ఘోరవనము వీడి క్రూర మృగమ్ములుపల్లెలందు జొచ్చి పసుల జనులపైన దాడిజేయ పల్లెలో ప్రజలచేజిక్కి చచ్చు టౌర! నిక్కమె కద!
అమ్మకు వాహన మైతిని గుమ్ముగ వనమందు దిరిగి కొలువక దేవిన్ గ్రమ్మున నేరక వచ్చితినిమ్మానవ మృగముల జేత నిక్కము గిట్టన్
జూన్ 5, పర్యావరణ దినోత్సవ సందర్భముగా...కారడవులను వీడి యేకాకి గానుమానవారణ్య మందున మనుటకొఱకుచేరు మృగముల గానలో చేరవేయఉద్యమించుము భారత యువకులార!
వనము నుండి పల్లె వాసుల యొద్దకుదారి తప్పి చిరుత తడబ డంగపల్లె జనులు జూచి వధియించ సమకట్టిదండ వరుస జేత దాడిజే సె
కీకారణ్యము వీడుట నీకేలా చిరుత! బ్రతుక నేరవు మేమా రాకసి మూకల సంతతి నీకాయువు మూడు పొమ్ము నేటికి వనికిన్.
చిఱుత జనవాడ కేతెంచె చింత తోడవేట గాని భాణ హతితో వేటు పడగకాచు వారిని గాంచక క్రాలు చుండవెఅపు తోడను జనులెల్ల వెంట బడిరి
బలిమిని కలిగిన పులిననితెలివినిగల నరులకడకు తెగువతొ చనినన్ తెలివిగ బోనులొ పెట్టిన విలవిల సర్కస్సునందు విలపించెదవే
మిత్రులాఅ! శుభాశీస్సులు.ఈనాటి అందరి పద్యములు అలరించుచున్నవి. అందరికి అభినందనలు.కొన్ని సూచనలు:శ్రీమతి రాజేశ్వరి గారు:మీ పద్యములో ఆఖరి పాదమూ ఇలాగ మార్చుదాము:"నిమ్మనుజ మృగాల చేత మృతి తథ్యంబౌ"శ్రీ బొడ్డు శంకరయ్య గారు:ఉద్యమించుడు భారత యువకులార! అందాము.శ్రీ మిస్సన్న గారు:రాకసి అనుట సాధువు కాదు. రాకాసి అనవలెను.శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:జనవాడ అనుట సరికాదు - దుష్ట సమాసము అగును.వెరవు - టైపు తప్పు దొరలినది.శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారు:"తెగువతొ" మరియు "బోనులొ" అని హ్రస్వములు వాడరాదు.స్వస్తి.
యడవి చిరుతను జంపగా నంద రేక మైరి, గ్రామ మానవ మృగ మతివల నతి క్రూర హింసల బెట్టినా నేరకుండ్రిమానవత్వములేని యీ మనుజ జాతి
గురువర్యులు, పండిత నేమాని గారి సూచనతో సవరించిన పద్యము బలిమిని కలిగిన పులిననితెలివిగలిగిన నరులకడ తిరుగాడినచోసులువుగ బంధించినపుడు విలవిల సర్కస్సునందు విలపించెదవే
పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణలకు కృతజ్ఞతలు."జనవాడ కేతెంచె" బదులు "జనపదమేతెంచె" అనిమార్చాను. వెఅపు అనునది భయము అనేఅర్థముతో వ్రాశాను. వెరవు ఉపాయము గదా.భయముతోనున్న ప్రజలు మొండిగా దాన్ని చంపాలని వెళతారు గదా. దయచేసి తెలియ జేయండి.
అక్షర సవరణతో అడవి చిరుతను జంపగా నంద రేక మైరి, గ్రామ మానవ మృగ మతివల నతి క్రూర హింసల బెట్టినా నేరకుండ్రిమానవత్వములేని యీ మనుజ జాతి
శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ గారు: శుభాశీస్సులు.మీ ఉద్దేశము బాగుగనే యున్నది. వె అ పు అని టైపులో కనుపించుచున్నది. అందుచేత టైపు తప్పు అని సూచించేను. స్వస్తి.
అడవుల దోచగ తరిమిరితడబడి జన వాస మేగ తన్నిరి పులినే!కుడువగ నేదీ వదలకపుడమిన జీవించ నెంచు మూర్ఖులు జనులే!
నెమాని పండితార్యా! ధన్యవాదములు. సవరించిన నా పద్యం:కీకారణ్యము వీడుట నీకేలా చిరుత! బ్రతుక నేరవు మేమా రాకాసి మూక సంతతి నీకాయువు మూడు పొమ్ము నేటికి వనికిన్.
స్థాన బలము కానీ తన బాలము కాదు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఘోరవనము వీడి క్రూర మృగమ్ములు
రిప్లయితొలగించండిపల్లెలందు జొచ్చి పసుల జనుల
పైన దాడిజేయ పల్లెలో ప్రజలచే
జిక్కి చచ్చు టౌర! నిక్కమె కద!
