగెన్.

  రిప్లయితొలగించండి
 21. భామామణి శాకుంతల
  కోమలి తా చెలులతోడ గూడియు విరులా
  రామమున గోసుకొని తన
  ధామమునకు బోవుచుండ దలసూచి దిగెన్.

  రిప్లయితొలగించండి
 22. ఆశ్రయ మిచ్చినట్టి తన యప్పను వీడుచు బాధ నొంది ఆ
  యాశ్రమ మెట్లు వీడుటని ఆంగిక మందున ముల్లుదీయుచున్
  విశ్రమ మొంది చూచె నటు వేదనతో కడసారి చూపుగా
  నాశ్రయ మొంద భర్తకడ కర్గ శకుంతల వెళ్ళిపోవుచున్!

  రిప్లయితొలగించండి