25, జూన్ 2014, బుధవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 10

రామాయణము-
చం.    అతిముదితాత్మయై (మురియు చర్మిలిచే మినుముట్టి యాని)శన్
హితమతి కైకయున్ (శితశరేక్షణ గాంచెను జిష్ణుసత్క)ళా
యుతుఁడగువాని, దా(రుణరిపుజ్జ్వలభంజనరూక్షతేజుఁ) బ్ర
స్తుతు భరతున్, మహా(విజయు శోభితలక్షణు వేల్పు లెన్నఁ)గన్. (౨౫)

భారతము-
తే.      మురియు చర్మిలిచే మినుముట్టి యా ని
శితశరేక్షణ గాంచెను జిష్ణుసత్క
రుణరిపుజ్జ్వలభంజనరూక్షతేజుఁ
విజయు శోభితలక్షణు వేల్పు లెన్న. (౨౫)

టీక- (రా) జిష్ణుసత్కళాయుతుఁడగువాని = జయశీలుని తేజము గలవాని, మహావిజయు శోభితలక్షణు = గొప్పగెలుపుకాని యొక్క ప్రకాశమానమగు స్వభావము గలవానిని.

(భా) ఆ నిశితశరేక్షణ = కుంతి; జిష్ణుసత్కరుణ = దేవేంద్రుని దయవలన; విజయు = అర్జునుని.

2 కామెంట్‌లు:

 1. అన్ని పదముల కర్ధము నరయు కొఱకు
  ఆంధ్ర భారతి జూడంగ నవసరంబు
  కలుగు మరియింక కవులు లార !
  కలిగి యుండుడు బొత్తము గరము నందు

  రిప్లయితొలగించండి
 2. సుబ్బారావు గారూ,
  ఆంధ్రభారతి గురించి వ్రాసిన పద్యం బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

  రిప్లయితొలగించండి