11, జూన్ 2014, బుధవారం

పద్యరచన - 587

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

29 కామెంట్‌లు:

  1. తొల్లి వాహన ములులేక తల్ల డిల్లి
    బడుగు వర్గాల జీవులు మెడను వంచి
    కాడి తగిలించి కష్టించు గంజి కొఱకు
    బ్రతుకు బండిని లాగించె భార ముగను

    రిప్లయితొలగించండి
  2. అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. ఉత్సాహ:
    లాగలేక లాగలేక లాగుచుండె నెట్టులో
    లాగకున్న బండి నతడు రాదు సొమ్ము కూటికై
    వేగ లాగు మనుచు బలికె విసువు తోడ నారియున్
    బాగు బాగు బడుగు వాని బాధ లామె గాంచునే?

    రిప్లయితొలగించండి
  4. డొక్కలు నిండుట కష్టము
    రెక్కాడిచి బక్క చిక్కి రిక్షా లాగన్
    చుక్కైన వంట నిలువక
    నుక్కగ కారెడు జలమె నూతము కనుమా!

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    నాల్గవ పాదంలో గణదోషం.‘జలమ్మె’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  6. బ్రదుకు దెరువు కొరకు బండిలా గుబడుగు
    వాని జూడ జాలి ,బాధ కలుగు
    చుండె నేమి తోచ కుండె ను నతడుగా
    నెపుడు బయట పడునొ ? నెట్లు బ్రదుకు ?

    రిప్లయితొలగించండి
  7. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    పద్యరచన:కండ కరగించి రిక్షాను యెoడ లోన
    లాగె నొకనాడు భర్త,చక్రములగుచు
    భర్త భార్యయు కలిసి జీవనము సేయ
    నౌకరీ నేడు చేయుచు న్నారు జూడ

    రిప్లయితొలగించండి
  8. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. బండి లాగు చుండె బ్రతుకు దెరువుగాను
    చెమట తనువు నుండి చిందు చుండ
    చెన్న పట్న మందు కన్న గతంబిది
    రోత పద్ధ తిపుడు రూపు మాసె

    రిప్లయితొలగించండి
  10. చెమటలు కారుచుండ తన చేతుల లాగుడు బండి లాగుచున్
    కమిలెను మోము, ఎండలకు కందె శరీరము, వాని గాంచినన్
    చెమరును నేత్రముల్, తనకు చెప్పులు కాలికి లేకపోయినన్
    కుమలక, చేర్చు, యాత్రికులు కూర్చొన వారిని, వారి గమ్యమున్

    రిప్లయితొలగించండి
  11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    వాస్తవాన్ని చక్కగా పద్యంలో ప్రతిబింబింప జేశారు.
    నా చిన్నప్పుడు‘పుట్టిల్లు’ చిత్రంలో ఇటువంటి బండిని చూసినట్టు గుర్తు.
    ఇటువంటి బళ్ళు ఇప్పటికీ కలకత్తాలో తిరుగుతున్నాయని విన్నాను.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. పగలు-రాత్రి లేక పనిజేసి చెమటోడ్చి
    కూటి కొరకు నతడు కూలి జేసె
    బ్రతుకు బండి నడుప కాయకష్టముజేయు
    బండివాని బ్రతుకు బరువు మెండు

    పబ్బులోన గడుపు డబ్బులున్న నవాబు
    పేదవాడు యుండు వీధిలోన
    పేద-గొప్ప యన్న బేధాలు మాయునా
    వీరి మద్య దవ్వు వీడి పోగ

    రిప్లయితొలగించండి
  13. ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘పేదవాడు + ఉండు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘పేదకూలి యుండు’ అందామా?

