గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, నేమాని గురుదేవులకు స్వాగతం పలికిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘గ్రంధస్థ’ టైపాటు వల్ల ‘గ్రంధస్త’ అయింది. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరయ్యగారూ, నా పూరణలోని రెండవపాదమును ముందుగా మొదటిపాదముగా లిఖించి, తదుపరి దానిని రెండవ పాదముగా నుంచి, సవరింప మఱచితిని...దోషమును గమనింపనైతిని..మన్నింపఁగలరు. దీనిని ఈ విధముగ సవరించితిని.
కేకి నాట్య మాడి క్రేంకారమునుఁ జేయు జ్ఞాని, యోగ విద్య గలుగు పక్షి, కాన, యోగ్య రహిత కాకముం బోల్పఁగాఁ గాకి కాకికాక కేకి యగునె?
పచ్చ నైన శుకము పాడగా గొంతెత్తి
రిప్లయితొలగించండిపికము పికమె గాని శుకము గాదు
నీలి నీలి నెమలి మేలిమౌ నృత్యమ్ము
కాకి కాకి కాక కేకి యగునె
కుంటి నాట్యభంగి కూచిపూడి యగునె
రిప్లయితొలగించండివర్ణ పుచ్ఛలతుక వాయసములు
నెమలివోలెయున్ననేర్పు నడక సున్న
కాకి కాకి కాక కేకి యగునె
రంగులెన్నొ కలిగి రమ్యమౌ నాట్యంపు
రిప్లయితొలగించండిహంగులెన్నొనెమలి యందములవి.
నలుపు రంగు మేన కలలు గనినను
కాకి కాకి కాక కేకి యగునె?
రంగులెన్నొ కలవు, రమ్యమౌ నాట్యంపు
రిప్లయితొలగించండిహంగులెన్నొనెమలి యందములవి.
నలుపు రంగు మేన కలలెన్ని గనినను
కాకి కాకి కాక కేకి యగునె?
కేకిజూచి కాకి కాకతో కేకీక
రిప్లయితొలగించండికోక జేసి కట్టి కూత గూయ
"కాక కాక " గాక కేకికేకలగున
కాకి కాకిగాక కేకి యగునె ?
కొందరు రాజకీయనాయకులు.........
రిప్లయితొలగించండిఎన్నికలలయందునెంతోనిబద్ధులై
చిలుకవోలె మంచి పలుకులాడి
గెలిచినంతచేతనలతి గర్వముఁబూను
కాకి కాకి కాక కేకి యగునె ?
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందలు.
‘నీలి నీలి నెమలివోలె నృత్యము సేయ/ కాకి...’ అంటే ఇంకా బాగుంటుంది.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
యం. ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నెమలివోలె నున్న...’ అనండి.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వృత్యనుప్రాసాలంకార శోభితమై మీ పూరణ అలరించింది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఎన్నికలలయందు’ అన్నారు. ఎన్నికలయందు.. అనికదా ఉండవలసింది.
మాతృ భాష లోని మధురిమ తెలియని
రిప్లయితొలగించండిమూర్ఖ డెటుల తెలుగు ముచ్చటించు
కుక్క తోక నెవడు చక్క బరచలేరు
కాకి కాకి కాక కేకి యగునె?
నేమాని వారికి స్వాగతము
రిప్లయితొలగించండిభువిని నేమాని వంశపు భూష ణుం డ !
మాతృభూమికి విచ్చేయు మాన నీ య !
రండు కుశలంబు దోడన రామ జోగి !
స్వాగ తంబులు మీకివె శతము శతము
సులభ తరముగ పయనమ్ము గలుగు నట్లు
చేయ, గోరుదు నిరతము శివుని మదిని
గీ ము చేరిన వెంటనే ప్రేమ మీ ర
తెలియ జేయుడు శుభ వార్త దేవ !మీరు .
కవి నటంచు పెక్కు గ్రంధస్త వాక్యముల్
రిప్లయితొలగించండిసంస్కృతాంధ్ర భాష సరళి బలికి
ధార, భాష, పటిమ తగురీతి జూపని
కాకి కాకి కాక కేకి యగునె?
రాజకీయమందు రౌడీలు గూండాలు
రిప్లయితొలగించండిగాంధి శిష్యులమని కధలు జెప్పి
పగను దాడి చేయు ప్రత్యర్ధు లందున
కాకి కాకి కాక కేకి యగునె ?
కేకి యీకలతికి కాకి రెక్కలకును
కేకి వోలె నింగి కెగురమనిన
కావుకావు మనును కాకి బరువుమీర
కాకి కాకి కాక కేకి యగునె ?
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....
రిప్లయితొలగించండివిషపు పాముఁ దెచ్చి ప్రేమతోఁ బెంచిన
కాటు వేసి తుదకు చేటు దెచ్చు
వక్రబుద్ధివాఁడు పావనుం డగునెట్లు
కాకి కాకి కాక కేకి యగునె.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
నేమాని గురుదేవులకు స్వాగతం పలికిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘గ్రంధస్థ’ టైపాటు వల్ల ‘గ్రంధస్త’ అయింది.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండికాక యనుచుకాకి కంఠమ్ముసవరించ
కూకు రావ మిడిన కోకిలగున
కాకి నెమిలి ననుచు గంతులు వేయంగ :
కాకి కాకి కాక కేకి యగున
ఆవసంత కాల మాగమ నంబున
రిప్లయితొలగించండికాకి కాకి కాక కేకి యగునె ?
కాకి కాకి యౌను కేకి కేకి యగును
కాకి, కేకి రంగు కాఱు నలుపు
వామన గుంత లాడు కొను భామల బొమ్మన చూచినాడ నా
రిప్లయితొలగించండిభామల మోమునన్ పనుల భారము తగ్గిన హాయి, నిప్పుడే
భామయు నాడదీ మసక బారిన యాటల, నాను లైనులో
ప్రేమగ చేయు చాటులును రేసుల నాడును కళ్ళచేటుగాన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కదను ద్రొక్కెదనని బెదరి యుత్తరుడట
రిప్లయితొలగించండిపరుగు లెట్ట బోవ పట్టి యుంచి
కౌరవాళి తోటి పోరె బృహన్నల
కాకి కాకి కాక కేకి యగునె?
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిమరియొక పూరణ
గాలి నెగురు పక్షి గణముకు కేకియే
దొర యనంగ నేటి వరకు నరయ
ఎన్నికలను గెలిచి యిపుడు ప్రభువుయైన
కాకి కాకి కాక కేకి యగున?
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
‘గణముకు’ అనరాదు.‘గణమునకు’ అనాలి. అక్కడ ‘గణమునకు కేకి’ అనండి. ‘ప్రభువు + ఐన’ అన్నప్పుడు యడాగమం రాదు.‘...యిపుడు ప్రభు వయిన’ అనండి.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పూరణ చాలా బాగుంది. అభినందనలు.
పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమస్సుమాంజలులు.
రిప్లయితొలగించండికేకి నాట్య మాడు, క్రేంకారమునుఁ జేయు,
జగతి యోగ్యపక్షి, షట్చక్ర కుండలీ
జ్ఞ్ణాని! యోగ్య రహిత కాకముం బోల్పఁగాఁ
గాకి కాకికాక కేకి యగునె?
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో ‘షట్చక్రకుండలీ’ అన్నచోట గణదోషం. సవరించండి.
మాస్టరుగారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిపితరులకిడు కూడుగతికి జేర్చును కాకి
నాట్యమాడి కేకి న౦దమొసగు
ఎవరి పనులు వారు యింపుగ జేతురు
కాకి కాకి కాక కేకి యగున
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పితరుల కుడుపు తిని గతిని...’ అంటే ఇంకా బాగుంటుందేమో?
శంకరయ్యగారూ, నా పూరణలోని రెండవపాదమును ముందుగా మొదటిపాదముగా లిఖించి, తదుపరి దానిని రెండవ పాదముగా నుంచి, సవరింప మఱచితిని...దోషమును గమనింపనైతిని..మన్నింపఁగలరు. దీనిని ఈ విధముగ సవరించితిని.
రిప్లయితొలగించండికేకి నాట్య మాడి క్రేంకారమునుఁ జేయు
జ్ఞాని, యోగ విద్య గలుగు పక్షి,
కాన, యోగ్య రహిత కాకముం బోల్పఁగాఁ
గాకి కాకికాక కేకి యగునె?
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండి‘ప్రమాదో ధీమతా మపి’!
సవరించిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
మిత్రులు శంకరయ్యగారికి నమస్కారములు. నేను మొదటఁ బేర్కొనిన "షట్చక్ర కుండలీ జ్ఞాని"ని జేర్చిన మఱియొక పూరణమునుఁ గూడ నిట నిచ్చుచుంటిని. పరిశీలింపఁగలరు.
రిప్లయితొలగించండిజగతి యోగ్యపక్షి షట్చక్ర కుండలీ
జ్ఞాని కేకిఁబోల్పఁ గాకి కెట్టి
గుణము లేవి లేవు! గుఱుతు సేసియుఁ జూడఁ
గాకి కాకికాక కేకి యగునె?
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిఈ రెండవ పూరణ ఇంకా బాగుంది. అభినందనలు.
గెలుపు బలము నిచ్చి నిలుపంగ పదవిని
రిప్లయితొలగించండివదరు బోతు రీతి వాగు నొకడు
నీలి మబ్బు జూచి నృత్యమ్ము జేసినన్
కాకి కాకి కాక కేకి యగునె?