ఓర కంటను జూడగ నోలతాంగి అంద గాడైన నాతని పొంద గోరి మ్రొక్కు చుండెను దేవుని ముడుపు లిడగ కొండ దేవర దీవించు మెండు గాను
అక్కయ్యా,మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.ఆ చిత్రంలో ఉన్నది శంతన మహారాజు, మత్స్యగంధి.
ఓర కంటిని జూచుచు నా ల లామమత్స్య గంధి శంతను మరల మరలభయము తోడన నిలువెల్ల వణకు చుండెపెద్ద వారల యొద్దన వినయ మదియ
సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘శంతను’ అన్నచోట గణదోషం. అక్కడ ‘మత్స్యగంధి యా శంతను’ అనికాని ‘మత్స్యగంధి శంతనుని’ అనికాని అనండి.
చెంతనె జేరిన రాజగుశంతను గని మత్స్యగంధి చంచల, మదిలోచింతను దెల్పగ, వలదనిసంతస మిడు బాసఁ జేసె సంరంభముతోన్!
సహదేవుడు గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.
వింతగ వలపును తెలిపిన శంతను గని మత్స్యగంధి సంతోషముతోచింతను దీర్చగ పెద్దలచెంతకు రమ్మనుచు పిలిచె శీఘ్రము గానే
మిస్సన్న గారూ,మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.*శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శంతనుడందురు నన్నే చెంతనునువు లేక నాకు చెలియా రాజ్యం బింతయు పట్టదు, పట్టుదు నింతీ ఓ మత్స్యగంధి యిదె నీ చేతిన్. నామీదాశను బడితివి స్వామీ శ్రీ దాశరాజు సరి నాపిత, నే నేమీ కోరను, యొప్పుగ నే మీదానగనె యడుగు నెవ్విధినైనన్.
అరిగె శంతనుండు యమునానది కడకువేటలాడునట్టి వేడ్కతోడకాంచి యచట నొక్క కనకవర్ణముగలకోమలాంగిఁ బలికె నామెతోడ.ఎచటిదాన వెవరి విందువదన యిటనోడ నడుపుచుంటి వొంటిగానుచెప్పె నామె యపుడు చిరునవ్వు నవ్వుచుదాశరాజు సుతను ధరణినాథ.తండ్రియాజ్ఞ పూని తన్మయత్వముతోడసలుపుచుంటి సేవ సంతసమునచనియె రాజు కడకు శంతన భూజానిపిల్ల నడుగ నెంచి ప్రేమతోడ.
మత్స్త్య గంధిని గాంచిన మనసు పడగ చెంత జేరుచు పలికెను శంత నుండు మరులు గొంటిని నీపైన మనువు కొఱకు కోరి వలచితి చపలాక్షి కుంద రదన
తెడ్డునుచేతబట్టుకుని తెల్లనిదేహపుకాంత,శంతనుం డొడ్డుకుచేర్చమంచడుగ,నుల్లమునందునఝల్లనంగ,రాజొడ్డుచుచేతులామెఁతనయొద్దకుబిల్చెను ,మత్స్యగంధితానడ్డగ కేలుమోడ్చె,భయమందుచు సిగ్గులమొగ్గపోలికన్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.*అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.*అక్కయ్యా,మీ పద్యం బాగుంది. అభినందనలు.*చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
నేమాని పండితార్యుల సూచనల మేరకు సవరించిన పద్యాలు:గంగా నదిలో నావను రంగుగ నడిపించు మత్స్య రమణి నొకర్తున్ చెంగున దూకెడు జింక క-నుంగవ కలదాని జూచి యుల్లము పొంగన్.శంతను డల్లదే కదిసి చక్కని చుక్కను పల్లె కన్నియా! ఇంతి! మదీయ మానసము నెంతయు దోచెను నీదు సోయగం బింత యనర్ఘ రత్నమ! యిదే నిను దోడ్కొని పోదు వీటికిన్ చెంతకు రాగదే చెలియ చేయి గ్రహించెద నంచు పల్కగా.రాజా! నేను స్వతంత్రను కాజాలను నీ కరమ్ము గ్రహియిమ్పంగన్ మోజు గలదేని నాయెడ నా జనకుని సంప్రదింప న్యాయం బనియెన్.
అడవిఁ దిరిగెడు వేళల పడతిఁ గాంచెరాజ పుత్రుడొక్కడు- నాడు ;రాణి వాసములను, వలపుల తలపుల ముచ్చటైనరీతి పంచెదనంచును లెస్స పలికె.
సాయి కిరణ్ గారి శ్లోకము....నదీప్రవాహాత్తరణంకరోతిసామత్స్యగంధిర్మృగలాంఛనాస్యా|తయాకృతంప్రేమ్ణినిమజ్జనంచఆకంఠమాలోకితశంతనస్య||
ఓర కంటను జూడగ నోలతాంగి
రిప్లయితొలగించండిఅంద గాడైన నాతని పొంద గోరి
మ్రొక్కు చుండెను దేవుని ముడుపు లిడగ
కొండ దేవర దీవించు మెండు గాను
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
ఆ చిత్రంలో ఉన్నది శంతన మహారాజు, మత్స్యగంధి.
