అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * జిలేబీ గారూ, మీ భావం బాగుంది. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * యం. ఆర్. చంద్రమౌళి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు Timmaji Rao Kembai గారూ! మీ పూరణలద్వారా చాలా క్రొత్త పదాలు నేర్చు కోవటానికి, క్రొత్తగా ఆలోచించటానికి మాలాంటి వారికి వీలు కలుగుతున్నది. ధన్యవాదములు.
తపసు భంగ పరచ తరుణిని పంపగా
రిప్లయితొలగించండినింద్ర సభను వీడె నిందు వదన
వయసు సొగసు హొయలు వయ్యారములు నింపి
రవిక విప్పి డాసె రమణి యతిని
రిప్లయితొలగించండికొంగు బంగారమైన చెంత సతి
చెంగు సింగారమైన సొంత పడతి
పొంగు ముదంబున గాంచి పతిని
రవిక విప్పి డాసె రమణి యతిని !!
దేవ లోకమందు దేవేరి కైనను
రిప్లయితొలగించండిచిత్ర కుండు రవిక చేర నీడు
చిత్ర కారు డెచట చిత్రము సృష్టించె
రవిక విప్పి డాసె రమణి యతిని ?
పదవి పోవు ననుచు భయపడి యింద్రుడు
రిప్లయితొలగించండిదేవ కాంత నంప, తేరి జూచి
రవిక యేల నీకు రతి కేళి యందన
రవిక విప్పి డాసె రమణి యతిని .
సాధ్విగోర ఋషిని సత్పుత్రు రూపాన
రిప్లయితొలగించండిశేషజన్మకామె జీవ మాత
బాలుడేడ్వ తల్లి పాలివ్వదగ్గరై
రవిక విప్పి డాసె రమణి యతిని
మడినిగట్టువారె మరి పాదపూజకు
రిప్లయితొలగించండిఅర్హులనుచు జెప్ప నచటివారు
కట్టి మడిని తాను కట్టిన చీరెయు
రవికవిప్పి, డాసె రమణి యతిని.
అతను డేయు పూవు టమ్ముల పొదియైన
రిప్లయితొలగించండిరవిక విప్పి డాసె రమణి. యతిని
మించు స౦యమి యగు మేటి ప్రవరుడు పొ
మ్మ౦చు తొలగ ద్రోసె యప్సరసను
రిప్లయితొలగించండిమల్లెలవారి పూరణ :దేవదేవి వేశ్య దేవుని గొల్చు నా
విప్ర దైవ చింత వీగజేసె
భోగి జేయ గోరి భోగమ్ము ఛవి జూప
రవిక విప్పి డాసె రమణి. యతిని
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
మీ భావం బాగుంది.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
యం. ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....
రిప్లయితొలగించండివంశనాశనమును వారింపఁ గోడలిన్
వ్యాసు కడకు నంపె వంశరక్ష
కాంచ సత్యవతియె కనులు మూసి యపుడు
రవిక విప్పి డాసె రమణి యతిని
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్నానమాడ నేగె సావిత్రి యుదయము
రిప్లయితొలగించండిరవిక విప్పి, డాసె రమణి యతిని
పాద పూజ జేయ పాలు పుష్ప మ్ములు
ఫలము లగరు బత్తి వత్తి తోడ
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
Vమరియొకపూరణ:గాలి లేని వేడి కాలమ్ము గద యిది
రవిక విప్పి డాసె రమణి. యతిని
దాఘమైన రేయి.తనయుడు రోదించ
చన్ను కుడిపి సుతుని చల్ల బరచె
హనుమచ్చాస్త్రి గారూ !!!!!!!!!!!
రిప్లయితొలగించండిఅక్రమ ఆశ్రమాల నడిపే స్వామి వారిని ఒక
రిప్లయితొలగించండిఆడ విలేకరి పట్టిన సందర్భంగా:
చిక్కి నారు! మీదు జిత్తులు చిత్తు! పా
రవిక! విప్పి డాసె రమణి యతిని
దా విలేఖరినని దారుణముల దృశ్య
మాధ్యమమున జూపి మాయ లెరిగి!
ఇంద్రు డంప జేరి యింపుగా మేనక
రిప్లయితొలగించండికౌశికుని గని యని "కన్ను లేల
మూసి కొందు వీవు ముని నను జూడనే-
రవిక విప్పి" డాసె రమణి యతిని.
రవిక విప్పి డాసె రమణి యతిని గోరి
రిప్లయితొలగించండికాని చెదుర లేదు కామ రహిత
యతి వరుండు, వాని మతి మార్చిరతిగూడ
చేయు చేష్ట లేవి చెల్ల లేదు
రవిక విప్పి డాసె రమణి యతిని యంచు
రిప్లయితొలగించండిపూరణములుచేయు పూజ్యులార!
మునులు తిరిగినట్టి మునుపటి యుగమున
కుట్టుబట్ట గలదెకట్టు కొనగ?
పూజ్యులు Timmaji Rao Kembai గారూ! మీ పూరణలద్వారా చాలా క్రొత్త పదాలు నేర్చు కోవటానికి, క్రొత్తగా ఆలోచించటానికి మాలాంటి వారికి వీలు కలుగుతున్నది. ధన్యవాదములు.
రిప్లయితొలగించండివాన జల్లు లోన పాప జలకమాడె
రిప్లయితొలగించండిరవిక విప్పి, డాసె రమణి యతిని
పూర్వ జన్మ సుకృత పుణ్యంబు చేతను
భక్తి తోడ జేసె పాద పూజ
పండ్ల నమ్ము నొక్క పడతి సాధువుతోడ
రిప్లయితొలగించండిపలికె తినగ పళ్ళు బలము పెరుగు
మేలిమైనపండుమేడి,పురుగులు చే
రవిక,విప్పి డాసె రమణి యతిని !!!
పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమస్సుమాంజలులు!
రిప్లయితొలగించండిస్వర్గలోకమందు సవ్యసాచినిఁ గని,
యూర్వశి మరులు గొనె! నోపలేక,
ఱవిక విప్పి, డాసె, రమణి "యతి నిరీక్ష
ణమ్ము వలవదోయి! రమ్మ"టంచు!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజంతా కొన్ని కార్యక్రమాలలో వ్యస్తుణ్ణై అలసి ఉన్న కారణంగా పూరణలను విడివిడిగా సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
వైవిధ్యంగా, చక్కని విరుపులతో, మంచి మంచి పూరణలను అందించిన....
సుబ్బారావు గారికి,
కెంబాయి తిమాజీ రావు గారికి,
సహదేవుడు గారికి,
మిస్సన్న గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
శైలజ గారికి,
మంద పీతాంబర్ గారికి,
గుండు మధుసూదన్ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమల్లెల వారి పూరణ:యతి యొకండు తాను యాతన పడుచును
యాకలనగ వాని కందజేయ
పాలనిచ్చి తాను బాధను దీర్చగా
రవిక విప్పి డాసె రమణి యతిని
వేదశాస్త్రములను విస్తారఫణితిలో
రిప్లయితొలగించండినేర్చినంత నొకతె నిష్ట,కామ
విద్య గోరివచ్చివేగమ్ము మోహమన్
రవికవిప్పి డాసె రమణి యతిని
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.