20, జూన్ 2014, శుక్రవారం

పద్యరచన - 596

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. వామన గుంతలనాడుచు
    భామలు గమనించలేదు వాకిలి ముందు
    న్నా ముసలి బిచ్చగత్తెను,
    తామాయాటందునెంత తలమున్కైరో!

    రిప్లయితొలగించండి
  2. బారి జాక్షు లిచట వామన గుంటలు
    కోరి యాడు చుండె కూడి ముదము
    నేడు కరువు గాన నేర్వగా మదినెంచి
    గెలుపు వోట మందు మలుపు లెరిగి

    రిప్లయితొలగించండి

  3. 'భారతి' కాలమున చించోళీలు
    'పత్రిక' కాలమున నవలాకేళీలు
    'స్వాతి' కాలమున సినీరంగేళీలు
    'నవ్య' కాలమున కార్పోరేట్వాళీలు !!


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. చందమామ బొమ్మలందు నాటి జనుల
    జీవనంపు శైలి చిత్తమలర
    గనగ నెమ్మదించు మనము సుంత; జయము
    చిత్రకార ప్రతిభ చేవకెపుడు.

    రిప్లయితొలగించండి
  5. ఏమని చెప్పుదు నిప్పుడు
    ' మీ, మా ' సీర్యళ్ళ టీవి మెఛ్ఛెడు వేళన్
    ప్రేమగ నొకచో జేరుచు
    వామనగుంతల నెయాడు వనితలు గలరే ?

    రిప్లయితొలగించండి
  6. వామనగుంతలయందున
    భామలకున్ విజయమబ్బు ప్రతిభకు రూపై
    యీమహిని గాంచ జయములు
    ధీమతికిన్ గాకనితర తెగలకు జనునే ?

    రిప్లయితొలగించండి
  7. ఉ. వామనగుంట లాడుదురు భామలు ముచ్చట మీర నింటిలో
    మామలు నత్తలున్ మగలు బందుగు లందరు బిడ్దలర్థులున్
    తాము భుజించి లేవగ ముదంబున నెంగిలి వడ్డ పిమ్మటన్
    గాములఱేడు శాంతమతిగా నగు దాకను ప్రొద్దుపుచ్చగన్

    రిప్లయితొలగించండి
  8. చంద్రమౌళి సూర్యనారాయణ గారు,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వారిజాక్షి’ టైపాటువల్ల ‘బారిజాక్షి’ అయింది. లేక ‘వబయో రభేదః’ అంటారా? ‘కోరి యాడుచుండ్రి...’ అనండి.
    *
    జిలేబీ గారూ,
    మీ వచన కవితకు నేను _/\_ చేయడం తప్ప ఏమీ వ్యాఖ్యానించలేను. ☺
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శ్యామలీయం గారూ,
    ఎన్నాళ్ళకెన్నాకు ఈ బ్లాగుమీద దయ చూపించారు! చాలా సంతోషం!
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. నేమాని వారికి స్వాగతము

    భువిని నేమాని వంశపు భూష ణుం డ !
    మాతృభూమికి విచ్చేయు మాన నీ య !
    రండు కుశలంబు దోడన రామ జోగి !
    స్వాగ తంబులు మీకివె శతము శతము

    సులభ తరముగ పయనమ్ము గలుగు నట్లు
    చేయ, గోరుదు నిరతము శివుని మదిని
    గీ ము చేరిన వెంటనే ప్రేమ మీ ర
    తెలియ జేయుడు శుభ వార్త దేవ !మీరు .

    రిప్లయితొలగించండి
  10. భామల జుడుడు ,చక్కని
    మోములతో గూడి మనకు ముదమును గూర్చన్
    వామన గుంటల నాడుచు
    బాములనే మఱచు నట్లు వర్తిలి రచట న్

    రిప్లయితొలగించండి
  11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యం....

    ఒఱపుతోడ నిష్ఠ నోమనగుంటల
    యాట ముద్దుగుమ్మ లాడుచుండ్రి
    బిచ్చగత్తె కేక వినకుండ కనకుండ
    వేచియుండె నామె వీడకాశ.

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారి పద్యం....

    వామన గుంత లాడు కొను భామల బొమ్మన చూచినాడ నా
    భామల మోమునన్ పనుల భారము తగ్గిన హాయి, నిప్పుడే
    భామయు నాడదీ మసక బారిన యాటల, నాను లైనులో
    ప్రేమగ చేయు చాటులును రేసుల నాడును కళ్ళచేటుగాన్

    రిప్లయితొలగించండి
  13. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    జూడుడు... టైపాటు వల్ల జుడుడు అయింది.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. వామన గుంతల నాడెడు
    భామల మధ్యన ప్రపంచ వార్తలు జేరన్
    'రాముడె'వచ్చిన దెలియదు !
    యా ముదుసలి బిక్షగత్తె యరుపు వినెదరే !

    రిప్లయితొలగించండి
  15. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వచ్చినను దెలియ/ దా ముదుసలి...’ అనండి.

    రిప్లయితొలగించండి
  16. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    వామన గుంతల నాడెడు
    భామల మధ్యన ప్రపంచ వార్తలు జేరన్
    'రాముడె'వచ్చినను దెలియ
    దా ముదుసలి బిక్షగత్తె యరుపు వినెదరే !

    రిప్లయితొలగించండి
  17. ద్వారము చెంత నీవల ముదమ్మున వామన గుంతలాడుచున్
    పారము లేని సంతసపు వార్నిధిలో గమనించ కుండిరే
    యోరగ నున్న వాకిలిని యోర్తుక భిక్షుక దీనమూర్తియై
    చీరిన వైనమున్, తుదకు చేసెడి దేమియు లేక పోయెడిన్.

    రిప్లయితొలగించండి
  18. మిస్సన్న గారూ,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి