19, జూన్ 2014, గురువారం

పద్యరచన - 595

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. ఘోర రణాంగణమ్మునను గూల్చిదశానన దానవేశ్వరున్
    శ్రీ రఘు రామమూర్తి సతి సీతను దోడ్కొని లంకనుండి తా
    జేరుచు నుండె లక్ష్మణుని చెంత సహోదరులుండ నింక నా
    మారుతితో నయోద్యకును మంజుల పుష్పక మెక్కిప్రీతితో.

    రిప్లయితొలగించండి
  2. బాగుందండీ మీ పద్యము.
    సీతను, మన ధరణీ సం
    జాతను, రఘుకుల వధూటి శాంతపు మూర్తిన్,
    కాంతను,భారతవాసుల
    మాతను కొనివచ్చె గనుడు మన రామయ్యన్.

    రిప్లయితొలగించండి
  3. తగు సేవక బృంద మలర
    సగదీరిచి ' సర్వములను ' సాధ్వీ మణితో
    జగమేల రామచంద్రుడు
    ఖగ పుష్పక మెక్కి తరలె కార్యోన్ముఖుడై!

    రిప్లయితొలగించండి
  4. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    (క్షమించాలి.. మీ పాత పూరణలను, పద్యాలను ఇంకా పరిశీలించలేదు)

    రిప్లయితొలగించండి
  5. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సగదీరిచి’...? ‘సగబెట్టు’టకు రూపాంతరమా?

    రిప్లయితొలగించండి
  6. మాతృదేశానికి మరలి వస్తున్న శ్రీమాన్ పండిత రామజోగి సన్యాసి రావు గారికి స్వాగతం!

    (రామ)జోగి సన్యాసి రా వా మనీషి
    సుగుణ(చంద్రుండు)సుకవితాశోభితుండు
    (పుష్పక)విమాన మెక్కి తాఁ బుట్టినట్టి
    దేశమును చేర వెడలెను తేజ మలర.

    రిప్లయితొలగించండి
  7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యం....

    రావణుఁడు మరణించగా రణమునందు
    రావణుని సోదరుని లంక రాజు జేసి
    పోవ నెంచ రాముఁడు తన పురమునకును
    పుష్పకంబును సమకూర్చె ముదముతోడ
    లంక విభుఁడు; హనుమ, సీత, లక్షణుండు
    నితర కపివరుల్ తోడుగా నేగె పురికి.

    రిప్లయితొలగించండి
  8. సీతారాముల జూడుము
    చేతో మోదంబు తోడ జేరగ పురమున్
    వాతాయానము జేసిరి
    భ్రాతలు హనుమంతు రాగ బ్రమదము లొలుకన్

    రిప్లయితొలగించండి
  9. Raaraa raghuramaa nee
    Yee raakakunai yayodhya yentho vechen
    Tarapadhamuna navanija
    Tho raa neevanti raju dorakadu kadaraa

    రిప్లయితొలగించండి
  10. సుబ్బరావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    హనుమంతు అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు. అక్కడ ‘భ్రాతయు వానరులు రాగ...’ అందామా?
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రారా రఘురామా నీ
    యీ రాకకునై యయోధ్య యెంతో వేచెన్
    తారాపథమున నవనిజ
    తో రా నీవంటి రాజు దొరకఁడు కదరా.

    రిప్లయితొలగించండి
  11. చూడుము శ్రీరఘు రాముడు
    నీడగ లక్ష్మణుడుహనుమ నిజభక్తులతో
    వేడుకగా పుష్పకమున
    పోడిమితో వెడలుచుండె భూమిజ తోడన్

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు ధన్యవాదాలు.
    సగదీరిచు, సగబెట్టు, చక్కబెట్టు రూపాంతరాలను కుంటానండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. రావణు ద్రుంచి లోకములు ప్రస్తుతి సేయగ రాముడల్లదే
    భూవరపుత్రి, సోదరుడు, పొంగుచు మారుతి, దానవేశసు-
    గ్రీవులు, జాంబవంతుడును, కేరెడి వానర మూక వెంటరా
    పావనమైన పుష్పకము పైన నయోధ్య దెసన్ గమించెడిన్.


    రిప్లయితొలగించండి
  14. జానకి రాముడు తరలెను
    మానస ముప్పొంగె ననగ మానిని సతితో
    దానవు జంపిన ముదమున
    భానుని తేజమ్ము విరియ భాగ్యం బనుచున్

    రిప్లయితొలగించండి
  15. సహదేవుడు గారూ,
    అలా అనుకోవడంలో దోషమేమీ లేదు.స్వస్తి!
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి