26, జూన్ 2014, గురువారం

పద్యరచన - 602

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. ఆత్మలింగమ్ము భూమిలో నణగి పోయె
    వ్యర్ధమౌనయ్య నీశక్తి నాపుమింక
    క్షితిని గొప్పగ గోకర్ణ క్షేత్రమగుచు
    వెలయు రావణ నీపేరు వెలుగులీను.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. రావణాసురుఁడు పరమశివు మెప్పించి
    ఆత్మలింగంబుదా నందు కొనెను
    కరమందు దాఁ నుంచి కైలాస గిరినుండి
    ఆత్మలింగము తోడ నరుగు చుండ
    సాయం సమయమయ్యె సంధ్యవార్చు కొనంగ
    వేషమ్ము మార్చిన విఘ్నపతికి
    ఆత్మలింగమొసగి యతడు నదికి బోవ
    నగజాసుతుడు దాని నవనినుంచె
    ఆత్మలింగము నేలపై నానినంత
    స్థాపి తంబయ్యె లింగమాస్థానమందె
    రావణుండదిగని కోపమావహించ
    భూమినుండి దానిఁ బెఱుకఁ పూనుకొనెను

    రిప్లయితొలగించండి
  4. ఆత్మలింగము దిగబడ యవని లోని
    కంత రావణుం డెలమిని చింత నొంది
    పైకి తీయను యత్నించ బలము చాల
    కమఱి కూల బడగ నయ్యె కనుము సామి !

    రిప్లయితొలగించండి
  5. పరరమేశ్వరాత్మ లింగమ
    సుర రావణు చెంతనుండ శోభిత మెట్లౌ?
    ధరనిడె వినాయకుండట
    తిరమై గోకర్ణ మనెడు తీర్థము వెలయన్!

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ఆత్మ లింగమనుచు పర మాత్మ యిడగ
    బొజ్జ గణపతి కిచ్చెను వొజ్జ యనుచు
    తాళ జాలక నుంచెను ధరణి పైన
    బలిమి పెకలించ రావణు వలన గాదె

    రిప్లయితొలగించండి
  9. అక్కయ్యా,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వొజ్జ’ అన్నారు. వు,వూ,వొ,వోలతొ తెలుగు పదాలు లేవు. పోనీ అది పొజ్జ కావచ్చు, గసడదవాదేశం వల్ల వొజ్జ అనుకుంటే ఆ శబ్దం ఏ నిఘంటువులోను లేదు.. ఒజ్జ అనుకుంటే.. ‘ఇచ్చె తా నొజ్జ ననుచు’ అనండి.

    రిప్లయితొలగించండి
  10. నమస్కారములు
    వివరణ జేసి నందులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  11. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారము
    నా ఈ ప్రయత్నమునకు స్పందించ ప్రార్థన

    మెచ్చితి నీ తపంబునకు మిక్కిలి రావణ! యీ క్షనంబె నీ
    కిచ్చెద నాత్మ లింగ మిపుడే గొని పొమ్మిక గాని దీని నీ
    వెచ్చట నైన నేలపయి బెట్టిన దక్కదు తిర్గి చేతికిన్
    నిచ్చల బుద్ధితో నరుగు నీకు జయంబగు దానవేశ్వరా!
    ముచ్చట దీరె రావణుడు మోదముతోడను లంక జేర తా
    వచ్చుచు మార్గ మధ్యమున వాహిని లోనను సంధ్యవార్చతా
    నచ్చట మారు వేషమున నావుల దోలెడి విగ్నహర్తకు
    న్నిచ్చియు చెప్పెలింగమిది యెప్పుడు పెట్టకు మంచు ధాత్రిపై.
    పొచ్చపు వేషధారి కద పోయిన వెంటనె దానవేన్ద్రుడున
    న్నచ్చటి నేల నుంచె కడు యద్భుత లింగము వక్రతుండుడున్
    అచ్చర పాటు తోడగని యాకులుడై దశకంఠు డెత్తుచో
    సొచ్చపు శక్తి తోడనది సుంత చలించదదేమి మాయయో !

    రిప్లయితొలగించండి
  12. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ ఉత్పలమాలిక బాగున్నది. అభినందనలు.
    కొన్ని టైపాట్లున్నవి.

    రిప్లయితొలగించండి