అమ్మకు వాహన మైతిని
రిప్లయితొలగించండిగుమ్ముగ వనమందు దిరిగి కొలువక దేవిన్
గ్రమ్మున నేరక వచ్చితి
నిమ్మానవ మృగముల జేత నిక్కము గిట్టన్
జూన్ 5, పర్యావరణ దినోత్సవ సందర్భముగా...
రిప్లయితొలగించండికారడవులను వీడి యేకాకి గాను
మానవారణ్య మందున మనుటకొఱకు
చేరు మృగముల గానలో చేరవేయ
ఉద్యమించుము భారత యువకులార!
వనము నుండి పల్లె వాసుల యొద్దకు
రిప్లయితొలగించండిదారి తప్పి చిరుత తడబ డంగ
పల్లె జనులు జూచి వధియించ సమకట్టి
దండ వరుస జేత దాడిజే సె
కీకారణ్యము వీడుట
రిప్లయితొలగించండినీకేలా చిరుత! బ్రతుక నేరవు మేమా
రాకసి మూకల సంతతి
నీకాయువు మూడు పొమ్ము నేటికి వనికిన్.
చిఱుత జనవాడ కేతెంచె చింత తోడ
రిప్లయితొలగించండివేట గాని భాణ హతితో వేటు పడగ
కాచు వారిని గాంచక క్రాలు చుండ
వెఅపు తోడను జనులెల్ల వెంట బడిరి
బలిమిని కలిగిన పులినని
రిప్లయితొలగించండితెలివినిగల నరులకడకు తెగువతొ చనినన్
తెలివిగ బోనులొ పెట్టిన
విలవిల సర్కస్సునందు విలపించెదవే
మిత్రులాఅ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి అందరి పద్యములు అలరించుచున్నవి. అందరికి అభినందనలు.
కొన్ని సూచనలు:
శ్రీమతి రాజేశ్వరి గారు:
మీ పద్యములో ఆఖరి పాదమూ ఇలాగ మార్చుదాము:
"నిమ్మనుజ మృగాల చేత మృతి తథ్యంబౌ"
శ్రీ బొడ్డు శంకరయ్య గారు:
ఉద్యమించుడు భారత యువకులార! అందాము.
శ్రీ మిస్సన్న గారు:
రాకసి అనుట సాధువు కాదు. రాకాసి అనవలెను.
శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
జనవాడ అనుట సరికాదు - దుష్ట సమాసము అగును.
వెరవు - టైపు తప్పు దొరలినది.
శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారు:
"తెగువతొ" మరియు "బోనులొ" అని హ్రస్వములు వాడరాదు.
స్వస్తి.
యడవి చిరుతను జంపగా నంద రేక
మైరి, గ్రామ మానవ మృగ మతివల నతి
క్రూర హింసల బెట్టినా నేరకుండ్రి
మానవత్వములేని యీ మనుజ జాతి
గురువర్యులు, పండిత నేమాని గారి సూచనతో సవరించిన పద్యము
రిప్లయితొలగించండిబలిమిని కలిగిన పులినని
తెలివిగలిగిన నరులకడ తిరుగాడినచో
సులువుగ బంధించినపుడు
విలవిల సర్కస్సునందు విలపించెదవే
పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణలకు కృతజ్ఞతలు."జనవాడ కేతెంచె" బదులు "జనపదమేతెంచె" అనిమార్చాను. వెఅపు అనునది భయము అనేఅర్థముతో వ్రాశాను. వెరవు ఉపాయము గదా.భయముతోనున్న ప్రజలు మొండిగా దాన్ని చంపాలని వెళతారు గదా. దయచేసి తెలియ జేయండి.
రిప్లయితొలగించండిఅక్షర సవరణతో
రిప్లయితొలగించండిఅడవి చిరుతను జంపగా నంద రేక
మైరి, గ్రామ మానవ మృగ మతివల నతి
క్రూర హింసల బెట్టినా నేరకుండ్రి
మానవత్వములేని యీ మనుజ జాతి
శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ ఉద్దేశము బాగుగనే యున్నది. వె అ పు అని టైపులో కనుపించుచున్నది. అందుచేత టైపు తప్పు అని సూచించేను. స్వస్తి.
అడవుల దోచగ తరిమిరి
రిప్లయితొలగించండితడబడి జన వాస మేగ తన్నిరి పులినే!
కుడువగ నేదీ వదలక
పుడమిన జీవించ నెంచు మూర్ఖులు జనులే!
నెమాని పండితార్యా! ధన్యవాదములు. సవరించిన నా పద్యం:
రిప్లయితొలగించండికీకారణ్యము వీడుట
నీకేలా చిరుత! బ్రతుక నేరవు మేమా
రాకాసి మూక సంతతి
నీకాయువు మూడు పొమ్ము నేటికి వనికిన్.
స్థాన బలము కానీ తన బాలము కాదు
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి