17, జూన్ 2014, మంగళవారం

సమస్యా పూరణం - 1447 (రాముఁడు రావణుని మెచ్చి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
రాముఁడు రావణుని మెచ్చి రాజ్య మ్మొసఁగెన్.
ఈ సమస్యను సూచించిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. రామాయణ సారమ్మిదె
    కాముండు వచించె వినుడు కమనీయముగా
    నా మండోదరి మొరవిని
    రాముడు రావణుని మెచ్చి రాజ్యమ్మొసగెన్

    రిప్లయితొలగించండి
  2. ఏమని జెప్పుదు వింతగ
    రాముడు రావణుని మెచ్చి రాజ్యమ్మొసగెన్
    కాముండగు లంకా ధీశుని
    నీమంబుల ఝడిసె గాన నేరుపు తోడన్

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    కాముడు చెప్పిన రాముని కథగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    వింత కథనంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘లంకేశుని’ అంటే సరి. ‘ఝడిసె’ను ‘జడిసె’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమోవాకములు.

    నీమమునఁ దపముఁ జేయఁగ
    సోమాభరణుం డజుండు శుద్ధమనోజ్ఞుం
    డౌ మైనాకీ హృదయా
    రాముఁడు రావణుని మెచ్చి రాజ్యమ్మొసఁగెన్!

    రిప్లయితొలగించండి
  5. కామాంధు౦డని గూల్చెను
    రాముఁడు రావణుని; మెచ్చి రాజ్య మ్మొసఁగెన్
    నీమము గలుగు విభీషణు
    డేమాత్రము కామి గాక నేలునటంచున్

    రిప్లయితొలగించండి
  6. రామారావునడుగ సు-
    త్రాముడు సురతోషమునకు రామాయణమున్
    కామిత సినిమా కథలో
    రాముడు రావణుని మెచ్చి రాజ్యమ్మొసగెన్

    రిప్లయితొలగించండి
  7. గుండు మధుసూధన్ గారి పూరణ బాగున్నది.

    హైమవతీ శ్రీ హృదయారాముడు అని పూరణచేద్దామనుకొన్నాను. గుండు మధుసూధన్ గారి మంచి పూరణతో, లఘుహాస్యమార్గమే నాకు మిగిలింది.

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం. ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ సినిమా కథ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    ఆ మొన మోక్షమొసంగెను
    రాముడు రావణుని మెచ్చి,రాజ్య మ్మొసగెన్
    ప్రేమను విభీషణునికే
    సామమ్మనె జన్మభూమి స్వర్గము కంటెన్

    రిప్లయితొలగించండి
  10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. కాముకుడని గూల్చె ప్రభువు
    రాముఁడు రావణుని, మెచ్చి రాజ్యమ్మొసఁగెన్
    తాముదమున హృదయమునన్!
    బ్రేమగ తొల్లి తన సేవ వేడుక జేయన్!

    రిప్లయితొలగించండి
  12. భూమిజను హరించ జిదిమె
    రాముడు రావణుని, మెచ్చి రాజ్యమ్మొసగెన్
    ధీమంతు విభీషణునకు,
    రాముని సద్గుణ ములున్న రాజెవడి లలో!

    రిప్లయితొలగించండి
  13. శ్రీ నాగరాజు రవీందర్ గారు! శ్వుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    4వ పాదము మీరు ప్రాస నియమమును పాటించలేదు. 4వ పాదము మొదటి అక్షరముకూడా దీర్ఘ అక్షరము ఉండే రీతిగా మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ సవరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. చంద్రమౌళి రామారావు గారి పూరణ :
    యామినిని కల్లు త్రాగిన
    పామరుడు పురాణమిట్లు భామకు చెప్పెన్
    రామా! మధు వానిన శ్రీ
    రాముఁడు రావణుని మెచ్చి రాజ్య మ్మొసఁగెన్

    రిప్లయితొలగించండి
  16. చందమౌళి రామారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ...

    కోమలిని హరించఁ దునిమె
    రాముఁడు రావణుని; మెచ్చి రాజ్య మ్మొసఁగెన్
    కోమల మనస్కుఁడు తనను
    స్వామిగఁ దలఁచిన దనుజుల పతి యనుజునకున్.

    రిప్లయితొలగించండి
  18. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. మల్లెల సోమనాధ శాస్త్ర్రి గారి పూరణలు

    కాముకుడౌటను జంపెను
    రాముడురావణుని,మెచ్చిరాజ్యమ్మొసగెన్
    ప్రేముడి యాతని యనుజుకు
    తామది ధర్మము దలచియు దాశరధపుడే

    క్రమాలంకారము

    భీముడు నౌచును లంకను
    కోమలికొరకై వధించె కోమలు డెవరిన్?
    ప్రేమ విభీషణు కేమిడె?
    రాముడు రావణుని; మెచ్చిరాజ్యమ్మొసగెన్

    రిప్లయితొలగించండి
  20. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘అనుజుకు’ అన్నారు. అక్కడ అనుజునకు అనాలి. ‘ప్రేముడి యతని యనుజునకు’ అంటే సరి. ‘దాశరథి + అపుడే’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘దాశరథి తగన్’ అందాం.
    అలాగే రెండవ పూరణలో ‘విభీషణుకు’ అని కాక ‘విభీషణునకు’ అనాలి. ‘ఏమిడెను విభీషణునకు’ అందామా?

    రిప్లయితొలగించండి
  21. భూమిజ గొనెనని జంపెను
    రాముడు రావణుని; మెచ్చి రాజ్యమ్మొసగెన్
    ప్రేమగ విభీషణునకును
    రాముని పక్షము వహింప రాజిలమనుచున్!

    రిప్లయితొలగించండి
  22. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. వామపు ముగింపు నిమ్మన
    రామాయణమునకు, మార్చి వ్రాసెనొకండున్:
    "తా మారెను లంకేశుడు,
    రాముడు రావణుని మెచ్చి రాజ్యమ్మొసగెన్"


    "Literature Studies" తరగతులలో, ప్రసిద్ధమైన పుస్తకాలకు వేరొక ముగింపునిస్తే ఎలాగ ఉంటుందని ప్రశ్నించడము అపుడప్పుడు జరుగుతుంది. ఆ త్రోవలో ఈ పూరణ. ఇక్కడ 'వామపు' అంటే 'వక్రపు' లేదా 'ప్రతికూలమైన' అన్న అర్ధంతో వాడాను. సరియో కాదో తెలియదు.

    రిప్లయితొలగించండి
  24. పుష్యం గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. ఏ మాయామోహములను
    నేమారక త్వరితగతిని యింటికి చేరం
    గా నెంచు సేవకుండని
    రాముఁడు రావణుని మెచ్చి రాజ్య మ్మొసఁగెన్.
    పిదప లోకనీతి కొఱకు భృత్యు జంపి
    తనదు ముక్తి కాంక్షనుఁ దీర్చి ,తల్లడిల్లు
    వాని చెంతజేర్చెననియు పరమ పావ
    నుండు హరియను మాటను నొక్కి చెప్పె.

    రిప్లయితొలగించండి
  26. దోమల గూడెము నందున
    వామకవుల రామలీల వర్ధిల్లంగన్
    ధీమంతులు పలికిరచట:
    "రాముఁడు రావణుని మెచ్చి రాజ్య మ్మొసఁగెన్"

    రిప్లయితొలగించండి


  27. ఆ మేడంబందడచెను
    రాముఁడు రావణుని; మెచ్చి రాజ్యమ్మొసఁగె
    న్తా ముందే యభయంబని
    శేముషి యైశరణుజొచ్చి చేర దహరుకున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. నీమమునన్ పోరాడుచు
    ధీమాతో ప్రాణమిడిన తీరును గాంచన్,...
    గోముగ విభీషణునకిక
    రాముఁడు, రావణుని మెచ్చి, రాజ్య మ్మొసఁగెన్

    రిప్లయితొలగించండి