5, జూన్ 2014, గురువారం

పద్య రచన - 581

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

 1. కిక్కిరిసిన రైలెక్కగ
  త్రొక్కిసలాట, ఒకవేళ త్రోసుకునెటులో
  ఎక్కిన ఊపిరి సలుపదు
  లక్కుంటే యిల్లుచేరు! లాటరి బ్రదరూ!

  రిప్లయితొలగించండి

 2. రాములవారు పుష్పక విమానమున
  మూక నన్నింటి ని అయోధ్య చేర్చిరట !
  అదియేమి మిన్నయో ?? - మా రైలు బండి
  జనవాళి ని స్వర్గగ్రస్తులని జేయడము కన్న!!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. రైలు బండి సాగుతుంది రంకెలేసి పరుగుతో
  వ్రేలుచున్న వారలంత రేపు గనుట కష్టమే
  కాల డేమొ వేచియుండె కాలపాశ మేయగా
  పాలకులకు విన్నపములు బండ్లుపెంపుచేయుమా!

  రిప్లయితొలగించండి
 4. రైలు పయన మందు రక్షణ కరువాయె
  టిక్కెటు కొనని జను లెక్కు చుండ
  కదలమెదల చోటు కానక ప్రజలెల్ల
  నరక మచట గాంచి నలుగు చుండ్రి

  రిప్లయితొలగించండి
 5. ఏమి చిత్రము ?పొగబండి యెటుల గలదొ !
  యిసుక వేసిన రాలదే యిలను పైన
  నెంత ఘోరమో! పయనమ ,యింతు లార !
  చేయ వలదమ్మ యీ పూట చేయ వలదు

  రిప్లయితొలగించండి
 6. దేశ జనములు పెరిగిన తీరుకనగ
  చూడ పోనేల వేరొండు చోటు భువిని
  రైళ్ల, బస్సుల, సినిమాల హాళ్ళయందు
  చోటు లేదుగ వ్రేలాడి చూడగాను

  రిప్లయితొలగించండి
 7. చుక్కు బుక్కు చుక్కు చక్కనిరైల్బండి
  మిక్కుటముగ నెక్క మేలటండి ?
  కాలుబెట్టు చోటు కానగ లేమండి
  కాలుడెట్టు వచ్చొ కనము సుండి.

  రిప్లయితొలగించండి

 8. మూడవ పాదంలో "కాలు డేమొ" అని చదువలసినదిగా మనవి.

  రిప్లయితొలగించండి