28, జూన్ 2014, శనివారం

పద్యరచన - 604

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

 1. చిన్న పిల్లిని చూచి యా చిన్న పిల్ల
  చెలిమి చేయమనుచు తనచేయినిచ్చె
  బుల్లి పిల్లికి యొకగ్లాసు బూస్టు కలిపి,
  పాలు యిమ్మంటు మమ్మీని(తల్లిని) బ్రతిమాలాడె

  రిప్లయితొలగించండి
 2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పాలు + ఇమ్ము’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి జరుగుతుంది. అక్కడ ‘పాల నిమ్మంచు...’ అనండి.

  రిప్లయితొలగించండి
 3. మెల్లగ రావే నాతో
  పిల్లీ, మాయమ్మ నాకు పిలచుచు నిచ్చున్
  చల్లని పాలను, నీకును
  బుల్లీ నేనిత్తు నింక బుజ్జీ రావే !

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

  చిన్నతల్లి చూడ చెన్నుగా నున్నది
  పిల్లిపిల్ల జూచి వేడ్కతోడ
  దరికి జేరె వేగ తన్మయమున, చిన్ని
  ​​చెలియ దొరికెనంచు చిఱునగవున.

  రిప్లయితొలగించండి
 6. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. పిల్లి దరిజేరి కూర్చుండి పిల్ల యొకతె
  పలుకు చుండెను దానితో పలుకు లేవొ
  చిత్ర మయ్యది జూడగ చిలిపి దనము
  గాన బడెను స్ఫుటం బుగ గనుడు మీరు

  రిప్లయితొలగించండి
 8. సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. పిల్లి వచ్చెనమ్మ పిల్లి పిల్ల వచ్చె చూడవే
  నల్ల నైన చారలున్న నల్ల పిల్లి వచ్చెనే
  బుల్లి గిన్నె లోన పాలు పోసి పిల్లి కియ్యవే
  చల్ల నైన పాలు త్రాగి సంబరముగ నాడులే

  రిప్లయితొలగించండి
 10. శైలజ గారూ,
  ‘ఉత్సాహం’గా మీరు వ్రాసిన పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. చెల్లిని కదిపిన చాలును
  నుల్లము రంజిల్లు నటుల నూరక నగవున్
  చల్లని పాలను జూపిన
  పిల్లికి సంబర మటంచు ప్రియముగ గ్రోలన్

  రిప్లయితొలగించండి
 12. పిల్లు లంటె చిన్న పిల్లల కతి ప్రేమ
  కౌతుకమ్ము తోడ కలసి యుంద్రు
  పిల్లి చెంత నున్న తల్లిని మరతురు
  పిల్లి పిల్ల లన్న ప్రీతి యింక

  రిప్లయితొలగించండి
 13. అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. సవరణలకు ధన్యవాదములు మాష్టారు, సవరించిన పద్యం
  చిన్న పిల్లిని చూచి యా చిన్న పిల్ల
  చెలిమి చేయమనుచు తనచేయినిచ్చె
  బుల్లి పిల్లికి యొకగ్లాసు బూస్టు కలిపి,
  పాల నిమ్మంచు మమ్మీని(తల్లిని) బ్రతిమాలాడె

  రిప్లయితొలగించండి
 15. పిల్లి పిల్ల చిన్ని పిల్లతో వెరవక
  కలిసి మెలసి యాడ కనుల విందు!
  చిన్న నాట కలుగు జీవ కారుణ్యంబు
  మీద వంట పడని చేదు మందు!

  రిప్లయితొలగించండి