మాస్టరు గారూ ! మీరు మాకోసం సమస్యలను వదలకుండా పట్టుకుంటున్నారు. కొన్ని సమస్యలు మిమ్ములను వదలకుండా పట్టుకుంటున్నాయి...మీకు మానసిక ప్రశాంతత చేకూరాలని సమస్యలు తొలగి పోవాలని కోరుకుంటున్నాను.
జిగురు వారూ ! బహుకాల దర్శనం..బాగున్నారా..సంతోషంగా ఉన్నది.
నిన్నటి సమస్యకు నాపూరణ...
సరివారు, కానివారలు సిరులేలేనట్టి వారు శ్రీమంతులునున్ దరిజేర జూచి తానొక పరి, హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్
గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. నా సమస్యలను గురించి స్పందించినందుకు ధన్యవాదాలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. ఒకే వాక్యంలో ‘తల్లిదండ్రులు’ పునరుక్తమయింది. * సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ, బహుకాల దర్శనం. సంతోషం! మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మూర్ఖమైన’ అన్నది ‘మూర్ఖులైన’ అయితే బాగుంటుంది. * సుబ్బారావు గారూ, మీకు ఫోన్ చేయలేకపోయాను. మన్నించండి. నా మనస్సు ఇంకా స్తిమితపడలేదు. తొందరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాను. * శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మంచి భావంతో పూరణ చెప్పారు. మధుసూదన్ గారు చెప్పినట్లు ఛందస్సు మార్చారు. సవరించండి. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. అగును + అనుట, అగును + అనుచు.... అన్నప్పుడు యడాగమం రాదు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధర్మా ధర్మము లనగను రిమ్మ తెగులు
రిప్లయితొలగించండితిరుగు చుండెను గగనాన తిక్క బట్టి
కన్ను గానని డాలరు మిన్ను లోన
తల్లి దండ్రుల దిట్టుటే ధర్మ మగును
సోదరులను దీవించి
రిప్లయితొలగించండిబ్లాగులో నేనొక్కదాన్నేగా అక్కని మళ్ళీ పేరెందుకు ? ఇంచక్కా అక్కయ్యా అంటే ఎంత బాగుందో!
అక్కయ్యా,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మొదటిపాదంలో యతి తప్పింది. ఆ పాదాన్ని ‘దమ్మము నధర్మము లనఁగ రిమ్మతెగులు’ అనండి.
పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, కవిపండితమిత్రులందఱికి మనఃపూర్వక నమస్కారములు!
రిప్లయితొలగించండిసంఘమునఁ జీడపురువై విషమ్ముఁ గ్రక్కు
దుష్ట దుర్మార్గవర్తను, నష్టకరుని
యాగడమ్ముల సరిచేయనట్టి యతని
తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మమగును!
మంచి దారిని చూపగా మానవులకు
రిప్లయితొలగించండిప్రథమ గురువులు వారెగా వసుధ లోన
దారిదప్పిన వారల దరిని వారి
తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.
యెల్లవేళల సుఖముల కొల్లగొనుచు
రిప్లయితొలగించండితల్లి దండ్రులు మత్తులో తనియుచుండి
పిల్లలను గని బాధ్యత విడచి నట్టి
తల్లిదండ్రుల దిట్టుటే ధర్మ మగును!
బాల్య మందున దప్పుల బట్ట కుండ
రిప్లయితొలగించండికన్న ప్రేమతో పిల్లల గాచి నంత
నడ్డు నదుపన్నదే లేక నాడి రేని
తల్లి దండ్రుల దిట్టుటే ధర్మమగును
పురిటి నొప్పులను భరించి, మూత్ర మలము
రిప్లయితొలగించండిలను కడిగి, పాలను కుడిపి, లాలబోసి,
బట్టలందించి, చదవంగ బెట్టినట్టి
తల్లిదండ్రులఁ దిట్టుటేధర్మ మగును??
మాస్టరు గారూ ! మీరు మాకోసం సమస్యలను వదలకుండా పట్టుకుంటున్నారు. కొన్ని సమస్యలు మిమ్ములను వదలకుండా పట్టుకుంటున్నాయి...మీకు మానసిక ప్రశాంతత చేకూరాలని సమస్యలు తొలగి పోవాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిజిగురు వారూ ! బహుకాల దర్శనం..బాగున్నారా..సంతోషంగా ఉన్నది.
నిన్నటి సమస్యకు నాపూరణ...
