చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, ‘తెలుగు రాష్టము శుభముగ వెలుగు గాక!’ అంటూ మీరు చెప్పిన సీసపద్యం బాగుంది. అభినందనలు. ఆవిర్భవించేను, అనంతరం, విజయనగరం అని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. ఉభయగోదావరియు.. ఉభయగోదావరులు అనాలి కదా..
జిలేబీ గారూ, _/\_ * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. మూడవ పాదంలో ‘యువతకు’ అన్నచోట గణభంగం. ‘యువత’ అంటే సరి! * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. నాల్గవ పాదంలో యతి తప్పింది. ‘స్వాగతంబును పలుకుడు సకలజనులు’ అందామా?
రెండుచింతల రామకృష్ణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * డా. విష్ణునందన్ గారూ, తెల్గు తల్లి ఘనతన్ జాటింపరే యీ భువిన్’ అని ఆకాంక్షిస్తూ మీరు చెప్పిన శ్లోకం, పద్యం మనోహరంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.
సహదేవుడు గారూ, నవ్యాంధ్రప్రదేశ్ మీకు రైట్ (raight) గుర్తుగా, పెరిగిన గ్రాఫ్‍గా కనిపించింది. నాకేమో వీణలాగా కనిపిస్తుంది. మీ పద్యం బాగుంది. అభినందనలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, సవరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘ఆంధ్రప్రదేశ్ + అను’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘క్రొత్తగా నేర్పడె నాంధ్రప్రదేశంపు నామముగను’ అందాం.
ఆవిర్భవించేను ఆంద్ర ప్రదేశమ్ము
రిప్లయితొలగించండివిభజనానంతరం విడిగ నేడు
శ్రీకాకుళమ్మును, చిత్తూరు, నెల్లూరు,
కర్నూలు, గుంటూరు, కడప, విజయ
నగరం, ప్రకాశ, మానంత పురము, కృష్ణ,
యుభయ గోదావరియున్, విశాఖ
పట్టణంబులగూడి పదమూడు జిల్లాల
రాష్ట్రంబు మాత్రమే ర్పడెను నేడు
పూర్ణ కుంభంబు చిహ్నంబు ముచ్చటగను
రాష్ట్ర మునకొనగూడిన రాజధాని,
ప్రజలు కష్టించి పనిచేసి ప్రగతినొంద
తెలుగు రాష్టము శుభముగ వెలుగు గాక!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండి‘తెలుగు రాష్టము శుభముగ వెలుగు గాక!’ అంటూ మీరు చెప్పిన సీసపద్యం బాగుంది. అభినందనలు.
ఆవిర్భవించేను, అనంతరం, విజయనగరం అని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. ఉభయగోదావరియు.. ఉభయగోదావరులు అనాలి కదా..
పూర్ణ కుంభము తోడను పూజ లంది
రిప్లయితొలగించండిప్రజల కాహ్వాన మందించ విజయ మంచు
కరువు కాటక ములులేక కలసి మెలసి
బరువు బాధ్యత లందున మెరుపు లిడగ
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
కాకుంటే పద్యంలో ఎక్కడా సమాపకక్రియాపదం లేదు.
రిప్లయితొలగించండిపూర్ణ కుంభ సహిత
పదమూడు జిల్లా ల
అండ గా నేడు స్వస్తికయై
అలరాడు ఆంధ్ర దేశం !!
జిలేబి
navyaaMdhra velase nEDiTa
రిప్లయితొలగించండిdivyamugaa siMgapooru dESamu valenE.
suvyaapakamaMdi yuvataku
savyamugaa bhaarataana sari velugavalen
ప్రజల కోరిక లేమియు పాక్షికముగ
రిప్లయితొలగించండినొక్క రాష్ట్రము రెండుగ ముక్కలయ్యె
పూర్ణ కుంభము తోడన పొలుపు గాను
స్వాగతంబును బలుకుడు సుదతు లార !
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండి_/\_
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో ‘యువతకు’ అన్నచోట గణభంగం. ‘యువత’ అంటే సరి!
