24, జూన్ 2014, మంగళవారం

పద్యరచన - 600

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. నేల కొరిగిన కర్ణుని పై బాణమున
  నేల కొరిగిన ప్రాణము అకర్ణమై
  నల్లనయ్య చేతి కొనన అగ్ని వర్ణమై
  ఎల్ల కాలమున ప్రజ్వరిల్లె శోభాయమానమై !!

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. నిశితబాణఘాతములచే నేల కొఱగి
  నట్టి కర్ణుని ప్రాణమే యగ్నివర్ణ
  మును వహించి కృష్ణుని చేతి కొనను నేడు
  ప్రజ్వరిల్లెను నవ్యశోభలను గనుడు.

  రిప్లయితొలగించండి
 3. ఈనాటి పద్యరచనకు మరియు మొన్నటి సమస్యాపూరణం:
  దురితములు పండె, కర్ణుని
  భరియించక భూమి దేవి పడదోసె నిటుల్!
  వెరవకు మధర్మ మణచెడు
  మారణహోమమ్ము గూర్చు మహిలో శాంతిన్!

  రిప్లయితొలగించండి
 4. ధర్మమెఱిగి నడువ దైవమ్ము తోడౌను
  ధర్మము విడి దారి తప్పరాదు.
  కర్ణుడెంత బలము గలిగియున్ననుగాని
  తుదిని రణమునందు దొరికిపోయె.

  రిప్లయితొలగించండి
 5. పార్ధ ! చంపకు మఱి నన్ను బ్రణతు లిడుదు
  రధపు చక్రాలు దిగిపోయె రయము ననిట
  శాప ఫలితము లీ యవి చక్ర ధారి !
  నీకు దెలి య ని దిగలదా ?నీరజాక్ష !

  రిప్లయితొలగించండి
 6. యుద్ధరంగమందు యుద్ధనీతినివీడి
  అరధుఁ చంపనెంచె నర్జునుండు
  ఆకసంబునుండి యదిగాంచి సూర్యుండు
  మబ్బుచాటుదూరె మదన పడుచు

  రిప్లయితొలగించండి
 7. శ్రీ సుబ్బారావు గారి పద్యంలో మొదటి పంక్తి మాత్రం కర్ణుడి సహజ స్వభావానికి తగినట్లుగా లేదని నా అభిప్రాయం. " పార్ధ ! చంపకు మఱి నన్ను బ్రణతు లిడుదు " అని కర్ణుడు ప్రాధేయపడటం ఊహకందని విషయం. కర్ణుడులాంటి మహావీరుడు శత్రువుని అలా వేడుకుంటాడనుకోను.

  రిప్లయితొలగించండి
 8. అది కురు పాండవేయుల మహార ణరంగ మునందు కర్ణుడున్
  మది దృఢనిశ్చయమ్ముగొని డంబముతోడ ధనంజయోద్బలున్
  మద మడగించ పూనుకొను మాన్యుని తేరు ధరిత్రి గ్రుంగియున్
  గదలక నుండె నా స్థితిని గాంచి వధించెను బ్రార్థు డక్కటా !

  రిప్లయితొలగించండి
 9. సూతుని పుత్రుడు రధమును
  చేతులతో లేవనెత్త చిక్కడు మనకే
  చూతువదేలా పార్థా !
  నీ తూపులవదలు వాని నేలను గూల్చన్.

  రిప్లయితొలగించండి
 10. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

  రథపు చక్రము క్రుంగగ రణమునందు
  నడిగె కర్ణుడు యుద్ధము నాపు మనుచు,
  ప్రియ తనూభవుఁ జంపిన విధము దెల్పి
  కర్ణుఁ జంపగ పురిగొల్పె కంసవైరి

  రిప్లయితొలగించండి
 11. జిలేబీ గారూ,
  మన్నించాలి. మీ భావానికి పద్యరూప మిచ్చి ఆ విషయాన్ని ప్రస్తావించడం మరిచి పోయాను.
  *
  సహదేవుడు గారూ,
  ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా మీ పద్యం అలరించింది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  విన్నకోట వారి వ్యాఖ్యను గమనించారు కదా...
  ‘పార్థ కొంతతడ వని నాపంగవలయు’ అని ఆ పాదాన్ని మారుద్దామా?
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  విన్నకోట నరసింహ రావు గారూ,
  మీ అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. సంతోషం!
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. 'అరధు' పదప్రయోగము తప్పు అనివిని పద్యము మార్చాను
  రధము దిగిన వేళ రణ రంగ మందున
  నర్జునుండు కర్ణు నడచ నెంచె
  ఆకసంబునుండి యదిగాంచి సూర్యుండు
  మబ్బుచాటుదూరె మదన పడుచు

  రిప్లయితొలగించండి