సరివారు, కానివారలు
సిరులేలేనట్టి వారు శ్రీమంతులునున్
దరిజేర జూచి తానొక
పరి, హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్
మంచి నడవడి నేర్పక, నంచెలంచె
రిప్లయితొలగించండిలతిగ గారాబమును జేసి యాత్మజులను
మొండి వారిగ బెంచిన, మూర్ఖమైన
తల్లి దండ్రుల దిట్టుట ధర్మమగును
కరము ఘోరాతి ఘోరమౌ కార్య మదియ
రిప్లయితొలగించండితల్లి దండ్రుల దిట్టుటే , ధర్మ మగును
దల్లి దండ్రుల బూజించ ధరణి యందు
తల్లి దండ్రులు సాక్షాత్తు దైవ సములు
ఆడ శిశువని తెలిసిన పీడ యనుచు
రిప్లయితొలగించండిఅంత మొందించు చుండిరి వింతగాను
సుతుడు మేలని దలచుచు శుంఠలయిన
తల్లి దండ్రుల దిట్టుటే ధర్మమగును
మల్లెల సోమనాధ శాస్త్రి, హనుమాన్ జంక్షన్ వారి పూరణలు
రిప్లయితొలగించండిఎట్టి వారికి నైనను యెగ్గునౌను
తల్లితండ్రుల తిట్టుటే; ధర్మమగును
వారి దైవాల కంటెను పావనులని
పూజ చేయంగ దగుగద పుడమి యందు
నేటి కాలంబు నందున నెటను జూడ
పాత కాలంపు వారని వారినెంచి
తల్లిదండ్రుల తిట్టుటే; ధర్మమగును
వారి యాశీస్సు లందిన పావనముగ
దేహమిచ్చి జ్ఞాన దీప మబ్బగ జేసి
రిప్లయితొలగించండిభవ్యమైన ప్రేమభాగ్య మిచ్చి
యిహ పరంబుల త్రోవ నింపుగా జూపునీ
తల్లిదండ్రుల దిట్టుటేధర్మమగును???
రిప్లయితొలగించండిపండితనేమానిగారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
“తల్లిదండ్రుల దిట్టుచో ధర్మమగును”
యనుట పొరపాటు తప్పయ్యె నచ్చు లోన
“తల్లిదండ్రులు దిట్టుచో ధర్మమగును”
యనుచు సవరించి చదువు డో యార్యులార!
అమ్మనాన్నల పట్టించు కొమ్ము సుతుడ
రిప్లయితొలగించండిబాధ్యతలను వదలి నీవు పారిపోకు
ఇలను దైవాలుగా చూడ వలసినట్టి
తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును?
కవిమిత్రులు రామకృష్ణమూర్తిగారు! తమరి పూరణ బాగున్నది...కాని...సమస్య తేఁటగీతిపాదము...పూరణము ఆటవెలఁదిపద్యము! అన్యథా భావింపక సరిచేయఁగలరు. స్వస్తి.
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
నా సమస్యలను గురించి స్పందించినందుకు ధన్యవాదాలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. ఒకే వాక్యంలో ‘తల్లిదండ్రులు’ పునరుక్తమయింది.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
బహుకాల దర్శనం. సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మూర్ఖమైన’ అన్నది ‘మూర్ఖులైన’ అయితే బాగుంటుంది.
*
సుబ్బారావు గారూ,
మీకు ఫోన్ చేయలేకపోయాను. మన్నించండి. నా మనస్సు ఇంకా స్తిమితపడలేదు. తొందరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాను.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మంచి భావంతో పూరణ చెప్పారు.
మధుసూదన్ గారు చెప్పినట్లు ఛందస్సు మార్చారు. సవరించండి.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
అగును + అనుట, అగును + అనుచు.... అన్నప్పుడు యడాగమం రాదు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిమిత్రుల సూచనకు ధన్యవాదములు. మరియు నా సవరణ
రిప్లయితొలగించండిదేహ మొసగియు విజ్ఝాన దీపమిచ్చి
భవ్య మైనట్టి ప్రేమయన్ భాగ్య మిడుచు
నిహ పరంబుల త్రోవల నింపు జూపు
తల్లితండ్రుల తిట్టుటేధర్మమగును???
రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు నమస్సులు, సవరణతో
రిప్లయితొలగించండిఎల్ల వేళల సుఖముల కొల్లగొనుచు
తనివి తీరగ మత్తులో తనియుచుండి
పిల్లలను గని బాధ్యత విడచి నట్టి
తల్లి దండ్రుల దిట్టుటే ధర్మమగును!