రామాయణము-
సీ. వి(బుధసందోహము వేడ్క జెందెను,
గనెన్
మోదంబు గోబృందమున్)
నయముగ
వ(సుధ నాశించెడువారు సంతసమునన్
శోభిల్లుచుండంగ, శో)కరహిత
శు(భధరాచక్రము చొక్క, మెల్లన జగ
త్ప్రాణుండునున్ వీచెఁ
దా) ఖలచయ
ము (నధమశ్రేణియుఁ బొందు చుమ్మలికమున్
ఖ్యాతిన్ విడెం బెల్లుగన్)
సుపర్వ
తే. దుందుభులు మ్రోసె దశదిశ లొందె దెలివి,
నలరులజడి గురిసె, నాడి రప్సరసలు,
పాడె గంధర్వతతి, కూర్మితోడ మింట
గరుడపన్నగకిన్నరుల్ గంతు లిడిరి. (౨౨)
భారతము-
మ. బుధసందోహము వేడ్క జెందెను, గనె
న్మోదంబు గోబృందమున్
సుధ నాశించెడువారు సంతసమునన్ శోభిల్లుచుండంగ,
శో
భధరాచక్రము చొక్క, మెల్లన జగత్ప్రాణుండునున్
వీచెఁ దా
నధమశ్రేణియుఁ బొందు చుమ్మలికమున్ ఖ్యాతిన్ విడెం
బెల్లుగన్. (౨౨)
టీక- సుధనాశించెడువారు = దేవతలు; జగత్ప్రాణుండు = వాయుదేవుఁడు; ఉమ్మలికము
= దుఃఖము; సుపర్వ = దేవతలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి