భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, అశోకుని మార్చిన మారణహోమం ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, గోలి వారు పేర్కొన్నట్టు మీ రూటే సపరేటు! వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కారణము లేకనే యిట
రిప్లయితొలగించండిదారుణ జీహాదు పేర దాడులు జరిపెన్
కారుణ్య రహిత, మెటులీ
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్?
ఆరని రావణ కాష్టము
రిప్లయితొలగించండిమారణ హోమమ్ము కూర్చు , మహిలో శాంతిన్
కోరిన గాంధీ మతమును
కారణ మేదైన గాని కలుగును శుభముల్
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
పూరణ :కారణ కారణుడౌ హరి
వారువమును యెక్కి కత్తి వాదర కెరగా
తీరుగ జేయగ దుర్మద
మారణ హోమమ్ము. గూర్చు మహిలో శాంతిన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వారువమును + ఎక్కి’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘వారువమే యెక్కి...’ అందాం.
కారణ జన్ముడు వలదనె
రిప్లయితొలగించండిమారణహోమమ్ము;కూర్చు మహిలో శాంతిన్
పోరు డహింసనె యనగా
వీరులు సాధించిరపుడు విశ్వ ఖ్యాతిన్
పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమస్కారములు.
రిప్లయితొలగించండిదారుణ పరరాజ్యార్జక
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్!
గోరి కళింగుల భువికై
పోరి, యశోకుండు శాంతిఁ బొందెఁ గదయ్యా!
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
మీసూచనకు ధన్యవాదములు
తీరగు ధర్మము నెరుగుచు
రిప్లయితొలగించండిమారినచో తీవ్రవాద మంతమ్మగుచో
నోరామా !జరుగదెపుడు
మారణహోమమ్ము, కూర్చు మహిలో శాంతిన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణలు...
రిప్లయితొలగించండి౧)
ధారుణి పాపము పెరిగిన
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్
శౌరి జనియించు భూమిని
పేరుకు పోయిన పతితుల పే రడగించన్.
౨)
ఏ రణ మందైన జరుగు
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్
కారణములేని కలహము
వారణ చేసెడు సమర్థపాలకు లున్నన్.
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
అశోకుని మార్చిన మారణహోమం ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పేరాశ యదియ జగతిని
రిప్లయితొలగించండిమారణ హోమమ్ము గూర్చు, మహిలో శాంతి
న్నారాముని సే వనములు
వీరా !చేయంగ గలుగు వినుమీ నిజమున్
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కూరుచు నశాంతి ద్వేషము
రిప్లయితొలగించండిమారణహోమమ్ము; కూర్చు మహిలో శాంతిన్
కారుణ్య మహింస యొకట
వేరే మార్గమ్ము లేదు విశ్వములొనన్
ప్రేరణ నాదే పార్థా!
రిప్లయితొలగించండికారణమును నీవు కాదు కర్తవు కాదే
వారణమునకు వెదుకకు సు-
మా! రణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్
దారుణ మారణ కాండకు
రిప్లయితొలగించండికారణ మరిషట్కములగు , గావున శూరుల్
ధీరులు చేసెడి షడ్రిపు
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్
కారణము లేక మనుజుల
రిప్లయితొలగించండిధారుణముగజంపునట్టి దనుజాధములన్
క్రూరమ్ముగనణచ నిలుచు
మారణ హోమమ్ము; గూర్చు మహిలో శాంతిన్!!!
మిస్సన్నగారూ ! మీ రూటే వేరు సుమా !
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
మారణ హోమమ్ము. గూర్చు మహిలో శాంతిన్
వైరము ద్వేషము కసియును
మారణ హోమమ్ము గూర్చు. మహిలో శాంతిన్
గోరిన వారల కోరిమి
కారుణ్యము భూతదయయు కలుగగ వలయున్
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
మ .సో .శాస్త్రి గారి పూరణలు
ఆరయ నశోక మౌర్యుడు
మారణ హోమమ్ముసలిపె మారెను నాపై
దోరపు శాంతికి దూతగ
మారణ హోమమ్ము గూర్చు. మహిలో శాంతిన్
భోరున నర్జును దేడ్చెను
మారణ హోమమ్ముసలుప మాధవుడనియెన్
తేరుప భూభారమ్మును
మారణ హోమమ్ము గూర్చు. మహిలో శాంతిన్
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
గోలి వారు పేర్కొన్నట్టు మీ రూటే సపరేటు! వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
చేరునె సుఖ శాంతి ముదము
రిప్లయితొలగించండిమారణహోమమ్ము తోడ మహిలో మనకున్?
కూరిమి తోడ తెలియుము కు
మార! "ణ" హోమమ్ము కూర్చు మహిలో శాంతిన్!!
ణ = జ్ఞానము
"ణ" హోమమ్ము = జ్ఞాన యజ్ఞము
తీరని వేదన గూర్చును
రిప్లయితొలగించండిమారణ హోమమ్ము, కూర్చు మహిలో శాంతిన్
నోరిమి కలిగిన జనులకు
కారణ మేదైన గాని కాంతుల నొసగున్
గురువుగారూ! ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ! అంత సీనేం లేదండీ.
బారెడు జఠరాగ్ని యణగ
రిప్లయితొలగించండితీరుగ బిర్యాని వండి తినరా! వడిగా;
కారపు బజ్జీ కలిపిన
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్!
* జఠరాగ్ని నణచ
తొలగించండి
రిప్లయితొలగించండిఏరాలమ్మగు నష్టము
మారణహోమమ్ము కూర్చు మహిలో; శాంతిన్
ధారాళమ్ముగ కోరన్
వారావధియై సహనము వచ్చు నరులకున్ !
జిలేబి
వీరులు రాహుల యోధులు
రిప్లయితొలగించండిచేరుచు నిమ్రాను తోడ చెడుగుడు లాటన్
పోరగ పాకిస్తానున
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్