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
నాల్గవ పాదంలో యతి తప్పింది. ‘స్వాగతంబును పలుకుడు సకలజనులు’ అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆంద్రరాష్ట్ర మవతరించె నందముగను
రిప్లయితొలగించండిచక్కని సముద్ర తీరము, సంత తమ్ము
కష్టపడి పని చేసెడి కర్షకులును
కల్గి, వృద్ధి చెందును వేగ కరము శక్తి
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
నవ్య రాష్ట్రమవతరించె భవ్యముగను
రిప్లయితొలగించండిమేలుగల్గు పాలకులకు మేటిగాను
కలుగకుందురు జనులెల్ల కష్టములను
ప్రజ్ఞతోడ సాధ్యమగును ప్రగతి పథము
ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
వెలుగు పదమూడు జిల్లాల వేడుకలర
రిప్లయితొలగించండినూత్నరాష్త్రమ్ము వెలసెగా నోముపంట
పూర్ణకుంభమ్ము దీపించు మోజుతీర
ప్రగతి చక్రాల నదిపింప పాలనమ్ము
చిత్తము తోడ స్ధానమును సిద్ధము జేయుచు రాజధానిగా
రిప్లయితొలగించండిక్రొత్తగ నాంధ్రరాష్ట్రమును కోరిన చందము తీర్చి దిద్దుచున్
చిత్తము నుంచి దివ్యముగ చేయుట సాధ్యము సింగపూరుగా
పుత్తడి వంటి రాష్ట్రమును బొందెద రాంధ్రులు కోర్కెతీరగా!
maasTarugaaroo ! dhanyavaadamulu. meeru coopina savaraNatO....
రిప్లయితొలగించండినవ్యాంధ్ర వెలసె నేడిట
దివ్యముగా సింగపూరు దేశము వలెనే.
సువ్యాపకమంది యువత
సవ్యముగా భారతాన సరి వెలుగవలెన్
ప్రదక్షిణీ కృత్య మహాంధ్ర దేశం
రిప్లయితొలగించండిఅథ ప్రజానా మధిప స్తదీయాం
పరామృశన్ సార్వ జనీన బాధాం
యావద్ధరాం భర్మమయీం కరోతు !
నవ సీమాంధ్ర మహోదయమ్మిది స్థిరానంద ప్రదమ్మై మహో
త్సవమేపారఁగ నేటికిప్పుడిదిగో సాకారమై యొప్పె , స
త్కవి మూర్ధన్యులు నెమ్మనమ్మున శుభాకాంక్షాక్షతల్ చల్లి సం
స్తవముల్ సేయరె తెల్గు తల్లి ఘనతన్ జాటింపరే యీ భువిన్ ?!
రెండుచింతల రామకృష్ణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
డా. విష్ణునందన్ గారూ,
తెల్గు తల్లి ఘనతన్ జాటింపరే యీ భువిన్’ అని ఆకాంక్షిస్తూ మీరు చెప్పిన శ్లోకం, పద్యం మనోహరంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.
సరియగు జవాబు గుర్తుగ
రిప్లయితొలగించండితిరిగిన యవశేష తెలుగు దేశ పటంబున్
పరికింపగ వృద్ధిఁ దెలుపు
పెరిగెడు గీతగ (గ్రాఫుగ) దలంచి వేడెద ప్రభువా!
మాస్టారి సూచనలతో పద్యం సవరించడానికి ప్రయత్నము చేసాను. కాని సమయాభావం వలన
రిప్లయితొలగించండిసంతృప్తిగా వ్రాయలేదు :-
ఆవిర్భవించినదాంధ్ర ప్రదేశమ్ము
విభజన తరువాత విడిగ నేడు
శ్రీకాకుళమ్మును, చిత్తూరు, నెల్లూరు,
కర్నూలు, గుంటూరు, కడప, విజయ
నగరము, కృష్ణ,యనంతపురము, ప్రకా
శమును, విశాఖ పట్నమును, ఉభయ
గోదావరుల తోడ క్రొత్తగా నేర్పడె
నాంధ్ర ప్రదేశ్ యను నామముగను
పూర్ణ కుంభంబు చిహ్నంబు ముచ్చటగను
రాష్ట్ర మునకొనగూడిన రాజధాని,
ప్రజలు కష్టించి పనిచేసి ప్రగతినొంద
తెలుగు రాష్టము శుభముగ వెలుగు గాక!
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండినవ్యాంధ్రప్రదేశ్ మీకు రైట్ (raight) గుర్తుగా, పెరిగిన గ్రాఫ్‍గా కనిపించింది. నాకేమో వీణలాగా కనిపిస్తుంది.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
సవరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఆంధ్రప్రదేశ్ + అను’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘క్రొత్తగా నేర్పడె నాంధ్రప్రదేశంపు నామముగను’ అందాం.