ఓర కంటిని జూచుచు నా ల లామ
రిప్లయితొలగించండిమత్స్య గంధి శంతను మరల మరల
భయము తోడన నిలువెల్ల వణకు చుండె
పెద్ద వారల యొద్దన వినయ మదియ
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘శంతను’ అన్నచోట గణదోషం. అక్కడ ‘మత్స్యగంధి యా శంతను’ అనికాని ‘మత్స్యగంధి శంతనుని’ అనికాని అనండి.
చెంతనె జేరిన రాజగు
రిప్లయితొలగించండిశంతను గని మత్స్యగంధి చంచల, మదిలో
చింతను దెల్పగ, వలదని
సంతస మిడు బాసఁ జేసె సంరంభముతోన్!
చెంతనె జేరిన రాజగు
రిప్లయితొలగించండిశంతను గని మత్స్యగంధి చంచల, మదిలో
చింతను దెల్పగ, వలదని
సంతస మిడు బాసఁ జేసె సంరంభముతోన్!
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
వింతగ వలపును తెలిపిన
రిప్లయితొలగించండిశంతను గని మత్స్యగంధి సంతోషముతో
చింతను దీర్చగ పెద్దల
చెంతకు రమ్మనుచు పిలిచె శీఘ్రము గానే
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శంతనుడందురు నన్నే
రిప్లయితొలగించండిచెంతనునువు లేక నాకు చెలియా రాజ్యం
బింతయు పట్టదు, పట్టుదు
నింతీ ఓ మత్స్యగంధి యిదె నీ చేతిన్.
నామీదాశను బడితివి
స్వామీ శ్రీ దాశరాజు సరి నాపిత, నే
నేమీ కోరను, యొప్పుగ
నే మీదానగనె యడుగు నెవ్విధినైనన్.
అరిగె శంతనుండు యమునానది కడకు
రిప్లయితొలగించండివేటలాడునట్టి వేడ్కతోడ
కాంచి యచట నొక్క కనకవర్ణముగల
కోమలాంగిఁ బలికె నామెతోడ.
ఎచటిదాన వెవరి విందువదన యిట
నోడ నడుపుచుంటి వొంటిగాను
చెప్పె నామె యపుడు చిరునవ్వు నవ్వుచు
దాశరాజు సుతను ధరణినాథ.
తండ్రియాజ్ఞ పూని తన్మయత్వముతోడ
సలుపుచుంటి సేవ సంతసమున
చనియె రాజు కడకు శంతన భూజాని
పిల్ల నడుగ నెంచి ప్రేమతోడ.
మత్స్త్య గంధిని గాంచిన మనసు పడగ
రిప్లయితొలగించండిచెంత జేరుచు పలికెను శంత నుండు
మరులు గొంటిని నీపైన మనువు కొఱకు
కోరి వలచితి చపలాక్షి కుంద రదన
రిప్లయితొలగించండితెడ్డునుచేతబట్టుకుని తెల్లనిదేహపుకాంత,శంతనుం
డొడ్డుకుచేర్చమంచడుగ,నుల్లమునందునఝల్లనంగ,రా
జొడ్డుచుచేతులామెఁతనయొద్దకుబిల్చెను ,మత్స్యగంధితా
నడ్డగ కేలుమోడ్చె,భయమందుచు సిగ్గులమొగ్గపోలికన్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
నేమాని పండితార్యుల సూచనల మేరకు సవరించిన పద్యాలు:
రిప్లయితొలగించండిగంగా నదిలో నావను
రంగుగ నడిపించు మత్స్య రమణి నొకర్తున్
చెంగున దూకెడు జింక క-
నుంగవ కలదాని జూచి యుల్లము పొంగన్.
శంతను డల్లదే కదిసి చక్కని చుక్కను పల్లె కన్నియా!
ఇంతి! మదీయ మానసము నెంతయు దోచెను నీదు సోయగం
బింత యనర్ఘ రత్నమ! యిదే నిను దోడ్కొని పోదు వీటికిన్
చెంతకు రాగదే చెలియ చేయి గ్రహించెద నంచు పల్కగా.
రాజా! నేను స్వతంత్రను
కాజాలను నీ కరమ్ము గ్రహియిమ్పంగన్
మోజు గలదేని నాయెడ
నా జనకుని సంప్రదింప న్యాయం బనియెన్.
అడవిఁ దిరిగెడు వేళల పడతిఁ గాంచె
రిప్లయితొలగించండిరాజ పుత్రుడొక్కడు- నాడు ;రాణి వాస
ములను, వలపుల తలపుల ముచ్చటైన
రీతి పంచెదనంచును లెస్స పలికె.
సాయి కిరణ్ గారి శ్లోకము....
రిప్లయితొలగించండినదీప్రవాహాత్తరణంకరోతి
సామత్స్యగంధిర్మృగలాంఛనాస్యా|
తయాకృతంప్రేమ్ణినిమజ్జనంచ
ఆకంఠమాలోకితశంతనస్య||