5, జూన్ 2014, గురువారం

సమస్యా పూరణం - 1434 (అర్ధరాత్రి భుజించిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అర్ధరాత్రి భుజించిన నధికఫలము.

14 కామెంట్‌లు:



  1. అర్ధ రాత్రి భుజించిన అధిక ఫలము !
    మోహ రాత్రి భజించిన అధిక ఫలము !
    యక్ష రాత్రి శృజించిన అధిక ఫలము !
    నిశా రాత్రి భు భ శృ అధిక ఫలము !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. అర్ధరాత్రి భుజించిన నధికఫలము.
    రెండు పూటల తిండి తో నుండ గలము
    తిండి గింజలు మిగులును దండి గాను
    మేలు కొని యుండ చోరులు వాలలేరు

    రిప్లయితొలగించండి

  3. అర్ధ రాత్రి భుజించిన అధిక ఫలము
    గలదె? యర్ధమౌనాయువు గడియ గడియ
    ఆకలికి భేషజంబైన యన్నపాన
    విధుల విజ్ఞానుష్టానము విదులకొప్పు

    రిప్లయితొలగించండి
  4. జీర్ణ శక్తిని హరియించు నశనమెప్పు
    డర్థ రాత్రి భుజించిన, నదిక ఫలము
    దేశకాలములను బట్టి తినిన యడల
    నర్థరాత్రులు తిండికై యరుగు టుడుగు

    రిప్లయితొలగించండి
  5. ఉదయ మల్ప భోజ్యము మంచి నొనర జేయు
    పగలు బాగుగా భుజింప బలము కలుగు
    పూర్తిగా తినక పగటి భోజ్య మందు
    నర్ధ, రాత్రి భుజించిన నధిక ఫలము.

    రిప్లయితొలగించండి
  6. అన్నమరుగక రోగము లధిక మగును
    అర్ధ రాత్రి భు జించిన ,నదిక ఫలము
    నొంద గలడు ది నముదిన మోర్పు తోడ
    చేయ వలసిన గార్యమ్ము జేయు నెడల

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    వ్యస్తుడ నై,నెట్ సమస్య వల్ల బ్లాగునకు దూరమై యుంటిని.మన్నించ మని ప్రార్థిస్తూ ..
    ============*==========
    అర్ధరాత్రి భుజించిన నధికఫలము
    గలదని జనులెల్లరు చంద్ర కాంతి యందు
    దినుట నేర్చి, రోగ తతులై దిరుగు చుండి
    రి గద,కలియుగ మందున రిపువుల వలె!

    రిప్లయితొలగించండి
  8. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

    పరగ శివరాత్రి వేళను పరమ భక్తి
    జాగరంబును సలిపియు, శంభుకిడియు
    మీద భుజియింప భక్తులు మేలుననరె
    అర్ధరాత్రి భుజించిన నధిక ఫలము

    రాత్రి వేళను విసమగు లాలితముగ
    అర్ధరాత్రి భుజించిన- అధిక ఫలము
    మొదటి జామును మించకే ముదము తినిన
    యండ్రు వైద్యులు- కనగానునదియె నీతి

    రాక్షసాళికి రాత్రులు రమ్యమగును
    మానవాళిని, జంతుల మాన్యగతిని
    అసురసంచారమావేళ నగుట, వారు
    అర్ధరాత్రి భుజించిన నధిక ఫలము

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులకు నమస్కృతులు.
    మా మనుమరాలి పెళ్ళికి వచ్చి ఉన్నందున మిత్రుల పూరణల, పద్యాల సమీక్ష చేయలేకపోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  10. అర్ధరాత్రులు భుజియింప నరుగదెపుడు
    పగటి పూటల తినుటయే పరమశుభము
    వంట మొత్తము నందెపో పగలు "నర్ధ",
    "అర్ధ" రాత్రి, భుజించిన నధిక ఫలము

    రిప్లయితొలగించండి
  11. మనకు మధ్యాహ్న వేళల కనగరాత్రి
    ఇతర దేశ్యులకదెయౌను నెంచిచూడ
    పగటి భోజ్యమెయౌగద పరగ నిశది
    అర్ధ రాత్రి భుజించిన నధిక ఫలము.

    రిప్లయితొలగించండి
  12. పగలు చూడగ రావుగా బయటకెపుడు
    భూత రాక్షస ప్రేతాలు భువిని, రేయి
    కటిక చీకటి దిరుగును కలసి మెలసి
    అర్ధరాత్రి భుజించిన నధికఫలము.

    రిప్లయితొలగించండి
  13. అరుగదారోగ్యమునకును హాని చేయు
    అర్ధరాత్రి భుజించిన, నధికఫలము
    పొంద సరియైన సమయాన భోజనంబు
    చేయ వలెనని ఆర్యులు చెప్పినారు

    రిప్లయితొలగించండి