    రిప్లయితొలగించండి
  14. శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    ఆఖరి పాదములో నూతము అని వాడేరు. ఊతము అనుట సాధువు కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    కొన్ని సూచనలు:
    రిక్షాను + ఎండలోన = అనుచోట యడాగమము రాదు.
    రిక్షా నెండలోన అనుచు సంధి నిత్యము అగును.
    3వ పాదము చివరలో "ను" అను అక్షరమును చేర్చండి.
    ఆఖరి పాదములో చున్నారు చూడ అనుటయే సరియైనది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. Sree P.S.R.Moorti Garu
    శుభాశీస్సులు. మీ 2 పద్యములు బాగుగ నున్నవ్. అభినందనలు.
    1వ పద్యము 3వ పాదములో యతి మైత్రి లేదు కదా! స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    ఆ మూడవ పాదాన్ని ‘బ్రతుకు బండిని నడుపగ కష్టపడుచుండు’ అనండి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మీరు శ్రీ మూర్తి గారికి చేసిన సూచనలో కూడా తప్పు దొరలినది. చూడండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. పండిత నేమాని వారూ,
    ఎంత ఆలోచించినా నా సూచనలో తప్పేమిటో తెలియడం లేదు.. దయచెసి వివరించండి.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    శ్రె మూర్తి గారి పద్య పాదమును ఇలాగ సవరించండి:
    "బ్రతుకు బండి నడుప పడుచుండు కష్టము"
    స్వస్తి.`

    రిప్లయితొలగించండి
  21. మిత్రులారా! శుభాశీస్సులు.
    శ్రీ కంది శంకరయ్య గారు, శ్రీ మిస్సన్న గారు, మీ అందరు నా స్వాస్థ్యము గురించి అడుగుచున్నారు. ఆ విధముగా నేను కొంత ఊరట చెందుచున్నాను. నాకు కండరములలో తేడ వచ్చినదేమొ అన్నారు ఒకరు. నిత్యము నా యాతనకు హద్దు లేదు. నొప్పులు/మంటలు నా ప్రారబ్ధముగా భరించలేక అనుభవించలేక చాల ఆర్తి నొందుచున్నాను. ఎప్పుడు ఈ బాధల నుండి విముక్తి లభించునో తెలియదు. మీ సాంత్వనమునకు కృతజ్ఞుడను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. నేమాని వారూ,
    మీరు స్వదేశానికి తిరిగి రండి. ఇక్కడి నేల, నీరు, గాలి మీకు ఏ వైద్యమూ అవసరం లేకుండానే స్వాస్థ్యాన్ని చేకూరుస్తాయి. స్వస్తి!

    రిప్లయితొలగించండి
  23. Guruvu gaaraliddaraku dhanyavaadamulu.
    Savarincina padyam:

    డొక్కలు నిండుట కష్టము
    రెక్కాడిచి బక్క చిక్కి రిక్షా లాగన్
    చుక్కైన వంట నిలువక
    నుక్కగ కారెడు జలమ్మె ఊతము కనుమా!

    రిప్లయితొలగించండి
  24. లాగును కట్టితివిటనీ
    లాగున నీబ్రతుకునీడ్వ లాఘవముననే
    లాగుచు నుంటివి బండిని
    లాగించక తప్పదుగద లాల్సలమిదిగో !

    రిప్లయితొలగించండి
  25. కూటికి లేనివాడు తగు గూడును లేని యభాగ్య జీవుడున్
    నేటికి జంతు జాతివలె నెచ్చెలు లెక్కిన జట్క లాగుచున్
    జీకటి జీవ యానమును జేయుచు నుండెను దిక్కులేక నీ
    పోకడ మారు రోజులిక భూతలమందున సంభవించునా ?



    రిప్లయితొలగించండి
  26. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    సలామ్... సలమ్ అయింది!
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. గుడిసెలలో వసించుచును కూటికి లేక నుపాధి లేక య
    ట్టడుగున చాల పేదరిక మందున మ్రగ్గచు బాధ లొందుచున్
    బడలిక లేక జీవితము బండిని లాగుచు వెళ్ళ బుత్తు రా
    బడుగుల బాగుజేయ గల బాధ్యత నెవ్వరు తీసుకుందురో!

    రిప్లయితొలగించండి
  28. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి