రామాయణము-
చం. ముదమున నేలు నా [నగరి భూపతి
చీకుజనాలకాఁపు] హె
చ్చు; దశరథుండనన్ [వెలయుచున్ ధృతరాష్ట్రుఁడు
బిట్టు భీష్మ]మౌ
కదనమునందు సచ్[శరనికాయసహాయతఁ జక్కడంచె]ను
గ్రదనుజకోటులన్ [రిపుల రాజకులేంద్రు లరే యనంగ]నున్.
(౧౯)
భారతము-
తే. నగరి భూపతి చీకుజనాలకాఁపు
వెలయుచున్ ధృతరాష్ట్రుఁడు బిట్టు భీష్మ
శరనికాయసహాయతఁ జక్కడంచె
రిపుల రాజకులేంద్రు లరే యనంగ. (౧౯)
టీక- చీకుజనాలకాఁపు = (రా) గ్రుడ్డిజనుల రక్షించువాఁడు, (భా) గ్రుడ్డివాఁడు,
జనుల రక్షించువాఁడు; భీష్మ = (రా) భయంకరమైన, (భా) భీష్మునియొక్క; ధృతరాష్ట్రుఁడు =
(రా) రాష్ట్రమును ధరించినవాఁడు; రాజకుల = (రా) రాజుల సమూహములో, (భా) చంద్రవంశములో;
నికాయము = గుంపు.
మాన్యులు శ్రీ శంకరయ్యగారికి
రిప్లయితొలగించండినమస్కృతులతో,
గర్భచిత్రకృతద్వ్యర్థికావ్యాన్ని ఇంత ప్రశాంతగంభీరమైన శైలిలో నిరాఘాటంగా రచింపగలగటం అపురూపమైన ఘటనావిశేషం. శ్రీ రావిపాటి లక్ష్మీనారాయణగారిని మళ్ళీ ఒక తరానికి పరిచయం చేసి మీరు సాహిత్యికులను ఋణగ్రస్తులను చేశారు.
ధన్యవాదాలతో,
ఏల్చూరి మురళీధరరావు